Sunday, November 24, 2024
spot_img

రాయల్ గా రియ‌ల్ మోసం తోలుకట్టలో ప్రైడ్ ఇండియా అరాచకాలు

Must Read
  • రియల్ జోరు.. భూమికొంటే బేకార్‌
  • రాయల్ ఫామ్స్ ప్లాట్స్ పేరుతో సేల్
  • జీవో నెం. 111 ఉల్లంఘిస్తున్న ప‌ట్టించుకోని అధికార గ‌ణం
  • బిల్డర్స్ కు తొత్తులుగా వ్యవహరిస్తున్న పంచాయతీ సెక్రటరీ
  • మరో ఫ్రీ లాంచ్ పేరుతో బిల్డర్స్ టోకరా
  • సర్వే నెంబర్ 167లోని 10 ఎకరాల్లో కొత్తగా వెంచర్
  • హెచ్ఎండిఏ, డిటిసిపి అనుమతులు లేవ్
  • డీపీఓ, డీఎల్ పీఓల నుంచి పూర్తి సహకారం
  • కలర్ ఫుల్ బ్రోచర్స్, యాడ్స్ తో అమాయలకు గాలం

‘అడుక్కునే వాడిదగ్గర గీక్కునేవాడు’ అన్నట్టు తెలంగాణలో రియల్ ఎస్టేట్ ద్వారా ప్రజల్ని మోసపుచ్చుతుంటే వాళ్లకు ప్రభుత్వ అధికారులు సహకరిస్తున్నారు. ఆయా కంపెనీలకు చెందిన బిల్డర్స్ ఇచ్చే పైసలకు కక్కుర్తి పడుతూ కొందరు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. అటు పొలిటికల్ సపోర్ట్, ఇటు సర్కారు ఆఫీసర్ల సహకారం తోడై అమాయక ప్రజలను దోచుకునుడు ఈజీ అయిపోయింది. హెచ్ఎండీఏ, డీటీసీపీ అనుమతులు లేకుండా ఫామ్ ల్యాండ్స్ ను సామాన్య జనానికి అంటగడుతున్నారు.

అసలైతే తెలంగాణలో రియల్ దందా జోరుగా సాగుతుంది. లక్షల్లో పెట్టుబడులు పెట్టి కోట్లల్లో సంపాదించాలనే ఆశ‌తో కొంతమంది ఈ దారి వెతుక్కుంటున్నారు. ప్రభుత్వ అధికారులు, పొలిటికల్ లీడర్ల సపోర్ట్ తో మూడు పువ్వులు ఆరుకాయలుగా వ్యాపారం కొనసాగుతుంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత గత పదేళ్లుగా తెలంగాణాలో ఏ మారుమూల గ్రామానికి వెళ్లిన లక్షల్లో వ్యవసాయ, వ్యవసాయేతర భూమి పలుకుతుంది అంటే అతిశయోక్తి కాదు.

గత బీఆర్ఎస్ సర్కార్ భూముల ధరలను అమాంతం పెంచి పేద, మధ్య తరగతి ప్రజలు కొనలేని, సొంతంగా ఇల్లు కట్టుకోలేని దుస్ధితి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు రకరకాల యాడ్స్, అందమైన బ్రోచర్స్, ప్రముఖులతో ప్రచారాలు చేయించుకుంటూ అమాయకులను బోల్తా కొట్టిస్తున్నారు. రియల్ భూమ్ మాయలోపడి సామాన్య ప్రజానీకం ఎందరో మోసపోవడం వాళ్ల వంతు అవుతుంది.

వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం తోలుకట్టలో ప్రైడ్ ఇండియా అరాచకాలకు పాల్పడుతుంది. ఇక్కడ మరో ఫ్రీ లాంచ్ పేరుతో ప్రైడ్ ఇండియా బిల్డర్స్ భారీ మోసానికి తెరలేపింది. ఫామ్ ల్యాండ్స్ ను వెంచర్లు చేసి అమాయకులకు అంటగడుతున్నది. ‘అరచేతిలో వైకుంఠం చూపినట్లు’ రాయల్ ఫామ్స్ పేరుతో కొత్త ప్రాజెక్టును స్టార్ట్ చేసి.. ఫ్రీ లాంచ్ ఆఫర్లతో ప్రైడ్ ఇండియా బిల్డర్స్ మోసానికి పాల్పడుతున్నారు. సర్వే నెంబర్ 167లోని 10 ఎకరాల్లో కొత్తగా వెంచర్ చేసి భారీ మోసానికి పాల్పడుతున్నది ప్రైడ్ ఇండియా.

రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దిగిన కొందరు పెట్టుబడిదారులు అదేపనిగా జనాన్ని బొల్తా కొట్టించడంపై ఇంట్రెస్ట్ పెడుతున్నారు. గవర్నమెంట్ నుంచి ఎలాంటి పర్మిషన్ లేకున్నా.. అసలు ఆ భూమి అమ్ముకోవడానికి, కొనడానికి అవకాశం లేకున్నా, జీవో 111 ప‌రిధిలో ఉన్న‌, రంగుల ప్రపంచం సీన్ క్రియేట్ చేసి భూమి కొనేలా బురిడీ కొట్టిస్తున్నారు. హెచ్ఎండీఏ నుండి కానీ, డీటీసీపీ నుండి కానీ ఎలాంటి అనుమతులు లేకుండా సంస్థ ఫామ్ ప్లాట్స్ పేరుతో అమ్మకాలు చేస్తూ ప్రజలను దగా చేస్తున్నారు. ఒక్కో ప్లాట్ కు ఒక్కో రేటు పెట్టి ఆశచూపుతున్నారు. భూమి కొనేవాళ్లు కూడా ఒకరిద్దరినీ సంప్రదించకుండా, వెంచర్ పై ఎలాంటి అనుమానాలు నివృత్తి చేసుకోండా టకిటకీమనీ డబ్బులు కట్టేసి కొనేస్తున్నారు. ఆ తర్వాత పెద్దలు, తెలిసిన వారికి చెబుతుండడం అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోతుంది. అప్పుడు ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు’ రోడ్డెక్కి లబోదిబోమంటుండడం గమనార్హం.

