బెంగుళూర్ రేవ్ పార్టీ కేసులో అడ్డంగా దొరికిపోయిన తెలుగు నటి హేమకు ఊరట లభించింది.జుడీష్యల్ కస్టడీలో ఉన్న హేమకు బెయిల్ మంజూరు అయింది.కేసు పై విచారణ చేపట్టిన బెంగుళూరు రూరల్ ఎన్డీపిఎస్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.హేమ తరపు న్యాయవాది మహేష్ కేసు పై వాదించారు.హేమ వద్ద ఎలాంటి డ్రగ్స్ లభించలేదని,పది రోజుల తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించారని తెలిపారు.వాదనలు విన్న కోర్టు తెలుగు నటి హేమకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.