- ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పడనున్న టీడీపి కూటమి ప్రభుత్వంలో ఎంత మందికి మంత్రి పదవులు ఇస్తారనేది అనేది ఆసక్తి గా మారింది…
- విశ్వసనీయ సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మొత్తం 26 మంది మంత్రులు గా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది…
- కూటమి కాబట్టి మిగతా రెండు పార్టీలకు సముచిత స్థానం కల్పించడం తప్పదు..!
చంద్రబాబు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్య మంత్రి పోను, టీడీపీ నుండి 19 మంది, జనసేన నుండిముగ్గురు బీజేపీ నుండి ఇద్దరికి పదవులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.. అంటే మొత్తంగా టీడీపీ కి 20, జనసేనా కు 4, బీజేపీ కి రెండు పదవులు అన్నమాట..!
మంత్రి వర్గం కూర్పు పై బాబు పవన్ కసరత్తు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈరోజు రాత్రివరకు స్పష్టత తీసుకుని బీజేపీ నుండి మంత్రుల ఎంపికపై అమిత్ షా తో చర్చించే అవకాశం ఉన్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. ఈరోజు రాత్రి వరకు అమిత్ షా విజయవాడ చేరుకోనున్న నేపథ్యంలో ఆయన తో కలవడానికి ముందే రేపటి ప్రమాణ స్వీకారం అంశాలపై స్పష్టత తీసుకునే అవకాశం ఉంది.
రేపు చంద్రబాబు పవన్ తో పాటు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది…
ఏపీ లో మొత్తం 26 జిల్లాలు ఉన్నందున ప్రతీ జిల్లాకు మంత్రివర్గంలో ప్రాతినిథ్యం కల్పించే అవకాశమున్నట్లు తెలుస్తోంది!