- విజయవాడలో నకిలీ మహీంద్రా,పియాజియో విడిభాగాలను తయారు చేసి విక్రయిస్తున్న శ్రీకాంత్ ఎంటర్ ప్రైజెస్
- రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు
విజయవాడలో నకిలీ విడిభాగాలు తయారు చేసి వాటిని విక్రయిస్తున్న తయారీదారులను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.నగరంలోని బావాజీపేటలోని శ్రీకాంత్ ఎంటర్ ప్రైజెస్‌లో దాడులు నిర్వహించి నకిలీ మహీంద్రా,పియాజియో విడిభాగాలను స్వాధీనం చేసుకున్నారు.పక్కగా అందిన సమాచారంతో విజయవాడ పోలీసులు ఈ దాడి చేశారు.ఎన్టీఆర్ జిల్లా పొలిసు కమిషనర్ సహాయంతో నగరంలోని బావాజీపేటలో ఈ దాడులు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.శ్రీకాంత్ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన (36) ఏళ్ల శ్రీకాంత్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. సెక్షన్ 63 మరియు 420 కింద నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారునకిలీ విడిభాగాలు తయారీ వెనుక ఎవరెవరు ఉన్నారనేదానిపై మరింత లోతుగా విచారణ చేస్తామని పొలిసు అధికారులు తెలిపారు.