Friday, September 20, 2024
spot_img

ఆదాబ్ ఎఫెక్ట్

Must Read

‘ప్రభుత్వ స్కూల్ యూనిఫామ్ కుడితే రూ.50లు’
సర్కార్ బడులంటే గింత చులకనా.!
అనే శీర్షికతో గత నెల 21న కథనం ప్రచురణ
ఆదాబ్ కథనానికి స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం
రూ.50 నుంచి రూ.75లకు పెంచుతూ సర్కార్ నిర్ణయం
ఈ విద్యాసంవత్సరం నుంచే రూ.25లు పెంచాలని సీఎం రేవంత్ ఆదేశాలు.

“ఖద్దరు చొక్కల నాయకుల కర్చిఫ్ విలువ చేయని దుస్తులు ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది. నాణ్యత లేని పాలిస్టర్ బట్టతో, పిల్లగాళ్లకు సరితూగని కొలతలతో, గుండీలు, కుట్లు సరిగ్గాలేని దుస్తువులు ఇస్తూ ఇదే మహా అద్భుతం అని ప్రచారం చేసుకునే ప్రభుత్వాలకు నాణ్యతా ప్రమాణాలు కనిపించడం లేదా. సర్కారు బడి పిల్లల స్కూల్ యూనిఫామ్ కుట్టు కూలి రూ.50లు ఇవ్వడం సమంజసమేనా”. అంటూ మే 21న ”ప్రభుత్వ స్కూల్ యూనిఫామ్ కుడితే రూ.50లు’ అనే శీర్షికతో ఆదాబ్ హైదరాబాద్ దినపత్రికలో కథనం ప్రచురించడం జరిగింది. ‘నేను పోను తల్లో సర్కారు బడికి’ అని గవర్నమెంట్ బడులంటే జంకుతుంటే పాలకులు పనితీరు కూడా ఉండడం చూసి చలించిపోయిన ఆదాబ్ పేద పిల్లలు చదువుకునే స్కూళ్లపై దృష్టిపెట్టాలని ఆ కథనం సారాంశం. ఆదాబ్ లో వచ్చిన ఈ కథనం రాష్ట్ర ప్రభుత్వాన్ని కదిలించింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యి ప్రభుత్వ బడుల్లో చదువుకునే విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్ లకు ఇచ్చే కుట్టు కూలి రూ.25లు పెంచాలని అధికారులను ఆదేశించారు. అయితే ఇప్పటి వరకు ఇస్తున్న రూ.50లను రూ.75లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళా స్వయం సహాయక సంఘాలకు చెల్లించాల్సిన స్కూల్ యూనిఫాం కుట్టు ఛార్జీలను రూ.50 నుంచి రూ.75కి పెంచుతూ 7వ తేదీన ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళా ఎస్‌హెచ్‌జిలకు పిల్లలకు యూనిఫాం అందించే అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, ఇతర సంస్థల యూనిఫాం కుట్టించే బాధ్యతను జిల్లా కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఒక్కో జతకు రూ.50 కుట్టు ఛార్జీలు ఉంటాయని, పెంచిన ఛార్జీలు ఈ విద్యా సంవత్సరం 2024-25 నుంచి అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. సహకార సంఘాల ద్వారా డ్రైస్సులు కుట్టే మహిళా టైలర్లకు దీని ద్వారా లబ్ధి చేకూరుతుందని సర్కార్ జీవో లో వివరించింది.

ఇదీలా ఉండగా రూ.75లు కూడా టైలర్ సరిపోవని.. అలా అయితే డ్రైస్సు కుట్టడంలో నాణ్యత లోపిస్తుందనే వాదన వినిపిస్తోంది. అదే విధంగా పేదోడి పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన యూనిఫామ్స్ లో నాణ్యత ప్రమాణాలు పాటించి.. బడి పిల్లల డ్రెస్సులకు కుట్టే దర్జీకి స్టిచ్చింగ్ ఛార్జీలు కనీసం రూ.100లకు పెంచి టైలర్లను ఆదుకోవాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. రేపటి బడ్జెట్ లో విద్య కోసం 20శాతం నిధులు కేటాయించి ఛిద్రమైపోతున్న ప్రభుత్వ బడుల స్థితి గతులు మార్చాలని కోరుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థపై నిర్లక్ష్యం వహించింది. కార్పోరేట్ వ్యవస్థలను పెంచి పోషించి సర్కార్ విద్యను గాలికి వదిలేసిందని కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వమైనా ప్రతియేటా గవర్నమెంట్ స్కూల్స్ పై దృష్టిసారించి కనీస వసతులు కల్పించాలని పలువురు మేధావులు డిమాండ్ చేస్తున్నారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This