- జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ కి లేఖ రాసిన కెసిఆర్
- చట్టాలను,నిబంధనలను పాటిస్తూ ముందుకెళ్లాం
- ఈఆర్సీ సంస్థలు వెలువరించిన తీర్పుల పై కమిషన్లు
వేయకూడదన్న విషయం ప్రభుత్వానికి తెలియదా - తెలంగాణ ఏర్పడ్డనాడు రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తీవ్రంగా ఉంది
- రాజకీయ కక్షతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది
- జస్టిస్ నరసింహారెడ్డి వ్యాఖ్యలు ఎంతో బాధించాయి.
జస్టిస్ ఎల్.నరసింహరెడ్డి కమిషన్ కు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి,బీఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ 12 పేజీల లేఖ రాశారు.తెలంగాణలో విద్యుత్ కొనుగోలు,కొత్త ప్రాజెక్టుల నిర్మాణ టెండర్ల పై వివరణ ఇవ్వాలంటూ జస్టిస్ ఎల్.నరసింహా రెడ్డి కమిషన్ కెసిఆర్ కు పార్లమెంటు ఎన్నికల ముందే నోటీసులు ఇచ్చింది.ఎన్నికలు ఉన్నందున జులై 30 వరకు నోటీసు పై వివరణ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలని కెసిఆర్ కోరగా జూన్ 15 వరకే కమిషన్ గడువు ఇచ్చింది.దీంతో కేసీఆర్ జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ కు లేఖ రాశారు.
చట్టాలను,నిబంధనలను పాటిస్తూ ముందుకువెళ్ళమని పేర్కొన్నారు.ఈఆర్సీ సంస్థలు వెలువరించిన తీర్పుల పై కమిషన్లు వేయకూడదన్న విషయం ప్రభుత్వానికి తెలవడా అని ప్రశ్నించారు.తెలంగాణ ఏర్పడ్డనాడు రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తీవ్రంగా ఉందని,ఇది జగమెరిగిన సత్యమని అన్నారు.తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందు విద్యుత్ రంగం వల్ల ఎ ఒక్క రంగం కూడా సక్రమంగా నడవలేదని గుర్తుచేశారు.ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో పవర్ హాలీడేలు,కరెంట్ కోతలతో ఇబ్బందులు ఎదురయ్యాయని,ఆ నాడు గ్రామాల్లో ఉదయం 3 గంటలు,సాయంత్రం మూడు గంటలు కరెంటు కోతలు ఉండేవని లేఖలో తెలిపారు.దీన్ని అధిగమించేందుకు తెలంగాణకు చట్ట ప్రకారం 53.89 శాతం, ఆంధ్రకు 46.1 శాతం కేటాయించి,విభజన చట్టాన్ని ఉల్లంఘించి ఆనాటి ప్రభుత్వం తెలంగాణకు కరెంటు సరఫరా ఇవ్వలేదని విమర్శించారు ఐదు వేల మెగా వాట్ల కొరతతో తెలంగాణలోని విద్యుత్ రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడిందని లేఖలో పేర్కొన్నారు.తీవ్ర సంక్షోభంను అధిగమించి కొత్త ప్రాజెక్టులు,ప్లాంట్లను ఏర్పాటు చేశామని వెల్లడించారు.రాష్ట్రం ఏర్పడ్డనాడు 7,778 మెగా వాట్లు విద్యుత్తు ఉండేదని 7,778 నుండి 20,000 మెగా వాట్లకు పైచిలుకు చేరటం మా ప్రభుత్వానికి నిదర్శమనీ అన్నారు. తెలంగాణలో ఒకప్పుడు కరెంటు ఉంటే వార్త,ఇప్పుడు కరెంటు పోతే వార్త, రాజకీయ కక్షతోనే నన్ను, గతంలో ఉన్న మా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిటీ ఏర్పాటు చేసిందని కెసిఆర్ లేఖలో పేర్కొన్నారు.గతంలో మా ప్రభుత్వం గణనీయంగా మార్పు చూపించి అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్తును ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే అని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి పదేళ్లు పరిపాలించిన నా పేరును ప్రస్తావించడం,లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో నేను వ్యవధి అడిగితే దాన్ని కూడా ఏదో దయతల్సి ఇచ్చినట్టుగా మాట్లాడడం నాకు ఎంతో బాధ కలిగించిందని కెసిఆర్ తెలిపారు.
ఆర్థిక నష్టాన్ని లెక్కించడం మాత్రమే మిగిలి ఉందన్నట్టు మీ మాటలు స్పస్టం చేస్తున్నాయి.మీ తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని అన్నారు. విచారణ పూర్తికాక ముందే తీర్పు ప్రకటించినట్టుగా మీ మాటలున్నాయని , మీ విచారణలో నిస్పాక్షి కథ ఎంత మాత్రం కనిపించడం లేదని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు.ఇప్పుడు జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ ముందు ఎం చెప్పిన ప్రయోజనం ఉండదని,లేఖలో పేర్కొన్న అన్నీ అంశాలను పరిగణంలోకి తీసుకొని ఎంక్వయిరీ కమిషన్ బాద్యతల నుండి స్వచ్ఛందంగా వైదొలగాల్సిందిగా కెసిఆర్ విజ్ఞప్తి చేశారు.చట్టబద్ధత కలిగిన ఈఆర్‌సీ వెలువరించిన తీర్పులపై విచారణ చేయొద్దన్న కనీస జ్ఞానన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోల్పోయిందని విమర్శించారు.