Friday, September 5, 2025
spot_img

దుల్కర్‌ సల్మాన్‌ ‘లక్కీ భాస్కర్‌’ పాటల సందడి షురూ

Must Read

మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్‌’. గత ఏడాది ‘సార్‌’ సినిమాతో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇప్ప టికే విడుదల చేసిన టీజర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇదిలావుంటే నేడు బక్రీద్‌ పండుగ సందర్భంగా మూవీ నుంచి ఫస్ట్‌ సింగిల్‌ అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్‌.ఈ మూవీ ఫస్ట్‌ సింగిల్‌ను జూన్‌ 19న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఇక ఈ సినిమాలో దుల్కర్‌ సల్మాన్‌ బ్యాంకు ఉద్యోగిగా కనిపించబోతున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నాడు.

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img

More Articles Like This