- హైదరాబాద్ శాంతి భద్రతల పై ప్రత్యేకదృష్టి పెట్టిన సీఎం రేవంత్
- గత కొన్ని రోజులుగా నగరంలో జరుగుతున్న వరుస ఘటనల పై పోలీసుశాఖకి కీలక ఆదేశాలు జారీచేసిన ప్రభుత్వం
- రాత్రి 11 లోపే వ్యాపార సముదాయాలు మూసివేయాలని ప్రకటించిన పోలీసులు
- అర్ధరాత్రి ఎవరైనా తిరిగితే కఠిన చర్యలు తప్పవు
- గస్తీ పెంచాలని నిర్ణయించిన పోలీసుశాఖ
హైదరాబాద్ శాంతిభద్రతల పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో హైదరాబాద్ పోలీసుశాఖ కీలక ప్రకటన చేసింది.
నగరంలో రాత్రి 10:30 గంటలకు వ్యాపార సముదాయాలు మూసివేయాలని ప్రకటించారు.గత కొన్ని రోజులుగా నగరంలో పలు చోట్ల హత్యలు,హత్యయత్నలు,చోరీలు లాంటి వరుస ఘటనలు జరుగుతుండడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాంతి భద్రతల పై ప్రత్యేక దృష్టి పెట్టారు.ఈ క్రమంలోనే పోలీసు శాఖకు కీలక ఆదేశాలు జారీచేశారు.బహిరంగ ప్రదేశాల్లో అల్లర్లు సృష్టించొద్దని,అర్ధరాత్రి ఎవరైనా తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీచేశారు.వరుస ఘటనలతో నగరంలో గస్తీ తో పాటు పెట్రోలింగ్ నిర్వహించాలని పోలీసు శాఖ నిర్ణయించింది.రూల్స్ పాటించని వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు.