Friday, September 5, 2025
spot_img

మేము పాలకులం కాదు,సేవకులం:సీఎం రేవంత్

Must Read
  • మల్లేపల్లిలోని ఐటీఐ ఏటీసీకి భూమిపూజ
  • ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నాం
  • 50 కోట్లతో మేడిపల్లిలో ఏటీసీని నిర్మాణం చేస్తాం
  • విద్యార్థులకు విద్య,నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే మా లక్ష్యం
  • నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రం నలుమూలల ఏటీసీలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.మల్లేపల్లిలోని ఐటీఐలో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ కి భూమి పూజ చేశారు.ఈ సంధర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ కోసం ఐటీఐలను ఏటీసీగా మారుస్తున్నామని తెలిపారు.యువతకు నైపుణ్యం ఉంటే ప్రపంచంతో పోటీ పడతారని అన్నారు.50 కోట్లతో మేడిపల్లిలో ఏటీసీని నిర్మాణం చేస్తున్నామని తెలిపారు.ప్రపంచంతో పోటీ పడలంటే సర్టిఫికేట్ తో పాటు నైపుణ్యం ఉండాలని పేర్కొన్నారు.సాంకేతిక నైపుణ్యం ఉంటేనే ఉద్యోగ అవకాశాలు ఉంటాయని అన్నారు.రాష్ట్రంలో విద్యార్థులకు విద్య,నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని,మేము పాలకులం కాదు,సేవకులం అని అన్నారు.ఐటీ రంగంలో ప్రతి నలుగురిలో ఒకరు తెలుగు వారి ఉన్నారని తెలిపారు.రూ.2324 కోట్లతో 64 ఐటీలను ఏటీసీలుగా మారుస్తున్నామని స్పస్టం చేశారు.నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని వెల్లడించారు.అనంతరం ఐటీఐలో ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీను ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు,మేయర్ గద్వాల విజయలక్ష్మీ తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు.

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img

More Articles Like This