Sunday, November 10, 2024
spot_img

నీట్ లీకేజి పై సీబీఐతో విచారణ జరిపించాలి

Must Read

(టీపీసీసీ అధికార ప్రతినిధి చనగని దయాకర్)

నీట్ లీకేజి బీజేపీ చేసిన పాపం కదా అని ప్రశ్నించారు టీపీసీసీ అధికార ప్రతినిధి చనగని దయాకర్.14 రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి చలనం కనిపించడం లేదని మండిపడ్డారు.తెలుగు రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు మీకు పట్టదా అంటూ కేంద్రమంత్రులైన బండిసంజయ్,కిషన్ రెడ్డిని ప్రశ్నించారు.దేశం మొత్తంలో 24 లక్షల మంది విద్యార్దుల భవిషత్తు అగ్యగోచరంగా మారిందని ధ్వజమెత్తారు.వైద్య విద్యలో కేంద్రం విపక్ష చూపుతుందని ఫైర్ అయ్యారు.దక్షిణాది విద్యార్థుల భవిష్యత్తు దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.గుజరాత్ కేంద్రంగా బీజేపీ పెద్దల హస్తం ఉందని లీకేజీలో భారీ మొత్తంలో ముడుపులు అందాయని విమర్శించారు.ఎన్టీఏ జనరల్ డైరెక్టర్ శుభోద్ కుమార్ వాస్తవాలను దాచి పెడుతున్నారని ,కేంద్రం పెద్దల సూచనతో వాస్తవాలను భయట పెట్టడం లేదని ఆరోపించారు.ఎన్టీఎ ఏజెన్సీ నీట్ పరీక్షను నిర్వహించడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.
రీ నీట్ నిర్వహించడం ద్యారా మెరిట్ విద్యార్థులకు న్యాయం జరుగుతుందని అన్నారు.కేంద్ర ప్రభుత్యంలో కిషన్ రెడ్డి ,బండి సంజయ్ లు కీలు బొమ్మలాగా మరీ తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని,తెలంగాణ ఆత్మగౌరవాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టారని విమర్శించారు.గతంలో ఫెలోషీప్ లో తెలుగు విద్యార్థులకు అన్యామం జరిగితే కిషన్ రెడ్డి నోరుమెదపలేదని అన్నారు.బీజేపీ నేతలు 74 మెడికల్ కళాశాలలు అక్రమంగా పెట్టుకున్నారని అన్నారు ఆరోపించారు.నీట్ లో జరిగిన లోపాల పై సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.నీట్ రద్దు అయ్యేదాకా విద్యార్థులు పోరాడాలని పిలుపునిచ్చారు.

Latest News

తెలంగాణ సర్కార్ పై మోదీ అసత్య ప్రచారాలు చేస్తున్నారు

సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర భాజపా నేతలు తెలంగాణ సర్కార్‎పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS