జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు.రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ చేతుల మీదుగా హేమంత్ సొరేన్ ప్రమాణస్వీకారం చేశారు.హేమంత్ సొరేన్ భారీ భూ కుంభకోణానికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఈడీ సొరేన్ ను అరెస్ట్ చేసింది.దింతో అయిన తన సీఎం పదవికి రాజీనామా చేశారు.సొరేన్ రాజీనామా చేయడంతో చంపై సొరేన్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.తాజాగా భూకుంభకోణం కేసులో హేమంత్ సొరేన్ ప్రమేయం ఉన్నట్టు ఆధారాలు లేకపోవడంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది.బెయిల్ పైన విడుదలైన హేమంత్ సొరేన్ రాజ్ భవన్ కి వెళ్లి గవర్నర్ తో భేటీ అయ్యారు.నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనీ గవర్నర్ కోరగా హేమంత్ సొరేన్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.ఇదిలా ఉండగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ మూడోసారి ప్రమాణస్వీకారం.