Friday, September 20, 2024
spot_img

మద్యం సేవించే ప్రిన్సిపాల్ మాకొద్దు..

Must Read
  • తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాల లో ప్రిన్సిపల్ అరాచకాలు..
  • కళాశాలను వైన్ షాప్ గా మార్చిన ప్రిన్సిపాల్ శైలజ..
  • మహిళా కళాశాలలోకి కొడుకును తీసుకువచ్చి వారం రోజులు తిష్ఠ.
  • హాస్టల్ లో పురుగుల అన్నం, నీళ్లచారుతో విద్యార్థులకు భోజనం.
  • మద్యం బాటిళ్లు విషయం బయటకు తెలవడంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఏసిటీ.
  • ప్రిన్సిపాల్ రూమ్ నుండి బీర్ బాటిల్ బయటికి తెస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న విద్యార్థులు.
  • ప్రిన్సిపాల్ శైలజ, ఏసిటీ సౌమిత్రి ని సస్పెండ్ చేయాలంటూ విద్యార్థుల డిమాండ్.

మద్యం సేవించే ప్రిన్సిపాల్ శైలజ, ఆమెకు సహకరిస్తున్న అసిస్టెంట్ కేర్ టేకర్ సౌమిత్రి ని సస్పెండ్ చేయాలని, ఇలాంటి ప్రిన్సిపల్ మాకు వద్దు అంటూ గత మూడు రోజుల క్రితం సూర్యాపేట రూరల్ మండలం బాలెంల దగ్గర ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల విద్యార్థులు రోడ్డు ఎక్కి ధర్నా చేసిన విషయం తెలిసిందే.. తాజాగా శనివారం అదే కళాశాల 400 మంది విద్యార్థులు మరోసారి ధర్నాకు దిగారు. గత మూడు రోజుల క్రితం ప్రిన్సిపాల్ శైలజ పై ఉమ్మడి నల్గొండ జిల్లా ఆర్ సి ఓ అరుణ కుమారికి ఫిర్యాదు చేసినప్పటికీ ప్రిన్సిపాల్ శైలజ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ అధికారుల వ్యవహార శైలికి నిరసనగా మరోసారి ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్నా అధికారులు అర్. సీ.ఓ అరుణ కుమారి ఆర్డీవో వేణుగోపాల్, జడ్పీ డిప్యూటీ సీఈవో శిరీష,డిఎస్పీ రవి సంఘటన స్థలానికి వెళ్లి విద్యార్థులకు ఎంత నచ్చజెప్పినా వారు వినకుండా ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ… ప్రిన్సిపాల్ శైలజ ప్రతిరోజు కళాశాల లోకి సాయంత్రం వేళ మద్యం బాటిళ్ళు తీసుకొస్తారని, వాటిని స్పెషల్ రూమ్ లో కూర్చొని, ఎసిటి సౌమిత్రి తో కలిసి మద్యం సేవిస్తున్నారని, తాగిన మైకంలో మా రూమ్ ల వద్దకు వచ్చి మాపై చేయి చేసుకొని నూటికి వచ్చిన మాటలను అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజుల క్రితం ప్రిన్సిపాల్, కొడుకుని హాస్టల్ కు తీసుకువచ్చిందని, వారం రోజులపాటు ప్రిన్సిపాల్ కొడుకు హాస్టల్లోనే ఉండడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. మహిళా డిగ్రీ కళాశాల అని తెలిసి కొడుకును ఇక్కడికి ఎలా తీసుకొస్తారని ప్రశ్నించారు. మా కోసం తల్లిదండ్రులు ఫోన్ చేసిన,మమ్ములను కలవడానికి కలశాల వద్దకు వస్తే వారికి మర్యాద ఇవ్వకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడి వారిని ఇబ్బందులకు గురి చేస్తుందని పేర్కొన్నారు. హాస్టల్లో సరైన భోజనం కూడా పెట్టదని, అన్నంలో పురుగులు వచ్చిన, నీళ్ల చారు పప్పులు కూలిపోయిన కోడిగుడ్లు ఎటు సరిపోని భోజనం మాకు పెడుతూ మా పొట్ట కొడుతున్నారు. ఇలాంటి విషయాలపై ప్రిన్సిపాల్ ని అడిగితే టార్గెట్ చేసి కొడతారని, కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగుతారని ఆవేదన వ్యక్తం చేశారు.

