Friday, September 20, 2024
spot_img

భారీ భూ స్కాం..

Must Read

(అమీన్ పూర్ లో వెలుగు చూసిన కళ్ళు చెదిరే వ్యవహారం)

  • బరితెగించిన గోల్డెన్ కీ నిర్మాణ సంస్థ..
  • మైనింగ్ మాఫియాతో వందల కోట్లు కొల్లగొట్టిన మధుసూదన్ రెడ్డి..
  • అక్రమంగా వచ్చిన సొమ్ముతో నకిలీ పత్రాలు సృష్టించి భూ కబ్జాలకు పాల్పడ్డ కబ్జాకోరు..
  • లే అవుట్ లో లేఅవుట్ సృష్టించిన హెచ్.ఎం.డి.ఏ యాదగిరి రావు..
  • ప్లాట్ నెంబర్ కు బై నెంబర్ తో వేల గజాలల్లో రిజిస్ట్రేషన్..
  • సంతోష్ సాండ్ గ్రానైట్ సప్లై అధినేత పై ఈ.డి కేసు నమోదైనా అగని నిర్మాణ పనులు..
  • అక్రమ వ్యవహారాల్లో అధికారులతో అంతకాగుతున్న మునుత్ ట్రస్ట్
    మహావీర్ జైయిన్..
  • ఈడి అధికారులు గోల్డెన్ కీ నిర్మాణ సంస్థ అధినేత పై, మునూత్ ట్రస్ట్ పై విచారణ జరిపెదేప్పుడు..
  • అధికారులను సస్పెండ్ చేసి అక్రమాలను సక్రమం చేసే బాధ్యత సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు లేదా..?

ఈడి ఎంక్వైరీ జరిగింది..కానీ ఏమిటి లాభం…అత్యున్నత దర్యాప్తు సంస్థ కూడా ఏమీ చేయలేక పోయిందా..? లేక చేతగాక.. చేతులెత్తేసిందా .? అన్నా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు…లేకపోతే ఈడి కేసు నమోదు అయినా అక్రమాలు ఆగడం లేదంటే .దీని వెనుక వున్న వాస్తవాలు ఏమిటన్నది ప్రశ్నార్థకం గానే మిగిలిపోతోంది..

సంగారెడ్డి జిల్లాలో పటాన్ చేరు నియోజకవర్గంలో, అమీన్పూర్ మున్సిపాలిటీ కేంద్రంగా జరిగిన భారీ భూ స్కాం ఈ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.

పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు గూడెం మధుసూదన్ రెడ్డి ఇటీవలే మైనింగ్ మాఫియాగా అవతారం ఎత్తి అక్రమాలకు పాల్పడి వందల కోట్ల రూపాయలను కొల్లగొట్టిన విషయం తెలిసిందే.. ఇదే విషయంపై ఇటీవలే ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అధికారులు సోదాలు నిర్వహించి 339 కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు తేటతెల్లం చేశారు.. ఇలా అక్రమంగా సంపాదించిన సొమ్ముతో స్థానిక హెచ్ఎండిఏ ప్లానింగ్ అధికారి యాదగిరి రావుతో లోపాయి కారి ఒప్పందం కుదుర్చుకొని లేఅవుట్లో లేఅవుట్ ను సృష్టించి, ట్రూ కాపీ అని స్వీయ దృవీకరణ చేసి ఇవ్వడం వీరి అక్రమాలకు అజ్యం పోసినట్లు అయిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

పక్కా ప్రణాళికతో మునుత్ ప్రవేట్ ట్రస్ట్ పేరిట ఎప్పుడో 1985 సంవత్సరంలో కూడా అనుమతి పొందిన చక్రపురి కాలనీ లేఔట్ సంబంధించి ఒరిజినల్ డాక్యుమెంట్లు పోయాయని అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి, నాటి సీఐ యు శ్రీనివాసులు రెడ్డి దానిని ఆమోదించి, సర్టిఫికెట్ జారీ చేయడం.. అటు పిదప చక్రపురి కాలనీ లేఔట్ లో ఫ్లాట్ నెంబర్లకు బై నెంబర్ వేసి వేల గజాల్లో ఫ్లాట్లు ఉన్నట్లు ప్రభుత్వ స్థలాలను రిజిస్ట్రేషన్ చేసుకొని కబ్జాకు పాల్పడింది ఈ ముఠా.

