Monday, November 25, 2024
spot_img

పేద విద్యార్థులకు బ్యాగ్స్ పంపిణీ చేసిన అదరణ సేవా సమితి

Must Read

అదరణ సేవా సమితి ఆద్వర్యంలో సీతారంపూర్ ప్రభుత్వ ప్రైమరి పాఠశాలలో చదువుతున్న 40 మంది ‌విద్యార్థులకు అవసరమైన స్కూల్ బ్యాగులను జిల్లా విద్య అధికారి సిచ్. వి. జనార్దన్ రావు చేతుల మీదుగా పంపిణీ చేయడం చేయడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా విద్యా అధికారి సిచ్.వి.జనార్దన్ రావు మాట్లాడుతూ అదరణ సేవా సమితి అధ్యక్షురాలు కర్రె పావని రవి పేద విద్యార్థుల కోసం చేస్తున్న కార్యక్రమాలు చాలా అభినందనీయం అని వారు కొనియాడారు.గత కొన్ని రోజులగా ఆదరణ సేవా సమితి ఆధ్వర్యంలో పేదప్రజల సహాయ కార్యక్రమాలు,విద్యార్థులకు శుభ్రత పైన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా పేదరికంతో ఉన్నటువంటి విద్యార్థులకు ఉపయోగపడే స్టడీ మేటిరియల్స్ బుక్స్,బ్యాగులు,పెన్నులు,నోట్ బుక్స్ ఇలా ఎన్నో వస్తువులు పేద విద్యార్థులకు అందిస్తున్నారని వెల్లడించారు.అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అదరణ సేవా సమితి అధ్యక్షురాలు కర్రె పావని రవి మాట్లాడుతూ,మా సంస్థ ద్వారా ప్రతి విద్య సంవత్సరం ప్రారంభంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం వారికి అవసరమైన మెటీరియల్ అందిస్తామని పేర్కొన్నారు.మా సంస్థ పేద విద్యార్థుల కోసం అనునిత్యం సేవా చేయడం కోసం ముందుటామని వారు అన్నారు.అలాగే ఇప్పటి వరకు మా సంస్థ ఆద్వర్యంలో పేదరికంలో ఉన్న ప్రజల కోసం నిత్యావసర వస్తువుల పంపిణీ లాంటి కార్యక్రమాలు నిర్వహించామని వెల్లడించారు.ఈ కార్యక్రమం జిల్లా విద్య అధికారి చేతుల మీదుగా చేయడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు.ప్రభుత్వం పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం అనేక మంచి కార్యక్రమాలు చేస్తు ఈ కరీంనగర్ జిల్లాలో విద్య అభివృద్ధికి వారు కృషి చేస్తున్నారని ఈ సందర్బంగా తెలియజేశారు.స్థానిక కార్ఫోరేటర్ జంగిలి సాగర్ మాట్లాడుతూ సీతారంపూర్ స్కూల్ విద్యార్థుల కోసం అదరణ సేవా సమితి బ్యాగుల పంపిణీ చేయడం మంచి పరిణామం అని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయురాలు ప్రసన్న,గుంజపడుగు హరిప్రసాద్, ఆదరణ సేవా సమితి సభ్యులు కర్రె రవి, గుంటీ మౌనిక, కర్రె లాస్య తదితరులు పాల్గొన్నారు

Latest News

రూ.27 కోట్లతో రిషబ్ పంత్‎‎ని సొంతం చేసుకున్న లక్నో

ఐపీఎల్ 2025 మెగా వేలం ఆదివారం ప్రారంభమైంది. మెగా వేలంలో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ రికార్డు ధర పలికాడు. లక్నో టీం పంత్‎ను...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS