Friday, November 22, 2024
spot_img

అక్ర‌మార్కుల‌కు అండ‌గా ఎమ్మార్వో

Must Read
  • యధేచ్చగా అక్రమ భూ రిజిస్ట్రేషన్లు
  • గుంట, అర‌గుంట కూడా చేస్తున్న రాజ‌పేట‌ తహాశీల్ధార్ దామోద‌ర్‌
  • ఆఫ‌ర్ల‌ పేరుతో జేఎన్ఆర్ ఇన్‌ఫ్రా భారీ మోసం
  • యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా బొందుగుల్లలో ఫ్రీ లాంచింగ్
  • స‌.నెం. 762, 763లోని 8 ఎక‌రాల 26 గుంట‌ల్లో వెంచర్
  • ధ‌ర‌ణిలో సంస్థ పేరుతో ఎలాంటి భూమి లేదు
  • అయినా ఎరా గ్రీన్ ఫామ్ ప్లాట్స్ పేరిట సేల్
  • జేఎన్ఆర్ కు రెవెన్యూ అధికారులు ఫుల్ సపోర్ట్
  • విధుల నిర్ల‌క్ష్యంలో తహాశీల్ధార్ కు షోకాజ్ నోటీస్‌

‘అడుక్కునే వాడికి అరవైఆరు కూరలు’ అన్నట్టు రియల్ ఎస్టేట్ దందా చేసేటోళ్లు కూడా పైసలు సంపాదించుడే చాలా ఈజీ. అమాయక ప్రజలను బోల్తా కొట్టించి.. ఏదోలా భూములను అధిక ధరలకు అంటగట్టి జేబులు నింపుకుంటారు. రెవెన్యూ అధికారుల అండదండలతో అసైండ్, ఫామ్ ల్యాండ్స్ ను వెంచర్లుగా చేసి ప్లాట్స్ అమ్ముకునుడే పనిగా పెట్టుకుంటారు. ‘ఉట్టి గొడ్డుకి అరుపులెక్కువన్నట్లు’ అసలు ధరణిలాంటి ప్రభుత్వ రికార్డుల్లో తమ సంస్థ పేరిట ఎలాంటి భూమి లేకున్నా మాది అని మాయమాటలు చెప్పి సేల్ చేస్తున్నారు. పేద ప్రజలు అగ్గువకు జాగ వస్తుందని ఆశతో ఆ స్థలం కొంటే ఆ తర్వాత తెలుస్తుంది మోసపోయారని. తెలంగాణ రాష్ట్రం వచ్చిన కానుంచి భూములకు రెక్కలు వచ్చాయి. మరీ హైదరాబాద్ చుట్టు ఆనుకుని ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో అయితే మరీ ఎక్కువ. ఎందుకు పనికిరాని స్థలాలను కూడా బంగారమొలె అమ్ముతూ ఏం తెల్వని వాళ్లకు టోఫిలు పెడుతున్న రియల్ ఎస్టేట్ సంస్థలు, భూములను అమ్ముకునే వ్యాపారులు. ఇలాంటి కోవకే చెందినది జేఎన్ఆర్ ఇన్ ఫ్రా కంపెనీ. దీంట్లో భూమి కొన్నారంటే అంతే సంగతి.

వివరాల్లోకి వెళితే… యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో మ‌రో ఫ్రీ లాంచ్ పేరుతో జేఎన్ఆర్ ఇన్‌ఫ్రా భారీ కుట్రకు తెరలేపింది. రాజాపేట మండ‌లంలోని బొందుగుల్ల గ్రామంలో కొత్త ప్రాజెక్టు ప్రారంభించింది. ఫామ్ ప్లాట్స్ కోసం ఫ్రీ లాంచ్ ఆఫ‌ర్ల‌తో జేఎన్ఆర్ ఇన్‌ఫ్రా సంస్థ చైర్మ‌న్ సుప్రియ ప‌సుమ‌ర్తి భారీ మోసాలకు పాల్ప‌డుతున్నారు. ‘ఆలస్యం అమృతం విషం’అన్నట్టు ఆఫర్ల పేరుతో జేఎన్ఆర్ ఇన్‌ఫ్రా ఎరా గ్రీన్ ఫామ్ ప్లాట్స్ అమ్మజూపుతూ ప్రజలను నిండా ముంచుతున్నారు. కలర్ ఫుల్ బ్రోచ‌ర్స్‌ ఫ్రింట్ చేసి ఫ్రీ లాంచ్ అని అమాయకులను ‘ఇల్లు పీకి పందిరి వేసినంత’ పనిచేస్తున్నారు. ఫామ్ ల్యాండ్స్ ను అమ్ముతూ లక్షల్లో డ‌బ్బులు వ‌సూలు చేస్తున్నారు. స‌ర్వే నెంబ‌ర్ 762, 763ల‌లోని 8 ఎక‌రాల 26 గుంట‌ల్లో కొత్తగా వెంచర్ చేశారు. అయితే దీనికోసం గవర్నమెంట్ నుండి ఎలాంటి పర్మిషన్లు లేకుండా ఫామ్ ప్లాట్స్ పేరుతో సేల్ చేస్తూ సామాన్యుల‌ను ద‌గా చేస్తున్నారు. ఒక్కో ప్లాట్ కు ఒక్కో రేటు అంటూ ఆఫర్ పెట్టి మోసం చేస్తున్నారు. అర‌గుంట అయితే రూ. 2,50,000, గుంట అయితే రూ. 4,50,000, 5 గుంట‌లు అయితే రూ. 25,00,000 + సింగ‌ల్ బెడ్‌రూం క‌ట్టించి ఇస్తున్న‌ట్లు అమాయక జనాల‌ నుంచి అందినకాడిని దోచుకుంటున్నారు. జేఎన్ఆర్ ఇన్‌ఫ్రా బుకింగ్ స‌మ‌యంలో ఫుల్ పేమెంట్ చెల్లిస్తే 61 గ‌జాల‌కు గ్రాము బంగారం, గుంట అయితే 2 గ్రాముల బంగారం, 3 గుంట‌ల అయితే ఒక ట్యాబ్‌, 5 గుంట‌ల అయితే గోవా టూర్, 10 గుంట‌లు అయితే ఐఫోన్, 15 గుంట‌లు అయితే స్కూటి లేక బైక్‌, 30 గుంట‌లు అయితే బులెట్ అంటూ కస్టమర్లను బోల్తా కొట్టించే భారీ ఆఫ‌ర్లు పెట్టడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.