నాడు మునుత్ ట్రస్టు మేనేజింగ్ డైరెక్టర్ గా వున్న భవర్లాల్ జైన్ 2013 సం”లో మృతి చెందినట్లు మహావీర్ జైన్ కు మేనేజింగ్ ట్రస్ట్ గా రాసి ఇచ్చినట్లు ఒక భోగస్ పత్రాన్ని సృష్టించి ప్రభుత్వ స్థలాలను రిజిస్ట్రేషన్ చేశాడు.. బంగారం షాపు వ్యాపారి మహావీర్ జైన్.. అన్ని తెలిసే సంతోష్ సాండ్ గ్రానైట్ సప్లై కంపెనీ పేరుతో గోల్డెన్ కి వెంచర్స్ నిర్మాణ సంస్థ యజమాని సుదీర్ కీర్తి దొడ్డిదారిన రిజిస్ట్రేషన్ చేసుకొని అక్రమ నిర్మాణాలకు తెర లేపి ప్రభుత్వానికి సవాల్ విసిరి, యదేచ్చగా నిర్మాణ పనులు సాగిస్తున్నారు.. ప్లాట్ నెంబర్ అంటే లేఔట్ లో భాగం.. అలాంటి ప్లాట్ నెంబర్ కు బై నెంబర్ వేసి వేల గజాల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని.. ఆ పిదప సదరు డాక్యుమెంట్ తో లేఅవుట్ లో మరో లేఔట్ సృష్టించిన వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

చక్రపురి కాలనీ లేఔట్ లో చక్రం తిప్పిన హెచ్ఎండిఏ ప్లానింగ్ అధికారి యాదగిరిరావుకు అడ్డూ అదుపు లేకుండా.. అవినీతి, అక్రమ సంపాదన ఇతగాడి ధ్యేయంగా విధులు వెలగబేడుతూ అందిన కాడికి దోచుకుంటూ.. ఇష్టా రీతిలో నిర్మాణ అనుమతులు ఇస్తుండడం హెచ్ఎండిఏ డైరెక్టర్ కు కనిపించడం లేదా..? లేదా ఇతగాడు అవినీతి సొమ్ములో డైరెక్టర్ కు సైతం వాటాలు ముడుతున్నాయా..? అన్నది ప్రశ్నర్ధకంగా మారింది..? అవినీతి నిరోధక శాఖ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు మూకుమ్మడి విచారణ జరిపి గోల్డెన్ కి వెంచర్స్ తో పాటు, ప్రొహాబిషన్ లిస్ట్ లో ఉన్న సర్వే నెంబర్లను రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్లను, సీఐ యు శ్రీనివాసులు రెడ్డినీ, బంగారం షాప్ వ్యాపారి మునుత్ ప్రైవేట్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ మహావీర్ జైన్ తో పాటు గోల్డెన్ కి వెంచర్స్ అధినేత సుదీర్ కీర్తి అక్రమాలపై విచారణ జరిపితే వందల కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించడం సాధ్యమవుతుందని పలువురు సామాజిక వేత్తలు డిమాండ్ చేస్తున్నారు.. గూడెం బ్రదర్స్ అక్రమాల పుట్టలో భాగమైన చక్రపురి కాలనీలో లే అవుట్ కి సంబంధించి మండల కార్యాలయంలో ప్లాట్ భూమికి పట్టా పాస్ బుక్కులు పొందిన వ్యవహారం ఎన్ని ఎకరాలు కబ్జాలకు పాల్పడుతున్నారు అన్న ఆధారాలకు సంబంధించి మరో కథనం ద్వారా వెలుగులోకి తేనుంది “ఆదాబ్ హైదరాబాద్” మా అక్షరం అవినీతిపై అస్త్రం

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This