చిరంజీవి మాజీ అల్లుడు, శిరీష్ భరద్వాజ్ గత కొంత కాలంగా అనారోగ్యంగా ఉంటూ ఈరోజు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో అతను బాధపడుతూ ఈరోజు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. శిరీష్ భరద్వాజ్, మెగా స్టార్ చిరంజీవి రెండో కుమార్తె శ్రీజని 2007 సంవత్సరంలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత కొన్ని సంవత్సరాల తరువాత వీరిద్దరి మధ్య పొరపొచ్చలు రావటం 2014లో విడిపోవటం జరిగింది. వీరిద్దరికీ ఒక పాప కూడా పుట్టింది. తరువాత శిరీష్ భరద్వాజ్ ఇంకొక వివాహం చేసుకున్న సంగతి కూడా తెలిసిందే. శిరీష్ భరద్వాజ్ గురించి ఇంకా వివరాలు రావాల్సి వుంది. అయితే శిరీష్ భరద్వాజ్ గుండె పోటుతో మృతి చెందినట్టుగా శిరీష్ స్నేహితులు తన సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు.
కొన్నాళ్ళు రాజకీయాల్లో…
మెగాడాటర్ శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ (39) కన్నుమూశారు. గత కొద్ది కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన బుధవారం (జూన్ 19) తుదిశ్వాస విడిచారు. 2007లో శ్రీజ- శిరీష్ భరద్వాజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దలకు తెలియకుండా ఆర్య సమాజ్ లో జరిగిన ఈ వివాహం అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది. అయితే వీరి కాపురం ఎక్కువ రోజులు నిలవలేదు. మనస్పర్థలు రావడంతో 2011లో వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. అదే సమయంలో అదనపు కట్నం కోసం శిరీష్ తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని శ్రీజ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. అప్పటికే వీరికి ఒక కుమార్తె కూడా పుట్టింది. శిరీష్ నుంచి విడిపోయిన తర్వాత శ్రీజ కళ్యాణ్ దేవ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. మరోవైపు శిరీష్ భరద్వాజ్ 2019లో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ విహనను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వారు చెన్నైలోనే స్థిరపడ్డారు.
ఆ మధ్యన బీజేపీలో చేరి క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించారు శిరీష్ భరద్వాజ్. అయితే గత కొంత కాలంగా శిరీష్ తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఊపిరితిత్తుల సమస్యతో ఆయన కొద్ది రోజుల క్రితమే చెన్నైలోని ఒక ఆస్పత్రిలో చేరారు.పరిస్థితి విషమించడంతో శిరీష్ కన్నుమూశారు.