- మధ్యాహ్నం 3 గంటల నుండి నగరవ్యాప్తంగా భారీ వర్షం
- భారీ వర్షంతో ప్రధాన ప్రాంతాల్లో నిలిచిపోయిన ట్రాఫిక్
- వర్షం కారణంగా ఇబ్బంది పడుతున్న వాహనదారులు
- అప్రమత్తంగా ఉండాలి అంటూ హెచ్చరించిన జీహెచ్ఎంసీ
హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది.మధ్యాహ్నం 3 తర్వాత వర్షం మొదలైంది.భారీగా వర్షం కూరుస్తుండడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.జూబ్లీహీల్స్,బంజారాహీల్స్,ఖైరతాబాద్,రాజేంద్రనగర్,కొత్తపేట,ఉప్పల్,మేడ్చల్,మాదాపూర్,గచ్చిబౌలి,కొండాపూర్,మియాపూర్,సికింద్రాబాద్,బేగంపేట్,అమీర్ పేట్,పంజగుట్ట ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.నగరంలో ఇంకొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తూనే ఉంది.వర్షం కారణంగా వాహదారులు ఇబ్బందులు పడుతున్నారు.నగరంలో చాలా చోట్ల ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడింది.భారీ వర్షం కూరుస్తుండడంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది.అవసరమైతే తప్ప బయటికి రావొద్దు అని హెచ్చరించింది.మరో గంట పాటు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.