కళాశాల బీరువాలో మద్యం బాటిళ్లు కలకలం.

మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రూంలో మద్యం బాటిళ్లు ఉన్నాయని విద్యార్థులు ఈరోజు కళాశాలకు వచ్చిన అధికారులకు చెప్పడంతో, వైస్ ప్రిన్సిపాల్ జాకీర, ప్రిన్సిపాల్ రూమ్ కు తాళం వేశారు.అర్.ఎస్ఐ.ఓ, ఆర్డీవో, జడ్పీ డిప్యూటీ సీఈవో, డిఎస్పి అధికారుల సమక్షంలో ప్రిన్సిపాల్ రూమ్ తాళం ఓపెన్ చేసి విద్యార్థులతో కలిసి బీరువా ఓపెన్ చేయగా అందులో నాలుగు కాళి బీర్ బాటిల్ దొరికాయి. వాటిని ఆర్సిఓ అరుణకుమారి ఫోన్ లో ఫోటోలు తీసుకున్నారు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. విద్యార్థులు ఇన్ని రోజులనుండి ఆరోపిస్తు వస్తున్నవన్ని, ఈ రోజు నిజాలు అయ్యాయి. శుక్రవారం సాయంత్రం ప్రిన్సిపల్ శైలజ, ఏసిటీ సౌమ్యత్రి కాల్ చేసి కళాశాల లో బీర్ బాటిల్ ఉన్నాయ్ అని విషయం బయటకు తెలిసింది వాటిని తీసుకొని బయటపడే అని చెప్పడంతో, సావిత్రి కాళీ బీర్ బాటిలను చీరలో చుట్టి, వాటిని ఓ కవర్లో పెట్టి అందులో పైనుండి చీరలు పెట్టీ ఆ కవర్ నూ స్కూటీలో పెడుతుండగా విద్యార్థులు గమనించి ఏసిటీ ని నిలదీయడంతో మీపై కేసులు పెట్టిస్తా అంటూ విద్యార్ధులపై బెదిరింపులకు దిగిందని పేర్కొన్నారు. జాయింట్ సెక్రెటరీ నుండి ఫోన్ చేయించి ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేశామని నిర్ధారణ చేసేంతవరకు మా ధర్నా విరమించమంటూ విద్యార్థులు తేల్చి చెప్పారు. ఉన్నతాధికారుల నుండి స్పష్టమైన ఆదేశాలు వస్తేనే తిరిగి క్లాసులకు వెళ్తామని అన్నారు.

ఆర్ సి ఓ అరుణ కుమారి మాట్లాడుతూ.. ఇక్కడ జరిగిన సంఘటనపై కళాశాల విద్యార్థులను కూర్చోబెట్టి మాట్లాడమని వారి నుండి ఫిర్యాదు సేకరించి రిపోర్టు తయారుచేసి సెక్రటరీకి, జరిగిన ఘటనపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళమన్నారు. ఈ విషయంపై హెడ్ ఆఫీస్ నుంచి ఓ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఆ కమిటీ పూర్తి నివేదిక తయారు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటారని అన్నారు. అలాగే 20వ తేదీ లోపు రెగ్యులర్ ప్రిన్సిపాల్ వస్తుందని అన్నారు.అప్పటివరకు వైస్ ప్రిన్సిపాల్ జాకిరా ఇన్చార్జిగా ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తారని తెలిపారు.

Latest News

బీఆర్‌ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This