Friday, September 5, 2025
spot_img

సీఎస్,డీజీపీ లతో సమావేశమైన ఏపీ సీఎం చంద్రబాబు

Must Read
  • పరిపాలన పై దృష్టి పెట్టిన సీఎం చంద్రబాబు
  • సచివాలయంలో సీఎస్,డీజీపీలతో భేటీ
  • ఐఎఎస్,ఐపీఎస్ అధికారులను బదిలీ చేసే అవకాశం
  • గత ప్రభుత్వ హయంలో నిబంధనలకు విరుద్దంగా పని చేసిన అధికారుల జాబితాను సిద్ధం చేసిన సీఎంవో
  • నిబంధనలకు విరుద్దంగా పని చేసిన వారి పై కేసులు పెట్టాలనే యోచనలో ప్రభుత్వం

పరిపాలన పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారు.రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా సచివాలయంలో సీఎస్,డీజీపీలతో సమావేశం అయ్యారు.రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐఎఎస్,ఐపీఎస్ అధికారులను బదిలీ చేసే యోచనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తుంది.గత వైసీపీ ప్రభుత్వం హయంలో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన అధికారుల జాబితా సీఎంవో వద్ద ఉన్నట్టు సమాచారం.గత ప్రభుత్వనికి అనుకూలంగా పని చేసిన అధికారులను ప్రభుత్వం దూరం పెట్టాలని యోచిస్తునట్లు తెలుస్తుంది.సీనియర్ ఐపీఎస్ అధికారులైన రాజేంద్రనాధ్ రెడ్డి,పీఎస్సార్ ఆంజనేయులు,కొల్లి రఘురామిరెడ్డి,ఎన్. సంజయ్, సునీల్ కుమార్ లాంటి వారి పైన బదిలీ వేటు పడే అవకాశం ఉంది.మరోవైపు గత ప్రభుత్వం హయంలో నిబంధనలకు విరుద్దంగా పనిచేసిన అధికారుల పైన కేసులు నమోదు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.తాము ఎన్నికల్లో ఇచ్చిన 05 హామీల అమలు పై ప్రణాళికా తో ముందుకు వెళ్తూ,హామీల అమలు కోసం వేగంగా పని చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీచేశారు.టీటీడి ప్రక్షాళన పైన దృష్టి పెట్టిన చంద్రబాబు టీటీడీ ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని బాద్యతల నుండి తప్పించి ఈవోగా సీనియర్ ఐఏఎస్ శ్యామలరావుకు పోస్టింగ్ ఇచ్చారు.త్వరలో అన్నీ విభాగాల్లో మార్పులు,చేర్పులు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img

More Articles Like This