దేశ ప్రధానిగా మూడోసారి బాద్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా విదేశీ పర్యటనకు వెళ్ళిన నరేంద్ర మోడీ ఢిల్లీ చేరుకున్నారు.ఇటలీలో జరిగిన జీ7 సదస్సుకు మోడీ హాజరయ్యారు.బ్రిటన్ ప్రధాని రిషి సునాక్,ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ తో ప్రత్యేకంగా సమావేశమైన మోడీ పలు విషయాల పై చర్చించారు.ఉక్రేయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తో కూడా మోడీ భేటీ అయ్యారు.ఉక్రేయిన్,రష్యా యుద్దం విషయంలో పశ్చిమ దేశలు ఒత్తిడిని అధిగమించి భారత్ స్వతంత్ర వైఖరినీ ప్రదర్శించిందని మోడీ ఈ సంధర్బంగా గుర్తుచేశారు.ఫ్రిజ్ చేసిన రష్యన్ ఆస్తుల్ని ఉపయోగించి ఉక్రేయిన్ కు 50 బిలియన్ల డాలర్లు రుణం ఇచ్చేందుకు అమెరికా ప్రతిపాదన చేసింది.దీనికి సభ్యదేశాలు అంగీకారం తెలిపాయి.రక్షణ,అంతరిక్ష,విద్య,డిజిటల్ పబ్లిక్ ఇంఫాస్ట్రక్చర్ వంటి రంగాలలో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా మోడీ,మేకరన్ చర్చలు జరిపారు.పలు కీలక విషయాల పై తమ మధ్య చర్చ జరిగినట్లు మోడీ పేర్కొన్నారు.