Friday, November 22, 2024
spot_img

కేసీఆర్ మెడకు పవర్

Must Read

బీఆర్ఎస్ అధినేతకు బిగ్ షాక్
యాదాద్రి పవర్ ప్లాంట్, ఛత్తీస్ గఢ్ లో విద్యుత్ కొనుగోళ్లపై కమిటీ దర్యాప్తు
కేసీఆర్ సహా 25 మందికి పవర్ కమిషన్ నోటీసులు
విద్యుత్ కొనుగోలు అంశంపై పెను దుమారం
సమాధానం ఇచ్చేందుకు జూన్ 15 డెడ్ లైన్
సమయం కావాలని కోరిన కేసీఆర్
ఢిల్లీ లిక్కర్ కేసులో తీహార్ జైలులో ఉన్న కవిత
కల్వకుంట్ల కాందాన్ లో టెన్షన్ టెన్షన్

కేసీఆర్ మెడకు పవర్ చుట్టుకుంటోంది. తెలంగాణలో విద్యుత్ కొనుగోలు అంశం పెను దుమారం రేపుతోంది. యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంతోపాటు, ఛత్తీస్ గఢ్ లో విద్యుత్ కొనుగోళ్లలో భారీ అవకతవకలు జరిగినట్లు కమిటీ తేల్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై విచారణకు ఆదేశించింది. ఇందుకోసం జస్టిస్ నరసింహారెడ్డి కమిషను ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన విద్యుత్ కాంట్రాక్టుల లోటును తీర్చాలని ఆదేశించారు. ‘అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు’ అసలే అధికారం కోల్పోయి బాధపడుతున్న కేసీఆర్ ను ఓదార్చాల్సిన లీడర్లు ఒక్కొక్కరు పార్టీ వీడుతున్నారు. మరోవైపు మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్స్ లో కోలుకోలేని దెబ్బతగిలింది. ఇదంతా చూసి తలపట్టుకుంటే ‘పుండుపై కారం చల్లినట్టు’ కేసీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. విద్యుత్ కొనుగోళ్లలో గోల్ మాల్ జరిగినట్లు దీనిపై విచారణ చేపట్టిన కమిషన్ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎంకి నోటీసులు పంపింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఛత్తీస్ గఢ్ తో జరిగిన విద్యుత్ ఒప్పందాల్లో తన పాత్రను తెలియజేయాలని నోటీసుల్లో కమిషన్ పేర్కొంది. విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో తన పాత్రను వివరించాలని కోరింది. జూన్ 15లోగా సమాధానం ఇవ్వాలని కోరింది. కాగా జూలై 30 వరకు టైం కావాలని కేసీఆర్ కమిషన్ కోరినట్లు తెలుస్తోంది.

మాజీ సీఎం కేసీఆర్ ఇచ్చే వివరణను బట్టి నేరుగా విచారణ జరిగే అవకాశం ఉంది. కాకుంటే ఆయన సమాధానం సంతృప్తికరంగా లేకుంటే విద్యుత్ కమిషన్ నేరుగా విచారణకు దిగుతామని సంకేతాలివ్వడం గమనార్హం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని పేర్కొంటూ తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో న్యాయ కమిషన్ ను నియమించింది. ఈ క్రమంలో కమిషన్ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా బీఆర్ఎస్ హయాంలో పనిచేసిన కొందరు అధికారులను విచారణకు పిలిచి పలు కీలక అంశాలపై ప్రశ్నించారు. మొన్న మాజీ సీఎండీ ప్రభాకర్ రావును విచారించిన జస్టిస్ నరసింహారెడ్డి నిన్న మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం చర్చకు దారితీస్తుంది.

మంగళవారం విద్యుత్ కమిషన్ చీఫ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 2014 నుంచి 2023 వరకు జరిగిన విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ నిర్మాణానికి సంబంధించిన మూడు అంశాలపై విచారణ కొనసాగుతోందని చెప్పారు. టెండర్ల ప్రక్రియ లేకుండా ఒప్పందాలు జరిగాయని వివరించారు. కేసీఆర్ సహా 25 మందికి నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ మాత్రం దీనికి ఇంకా సమాధానం ఇవ్వలేదని సమయం కావాలని కోరినట్లు చెప్పారు. మాజీ సీఎండీ, ఇప్పుడున్న సీఎండీ తో సమావేశం జరిపినట్లు తెలిపారు. మొన్న మాజీ సీఎండీ ప్రభాకర్ రావు, అప్పటి ప్రిన్సిపల్ సెక్రెటరీ సురేష్ చందాతో సమావేశమయ్యామని అన్నారు. మూడు నిర్ణయాలు అప్పటి ప్రభుత్వం మాత్రమే తీసుకుందన్నారు. జెన్కోలకు సంబంధం లేదన్నారు. ఎస్ కే. జోషి, అరవింద్ కుమార్ తో మంగళవారం సమావేశం అయ్యామని అన్నారు.

అరవింద్ కుమార్ అప్పుడే రెగ్యులేటరి కమిషన్ కు లేఖ రాసిన పట్టించుకోలేదని చెప్పుకొచ్చారు. రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం జరిగినప్పుడు కేంద్రానికి అధికారం ఇవ్వాలని చెప్పారు. రెండు రాష్ట్రాల ఒప్పందంతో ఛత్తీస్ గఢ్ కు అధికారం ఇచ్చారన్నారు. భారీగా నిధులు ఖర్చు చేసి పవర్ కొనుగోలు చేశారని అన్నారు. మొత్తం ప్రక్రియలో ఎంత నష్టం అనేది తేల్చాలన్నారు. భద్రాద్రిలో సబ్ క్రిటికల్ టెక్నాలజీ పెట్టారు.. అంతటా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడారని అన్నారు. యాదాద్రిలో నామినేషన్ బేస్ లో ఇచ్చారని తెలిపారు. అయినా ఇంకా పూర్తి కాలేదని, ఆగస్టు వరకు ఒక లైన్ అందుబాటులోకి అంటున్నారు కానీ రైల్వే లైన్ వెయ్యలేదన్నారు. అధికారుల నుంచే కాదు ప్రముఖులు నుంచి సమాచారం తీసుకుంటున్నట్లు జస్టిస్ నరసింహారెడ్డి పేర్కొన్నారు.

అటు కూతురు కవిత మెడకు ఢిల్లీ లిక్కర్ కేసు చుట్టుకొని దాదాపు మూడు నెలలుగా తీహార్ జైలులో ఊసలు లెక్కపెడుతోంది. ఇప్పుడు కేసీఆర్ కు పవర్ లొల్లి వచ్చిపడింది. తెలంగాణలో అంతా ఇష్టా రాజ్యమై పదేళ్లపాటు ఆడిందే ఆట పాడిందే పాటగా పాలన సాగించారు. వీళ్లు పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నందున కల్వకుంట్ల కాందాన్ అంతా చిప్పకూడు తినక తప్పదని పలువురు మేధావులు జోస్యం చెబుతున్నారు.

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS