పాఠ్యపుస్తకాల విభాగం డైరెక్టర్ శ్రీనివాస్ చారి,ఎస్.సి.ఈ.ఆర్.డీ డైరెక్టర్ రాధరెడ్డి పై చర్యలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.తెలుగు పాఠ్య పుస్తకంలో ముందుమాటలో సీఎం కెసిఆర్,మాజీమంత్రుల పేర్లు,అధికారుల పేర్లను మార్చకుండానే 24 లక్షల పుస్తకాలు పంపిణీ చేయడం,విద్యార్థులకు పుస్తకాలు అందజేస్తున్న సమయంలో ముందుమాటలోని తప్పులను ఉఫాద్యాయులు గుర్తించి విద్యాశాఖకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.దీంతో పిల్లలకు ఇచ్చిన పుస్తకాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డీఈవోలకు విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన ఆదేశాలు జారీ చేశారు.ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో వెంటనే పాఠ్యపుస్తకాల విభాగం డైరెక్టర్ శ్రీనివాస్ చారిను, ఎస్.సి.ఈ.ఆర్.డీ డైరెక్టర్ రాధారెడ్డిను బాద్యతల నుండి తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌గా పాఠశాల విద్యా అదనపు డైరెక్టర్ రమేశ్,ముద్రణా సేవల విభాగం డైరెక్టర్ గా రమణకుమార్ లకు బాద్యతలు అప్పగించింది.