ఉద్యోగం అంటూ ఉదయాన్నే లేచివెళ్ళే “నాన్న” ఇంటిపట్టున ఉండలేడు..కంటినిండా నిద్రపోలేడు..
ఇంటినేకాదు,అందర్నీ ఒంటిస్తంభంలా మోస్తున్న”నాన్న” ఎప్పుడూ ఒంటరివాడే..
సంపాదనంతా కుటుంబానికే వెచ్చించే, మిగిలింది దాచి, పిల్లల్ని మెరుగు పట్టడం కోసం,పదును పెట్టడంకోసం ఆంక్షల్నీ శిక్షల్నీ రచించి, తాను శత్రువై, కుటుంబ సౌఖ్యంకోసం ఇంటా,బయటా నిరంతర పోరాటం
చేసే నిస్వార్ధ యోధుడు “నాన్న. అమ్మ” కొవ్వొత్తే కరిగిపోతూ వెలుగునిస్తుంది.
“నాన్న” అగ్గిపుల్ల – ఆ వెలుగుకు నాంది.
- తాండూర్ వెంకటేష్.