గుంట, అరగుంట, పావుగుంట భూమి సైతం అమ్ముతూ అమాయకుల నుంచి లక్షల్లో పైసలు వసూలు అటకాయిస్తున్నారు. రెవెన్యూ అధికారుల అండదండలతో ఫామ్ ల్యాండ్స్ ను ఈజీగా అమ్ముజూపుతున్నారు. ఎలాంటి అనుమతులు, సంస్థ పేరు, య‌జ‌మానుల పేరున కానీ భూమి ధరణిలో లేకున్నా కూడా భూములు అమ్మడం అనుమానాలు తలెత్తుతున్నాయి. తహాశీల్ధార్, రెవెన్యూ అధికారులు జేఎన్ఆర్ ఇన్ ఫ్రా సంస్థ చేస్తున్న మోసాలకు ఎవరూ అడ్డుచెప్పక పోవడం గమనార్హం. జేఎన్ఆర్ ఎరా గ్రీన్ ఫామ్స్ ఆఫ‌ర్ అంటూ అమాయకులను మోసే ప్ర‌గ్బాలు ప‌లుకుతుంది. 100 శాతం వాస్తు, క్లియ‌ర్ టైటిల్‌, వికెండ్ హోమ్స్‌, స్పాట్ రిజిస్ట్రేష‌న్‌, పొల్యూష‌న్ ఫ్రీ ఎన్విరాన్‌మెంట్, సిజ‌న‌ల్ ఫ్రూట్స్ మొక్క‌లు, ఇంట‌ర్ క్రాప్ సిస్ట‌మ్‌, డ్రిప్ ఇరిగేష‌న్‌, 24 గంట‌ల సెక్యూరిటీ, 25-30 ఫీట్ల రోడ్లు అని బ్రోజర్లు చెబుతూ జేఎన్ఆర్ ఎరా గ్రీన్ ఫామ్ ప్లాట్స్ జనాల్ని బురిడి కొట్టించే పనిలో పడింది. ప్రభుత్వ వెబ్ సైట్ ధ‌ర‌ణిలో స‌ర్వే నెంబ‌ర్ 762, 763ల‌లో సంస్థ పేరుతో గానీ, స‌భ్యుల‌కు ఎలాంటి భూమి లేకున్నా ఎరా గ్రీన్ ఫామ్ ప్లాట్స్ ఎలా అమ్మ‌కాలు జ‌రుపుతుంది అనేది వెయ్యి డాలర్ల ప్రశ్న.

ఎలాంటి పర్మిషన్లు లేకున్నా, ఫామ్ ల్యాండ్స్ అమ్ముతూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఎందుకు రెవెన్యూ శాఖ నిద్రమత్తులో ఉందో అంతుచిక్కడం లేదు. రెవెన్యూ శాఖ పూర్తి సహకారంతోనే ఈ దోపిడీ జరుగుతున్నట్లు ప్రచారం అవుతున్నది. అలాగే జేఎన్ఆర్ సంస్థ చైర్మ‌న్ కు రెవెన్యూ సహా రాజకీయ నేతల సపోర్ట్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అధిక రేట్లకు ఫామ్ ల్యాండ్స్ సేల్ చేస్తున్న జేఎన్ఆర్ ఇన్‌ఫ్రా చైర్మ‌న్ సుప్రియ ప‌సుమ‌ర్తిపై, స‌భ్యుల‌పై యాదాద్రి జిల్లా కలెక్టర్ దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Latest News

అమెరికా అభియోగాలపై నిగ్గు తేల్చాలి

భారతదేశంలో సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకునేందుకు గౌతమ్ అదానీ, సాగర్ ఆర్ అదానీ, వినీత్ ఎస్ జైన్‌ సహా ఏడుగురు $250 మిలియన్ల (రూ. 2,100...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS