Friday, November 22, 2024
spot_img

కాలేజీల్లో ర్యాగింగ్ ను అరికట్టాలి

Must Read

అవును నిజమే ర్యాగింగ్ అనే భూతాన్ని అరికట్టాలి, దీనికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చర్యలు తీసుకోవాలి, ఆధునిక సమాజంలో రోజూ రోజూ విచ్చలవిడితనం పెరిగి ర్యాగింగ్ ఇంకా పెరుగుతూ ఉంది, ఒక పక్క టెక్నాలజీ పుణ్యమా దానిని వాడుకొని, స్కూల్స్, కాలేజ్ లలో ఎక్కువగా విద్యార్దులు ఇంటర్నెట్ మోజులో పడి, వివిధ రకాలుగా ఇబ్బందుల్లో అమాయక విద్యార్దులు ఉన్నారు బలి అవుతున్నారు, ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అటు తల్లితండ్రులకు చెప్పుకోలేక ఇటు కాలేజ్ యాజమాన్యాన్ని చెప్పలేక తిప్పలు పడుతూ చివరికి ప్రాణాలు విడుస్తున్నారు.

ర్యాగింగ్ అంటే:

అనగా కళాశాలలో సీనియర్ విద్యార్దులు కొత్తగా వచ్చిన విద్యార్దులకు అంటే జూనియర్ విద్యార్థులపై మనస్తాపం కలిగించే రీతిలో ప్రవర్తించడం, దీనిని ర్యాగింగ్ అని పిలవడం జరుగుతోంది, అయితే ముఖ్యంగా బ్రిటన్, ఆస్ట్రేలియా శ్రీలంక, మన భారత్ లాంటి దేశాలలో ఇది ఎక్కువగా ఉంది, ఒక్కో దేశంలో వివిధ రకాలుగా ఒక్కో చట్టాలు ఉన్నాయి.


చట్టం ప్రకారం శిక్ష:

అయితే ముఖ్యంగా ర్యాగింగ్ అనేది చాలా రకాలుగా ఉంటుంది, విద్యాలయం లోపల జరిగేది, మరియు కాలేజ్ అవరణ లో జరిగేది, ఇవి రెండు రకాలుగా చట్ట ప్రకారం నిషేధం, చేయబడ్డాయి, అయితే కాలేజీ బయట చేసే ర్యాగింగ్ కు అది ఒక్కోసారి సెక్షన్ మారే అవకాశం ఉంటుంది, హర్ట్, గ్రీవయస్ హర్ట్, ఉద్రేకానికి గురి చేసి బాధ కలిగించి ఆత్మహత్యకు కారణం అయితే ఇంకో విధంగా ఉంటే వాటికి ఐపిసి ప్రకారం శిక్షలు వేసే అవకాశం ఉంది, అయితే ముఖ్యంగా ర్యాగింగ్ చేసిన వ్యక్తి కి కనీసం ఆరు నెలలు శిక్ష పడే అవకాశం ఉంటుంది, అదే విధంగా ఒక్కోసారి ఫైన్ కూడా విధించవచ్చు, ఇంకా తీవ్రతను బట్టి శిక్ష పెరిగే అవకాశం కలదు.కాబట్టి దీనిని అనుసరించి ప్రతి ఒక్క విద్యార్థి ర్యాగింగ్ చేసే ముందు ఆలోచన చేసి అలాంటి పనులు చేయకుండా ఉండే విధంగా నడుచుకోవాలి,

యాంటి ర్యాగింగ్ టీం:

అయితే గతంలో ఇంజినీరింగ్, మెడిసిన్, డిగ్రీ లాంటి కాలేజ్ లలో అధికంగా ఉండటం మనం చూశాం, ఎక్కువగా మెడిసిన్ ఇంజినీరింగ్ అయితే మరి ఎక్కువగా ఉంటుంది, ఇటీవల కాలం చాలా సంఘటనలు చూశాం, ప్రతి ఒక్క కాలేజ్ లు యాంటి ర్యాగింగ్ టీం పెట్టీ ఎప్పుడు పరిశీలన చేస్తూ ఉండాలి, ఇది కాలేజ్ యాజమాన్యం కూడా ఇవి అరికట్టే విధంగా చేయాలి, ముఖ్యంగా వాళ్ళ పాత్రే ఎక్కువగా ఉంటుంది, విలు కాలేజ్ మొదట్లో జరిగే ఫ్రెషీస్ పార్టీలలో చెప్పాలి, ర్యాగింగ్ వల్ల కలిగే అనర్థాలు, ఎంటి అని, తల్లితండ్రులు కూడా పిలిచి మండలించాలి, ఇలా చేస్తే కొంత మేర అరికట్టే అవకాశం ఉంటుంది.

సమాజం భాగస్వామ్యం:

వ్యవస్థ లో కూడా అందరూ భాగస్వామ్యం అయ్యి ఇలాంటి సమాజానికి ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి బాధ్యత అందరిపై ఉంటుంది అని చెప్పవచ్చు, అటు విద్యార్దులు, యువకులు, మహిళలు, ఉద్యోగస్తులు అందరూ మీ పిల్లలకు ఇంట్లోనే నేర్పే విధంగా చూడాలి,అలా కొంత మేర కట్టడి చేయటానికి అనుకూలంగా ఉంటుంది. జై హింద్

-కిరణ్ ఫిషర్ అడ్వకేట్
లా పాయింట్ తెలంగాణ
సెల్: 7989381219

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS