లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్పకు ఉచ్చు బిగిసింది. పోక్సో కేసులో ఇరుక్కుపోయిన యడియూరప్పపై కోర్టు.. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆయనపై నమోదైన పోక్సో కేసును విచారణ జరిపిన బెంగళూరు కోర్టు గురువారం ఈ సంచలన ఆదేశాలు ఇచ్చింది. ఈ లైంగిక వేధింపుల కేసు దర్యాప్తులో కర్ణాటక ప్రభుత్వం జాప్యం చేస్తుందంటూ ఆరోపించిన బాధితురాలి సోదరుడు.. నిందితుడిని అరెస్ట్ చేయాలంటూ కర్ణాటక హైకోర్డును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలోనే ఈ పోక్సో కేసును విచారణ జరిపిన బెంగళూరు ఫాస్ట్ట్రాక్కోర్టు.. నాన్ బెయిలబుల్ అరెస్ట్ ఉత్తర్వులు జారీ చేసింది