- ధర్మపురి మండల రెవెన్యూ అధికారికి వినతిపత్రం అందించిన ఎమ్మెల్యే బృందం
ప్రభుత్వ నిబంధనలను గౌరవిస్తూ సమాజానికి ప్రజాస్వామ్యంపై మరింత విశ్వాసాన్ని పెంపొందించాలని ఎమ్మెల్యే పరాజితులు బృందం కోరింది.జగిత్యాల జిల్లా ధర్మపురి లో మండల రెవెన్యూ అధికారికి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ,మండల అధికారికి పలు అంశాల పై సమాచారం కోరామని తెలిపారు.గాదెపెళ్లి శివారులోని ప్రభుత్వ భూములను ఆక్రమించి పెద్ద ఎత్తున తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించిన అక్రమార్కుల పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
చర్యలు తీసుకోలేని పక్షంలో ప్రజాస్వామ్యం,చట్టాలు,హక్కులు అనే పదాలకు అర్థం లేకుండా పోతుందని అన్నారు.అధికారుల ప్రమేయంతో కొంతమంది నాయకులు పెద్దఎత్తున అవకతవకలు జరిపి ఇష్టారీతిన ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారని ఆరోపించారు.అధికారులు,ప్రజా ప్రతినిధులు తక్షణమే స్పందించి సమస్య పరిష్కారానికి చొరవ చూపకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.కబ్జాకోరుల నుండి భూములను రక్షించి ఆ భూములను గ్రామాల అవసరాలకు,ధాన్యం కోనుగోలు కేంద్రాలకు,క్రీడా మైదానంకు కేటాయించలని,మిగిలిన భూమిను అర్హులైన నిరుపేదలకు కేటాయించాలని సూచించారు.ఇప్పటికే కొందరు పంటలు వేశారని, పంటల సాగు సమయం కాబట్టి మరింత సాగుకు కుట్ర జరుగుతోందని తెలిపారు.వినతిపత్రం అందించిన వారిలో షేర్ల మహేంధర్,వేముల విక్రమ్ రెడ్డి(జర్నలిస్ట్ విక్రమ్ రెడ్డి వేముల),జాడి ప్రేమ్ సాగర్,సీనియర్ రైతు నాయకులు ఆయిల్నేని కమాలకర్ రావు తో పాటు పలువురు పాల్గొన్నారు.