అధికారుల అండదండలు :

ప్రభుత్వ అధికారులై ఉండి ప్రజల కోసం పనిచేయాల్సిన కొందరూ వారి నోట్లో మట్టికొడుతున్నారు. ప్రైడ్ ఇండియా చేస్తున్న రియల్ భూమ్ కు తోలుకట్ట గ్రామ పంచాయతీ కార్యదర్శి ఫుల్ సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సంస్థ వద్ద లంచాలు తీసుకొని ఫామ్ ల్యాండ్స్ అమ్ముకునేందుకు వంత పాడుతున్నాడు. సెక్రటరీ ప్రైమ్ ఇండియా బిల్డర్స్ కు పూర్తి సహకారం అందిస్తూ అందుకు కావాల్సిన పనులన్నీ చక్కబెడుతున్నట్టు సమాచారం. మాముళ్లు తీసుకుంటూ ఎవరికీ అనుమానం రాకుండా భూములను సేల్ చేసేందుకు సహకరిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా డీపీఓ, డీఎల్.పీఓ సైతం వీళ్లకు వంతపాడుతుండడం గమనార్హం. ఫ్రీ లాంచ్ అంటూ బ్రోచర్లు, కలర్ యాడ్స్ తో అమాయకులను బొక్కాబొర్లపడేస్తున్నారు. పేద ప్రజల నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేసి కోట్లల్లో డబ్బులు కూడబెట్టి అవతలపడుతున్నారు. పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి తూతూ మంత్రంగా నోటీసు లు జారీ చేసి ఏదో చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు క‌ల‌రింగ్ ఇస్తూ ఫోటోల‌కే ప‌రిమితం కావ‌డం జ‌రిగింది. క్షేత్ర స్థాయిలో మాత్రం య‌థేచ్చ‌గా వెంచ‌ర్ ప‌నులు జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం.

ఇదీలా ఉంటే ఒక్కో సైజుకి, ఒక్కో దిక్కుకి ఒక్కో రకంగా రేట్లు పెట్టి జనాన్ని మరింత మోసం చేస్తున్నాయి రియల్ ఎస్టేట్ కంపెనీలు, 100 గజాలు అయితే ఇంత, 200 అయితే ఇలా, 300 తీసుకొంటే మరోలా, అదే 500, 1000 గజాలు తీసుకొంటే అదీ ఫ్రీ. ఇదీ ఫ్రీ. ఇల్లు కూడా కట్టిస్తామనే అనేకరకమైన ఆఫర్స్ పెడుతూ ఆశచూపి భారీ మోసాలకు పాల్పడుతున్నారు.

ప్రైడ్ ఇండియా బిల్డర్స్ రేట్లు…

మొత్తం 65 ప్లాట్స్..
125 సేల్ ఫర్ యార్డ్ కు అవుట్ రేట్ 14,000/-, 3 నెలలకు రూ.15,000/- మొత్తం అవుట్ రేట్- . 73,92,000/-
3 నెలలకు మొత్తం – రూ.79,20,000/-
ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో డౌన్ పేమెంట్ రూ.25 లక్షలు, మొదటి, రెండవ, మూడవ ఇన్స్టాల్మెంట్ లో రూ. 48,92,000/-

అందులోనూ కార్నర్ ప్లాట్ అయితే గజానికి రూ. వెయ్యి ఎక్కువ వసూలు చేస్తుండడం విశేషం. మొత్తంగా రెవెన్యూ అధికారులు, ప్రభుత్వ పెద్దల అండ, పొలిటికల్ లీడర్ల సపోర్ట్ తో రియల్ భూమ్ పేరుతో వెంచర్లు చేసి సరికొత్త దందా చేస్తున్న ప్రైడ్ ఇండియా బిల్డర్స్ వంటి వాటిపై గవర్నమెంట్ దృష్టిసారించక పోవడం వెనుక అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. రెవెన్యూ, పంచాయత్ శాఖ, ఇతర ముఖ్యశాఖల అధికారుల అండదండలతోనే ఈ రియల్ ఎస్టేట్ దందా సాగుతుందని.. ఇందులో వారికి వాటాలు, మాముళ్లు రూపంలో పెద్ద మొత్తంలో డబ్బులు అందుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

Latest News

రూ.27 కోట్లతో రిషబ్ పంత్‎‎ని సొంతం చేసుకున్న లక్నో

ఐపీఎల్ 2025 మెగా వేలం ఆదివారం ప్రారంభమైంది. మెగా వేలంలో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ రికార్డు ధర పలికాడు. లక్నో టీం పంత్‎ను...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS