గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల స్కాం కీలక పరిణామం చోటుచేసుకుంది.ఈ స్కాం పై దర్యాప్తు చేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ రంగంలోకి దిగింది.గొర్రెల పంపిణిలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్టు ఈడీ గుర్తించింది.ప్రివెన్షాన్ అఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈడీ ఈ స్కాం పై దర్యాప్తు చేయనుంది.సంభందించిన అధికారుల నుండి కీలక కీలక సమాచారాన్ని రాబట్టే పనిలో ఈడీ అధికారులు ఉన్నట్టు తెలుస్తుంది. గొర్రెల స్కింకు సంబధించిన వివరాలు తమకు అప్పగించాలని,లబ్ధిదారుల వివరాలు ఇవ్వాలని ఈడీ పశుసంవర్ధక శాఖ అధికారులకు లేఖ రాసింది.ఇప్పటికే ఈ స్కాంలో రూ 700కోట్ల అవినీతి జరిగినట్టు తెలుస్తుంది.ఈ స్కాం పై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.అయితే ఏసీబీ అధికారులకు మాజీ ఎండి రామ్ చందర్ నాయక్,ఒఎస్డి కళ్యాణ్ కుమార్ విచారణకు సహకరించడం లేదని ఈడీ పేర్కొండి.త్వరలో ఈ స్కాంలో కీలక వ్యక్తులను అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.