Friday, September 20, 2024
spot_img

పటాన్ చెరువు టీఎస్ఐఐసీలో భారీ అవినీతి తిమింగలం..

Must Read
  • అప్పనంగా ప్రభుత్వ స్థలాలను ప్రైవేట్ పరం చేస్తున్న జడ్.ఎం. అనురాధ..
  • కోట్లు విలువ చేసే స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం..
  • చర్యలు తీసుకోవాల్సిన అనురాధ రూ.70 లక్షలు తీసుకోవాల్సిన అవసరం ఏమి వచ్చింది..?
  • అక్రమ నిర్మాణాలను నేటికీ కూల్చివేయని అవినీతి అధికారి..
  • ఆక్రమాలను సక్రమం చేసే పనిలోనే కాలం గడుపుతున్న దుర్మార్గం..
  • మీ దగ్గర మస్తు కాసులు వున్నాయా..? ఇక టి.ఏస్.ఐ.ఐ.సి స్థలాలు మీకు సొంతం..
  • జోనల్ కమిషనర్ అనురాధ వ్యవహార తీరు దేనికి సంకేతం..
  • ఉన్నతాధికారులకు సైతం వాటాలు ముట్టాయని అనుమానాలు..
  • ఎలక్షన్ కమీషన్ అనురాధ లాంటి అధికారులపై చర్యలు తీసుకోదా..?
  • హవ్వ నవ్విపోదురు గాక జోనల్ మేనేజర్ కు ఎలక్షన్ కోడ్ వర్తించదా..?

ప్రపంచ వ్యాప్తంగా మాతృ దినోత్సవ వేడుకలు జరిగాయి.. మహిళ అయిన తల్లికి పాదాభివందనాలు చేసి ఆశీస్సులు అందుకున్నారు అందరూ.. ఒక పవిత్రమైన స్థానంలో వుండవలసిన ఒక మహిళా అధికారి,గతి తప్పి అవినీతి భాగోతాలకు తెరలేపితే, అందరి ఇళ్ళల్లో రానుండలేక ఒక మాతృ మూర్తిని సృష్టించిన ఆ దేవుడు ఈ అవినీతి మహిళా అధికారిని చూసి సిగ్గుతో తలోంచుకున్నాడు.. అలాంటి మహిళా అధికారి అవినీతి చరిత్ర ఇప్పుడు పఠాన్ చెరులో చక్కర్లు కొడుతోంది.. అందరినీ విస్మయానికి గురిచేస్తోంది..

సంగారెడ్డి జిల్లా, పటాన్ చెరు నియోజకవర్గం, రామచంద్రపురం మెయిన్ రోడ్ లో బహిరంగ మార్కెట్ లో కోట్లు విలువచేసే టిఎస్ఐఐసి స్థలం ఉంది.. ఇట్టి స్థలాన్ని పటాన్ చెరు స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏపీఐఐసీ లీజుకు ఇచ్చింది అనే విషయం తెలిసింది.. సంబంధిత వ్యక్తి లీజు నిబంధనలు ఉల్లంఘించి తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ అనుమతి లేకుండానే కాసులకు కక్కుర్తి పడి.. చారు టైల్స్ అండ్ గ్రానైట్స్ సేల్స్ షో రూమ్, ఫైల్ నెక్స్ట్ సేల్స్ షోరూమ్, లక్ష్మీ మార్బు ల్స్ సేల్స్ షోరూం, హైటెక్స్ మార్బుల్స్ సేల్స్ షోరూం, హర్ష టయోటా కార్ షోరూమ్ లకు లీజు నిబంధనలు ఉల్లంఘించి, కిరాయిల పేరుతో ఇచ్చినట్లుగా తెలిసింది.. బరితెగించిన షోరూముల యాజమాన్యాలు బహిరంగ మార్కెట్ లో కోట్లలో ఉన్న స్థలం అతి తక్కువ ధరలో వస్తుందన్న ఉద్దేశంతో దొడ్డిదారిన టిఎస్ ఐఐసి నోటీసులను బేకాతరు చేస్తూ.. ఏదేచ్ఛగా భారీ నిర్మాణాలు చేశారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.. కోట్ల విలువైన స్థలము నిబంధనలను తుంగలో తొక్కి పటాన్ చెరు జోనల్ మేనేజర్ అండ్ కమిషనర్ అనురాధ ఈ వ్యవహారంలో భారీ అవినీతికి పాల్పడ్డదని ఆరోపణలు ఉన్నాయి… అక్రమ నిర్మాణాలని ప్రాథమిక దశలోనే తెలిసినా జోనల్ మేనేజర్ అక్రమ నిర్మాణాలు చేస్తున్న సదరు షోరూం లకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకొని ఆ వైపు కన్నెత్తి చూడలేదు అని బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి.. నోటీసులు ఇచ్చాక పూర్తిస్థాయిలో నిర్మాణాలు పూర్తి అవ్వడం చూస్తుంటే సదరు అధికారి అవినీతి అక్రమాలకు పాల్పడ్డదని తేటతెల్లమవుతుంది.. అంతేకాకుండా టీఎస్ఐఐసి స్థలాలను పరిరక్షించాల్సిన జోనల్ మేనేజర్ ఇలా బడా షోరూం లకు అమ్ముడుపోయి ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సినటువంటి స్థలాలను ప్రైవేటు పరం చేస్తుందనే ఆరోపణలు సైతం ఉన్నాయి.. ఒకవేళ టీఎస్ఐఐసి స్థలాలు కంపెనీలకే అలర్ట్ చేయాలి అనుకున్నప్పుడు టిఎస్ఐఐసి నిబంధనల ప్రకారం ప్రభుత్వ అనుమతితో కంపెనీలకు అలర్ట్ చేయాలి.. అని టీయస్ ఐఐ స్థలంలో కమర్షియల్ నిర్మాణాలు చేపట్టినా వాటిని కూల్చకుండా పరోక్ష సహకారం అందించి, అందిన కాడికి దోచుకొని ఆ వైపు కన్నెత్తి చూడకుండా ఉండడంపై తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉన్నతాధికారులు నేటికీ ఎందుకు దృష్టిసారించలేదు అన్నది ప్రశ్నర్ధకంగా మారింది..? జోనల్ మేనేజర్ అండ్ కమిషనర్ గా విధులు వెలగబెడుతున్న అధికారి కార్యాలయానికి వెళితే అందుబాటులో ఉండదు.. ఫోన్ చేస్తే స్పందించదు.. వాట్సాప్ ద్వారా వివరణ కోరితే అట్టి నెంబర్ బ్లాక్ లో పెడుతుంది.. ఇలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడే అధికారులు ప్రజలకు జవాబుదారీగా లేనప్పుడు ఉన్నతాధికారులు ఎందుకు తొలగించడం లేదు.. పారదర్శకంగా విధులు నిర్వర్తించని అధికారులు టీఎస్ఐఐసి స్థలాలను ఎలా పరిరక్షిస్తారన్న విషయాన్ని స్థానికులు ప్రశ్నిస్తున్నారు..

ఉప్పల విజయ్ ఎవరు..? అక్రమ నిర్మాణాలకు ఇతగాడికి సంబంధం ఏంటి..?
జోనల్ మేనేజర్ అక్రమ వ్యవహారంపై వార్త ప్రచురిస్తే ఉప్పల విజయ్ తో ఫోన్ చేయించాల్సిన అవసరం ఏమి వచ్చింది.. ఉప్పల విజయ్ ఆదాబ్ ప్రతినిధితో ఫోన్ లో మాట్లాడుతూ 70 లక్షల రూపాయలు టీఎస్ ఐఐసి అధికారి ఎందుకు తీసుకున్నారు..? అని అధికారులతో తెలుసుకోమనడం దేనికి సంకేతం..? అధికారులు కోట్ల విలువైన స్థలాన్ని పరోక్షంగా అమ్ముకుంటున్నారా..? లేక ముడుపుల రూపంలో తీసుకున్నారా..? అక్రమ నిర్మాణాలని నోటీసు జారీ చేసిన టీఎస్ ఐఎసి అధికారి జోనల్ మేనేజర్ అండ్ కమిషనర్ అక్రమ నిర్మాణాలను కూల్చకుండా.. సక్రమం చేసే పనిలో నిమగ్నమయ్యారా..? అని విజయ్ మాటల్లో తేటతెల్లమవుతుంది.. అసలు ఈ టీఎస్ఐఐసి స్థలంలో ఎలా నిర్మాణాలు జరిగాయి..? నిర్మాణ అనుమతులు ఎవరు ఇచ్చారు..? అక్రమ నిర్మాణాలు కూల్చివేయకుండా నిర్లక్ష్యం వహించిన అధికారులు ఎవరు దీని వెనక ఎవరున్నారు..? టి ఎస్ ఐ ఐ సి ఉన్నతాధికారులకు సైతం ముడుపులు ముట్టాయా..? ఎన్నికల కోడ్ ఈ టిఎస్ఐఐ సి అధికారులకు వర్తించదా..? ఎన్నికల కమిషన్ ఇలాంటి అవినీతి అధికారులపై విచారణ జరపదా.. ఎన్నికల కోడ్ లో అధికారులు వ్యవహరించిన తీరుపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోలేదా..? అన్న విషయాలకు సంబంధించి మరో కథనం ద్వారా వెలుగులోకి తేనుంది ” ఆదాబ్ హైదరాబాద్ “..” మా అక్షరం అవినీతిపై అస్త్రం “..

Latest News

బీఆర్‌ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This