మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బిరేన్ సింగ్ కాన్వాయ్ పై దాడి జరిగింది.జిరిభమ్ జిల్లాకు వెళ్తుండగా ఈ దాడి జరిగినట్టు పోలీసులు తెలిపారు.కాన్వాయ్ లోని పలు వాహనాల పై తుపాకీతో కాల్పులు జరిపినట్టు అధికారులు వెల్లడించారు.అయితే ఈ దాడి వెనుక మిలిటెంట్ల హస్తం ఉండొచ్చు అని పోలీసులు అనుమానిస్తున్నారు.శనివారం జిరిభమ్ లో హింసాత్మకమైన ఘటనలు జరిగాయి.ఈ ఘటనలో రెండు పోలీస్ ఔట్ పోస్టులు,ఫారెస్ట్ బిట్ కార్యాలయంతో పాటు సుమారుగా 65 ఇల్లులు అగ్నికి కాలి బూడిదయ్యాయి.ఢిల్లీ నుండి ఇటీవలే ఇంఫాల్ కు చేరుకున్నా ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న ప్రాంతాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు.ఆ ప్రాంతాలకు వెళ్తున్న క్రమంలోనే ఈ దాడి జరిగింది.ఈ దాడిలో ఒక సెక్యూరిటీ సిబ్బందికి గాయమైనట్టు అధికారులు తెలిపారు.