Friday, September 20, 2024
spot_img

ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి రివార్డ్ అందజేసిన డిజిపి శ్రీ రవి గుప్త

Must Read

సీనియర్ సిటిజన్ సమస్యను పరిష్కరించిన బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి రివార్డ్ అందజేసిన డిజిపి శ్రీ రవి గుప్త.
భాగేందర్ సింగ్, ఏ స్ ఐ, రాఘవ చారి, పి సి 8075 మరియు మొహమ్మద్ ఇర్షాద్ అలీ, పీసీ 2651 హైదరాబాద్ సిటీ లోని బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్నారు. 01-07-2024న బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సమీపంలోని మోర్ సూపర్ మార్కెట్ ముందు డ్యూటీలో ఏ స్ ఐ నిలబడి ఉండగా సీనియర్ సిటిజన్ ఐన మహిళ అతనిని సంప్రదించి, 16-06-2024న అగ్రసేన్ ఐలాండ్లో రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసినందుకు తన కారుపై పెండింగ్‌లో ఉన్న ఇ-చలాన్ గురించి అడిగారు.
దీనికి సంబంధించి ఏఎస్ఐ భాగేందర్ సింగ్, ఆమెను పోలీసు స్టేషన్ లోపలికి రమ్మని అభ్యర్థించారు. ఆమెను కూర్చోబెట్టి ఆమె చెప్పేది ఓపికగా విన్న తర్వాత, ఈ కాప్స్ ఆపరేటర్ మొహమ్మద్ ఇర్షాద్ అలీ, పిసి 2651 మరియు జిడి రైటర్ శ్రీ రాఘవ చారి, పిసి 8075 ఇ-చలాన్ వెబ్ అప్లికేషన్‌లోని ఇ-చలాన్ వివరాలను ధృవీకరించారు మరియు పేర్కొన్న ఇ-చలాన్ తప్పుగా రూపొందించబడిందని గమనించిన వారు పేర్కొన్న ఇ-చలాన్‌పై తదుపరి చర్యల తొలగింపు కోసం ఇ-చలాన్ కేంద్రంకు మొహమ్మద్. ఇర్షాద్ అలీ, పిసి 2651 ఇ-మెయిల్ పంపారు. మహిళ వాహనంపై తప్పుగా రూపొందించిన ఇ-చలాన్ తొలగించాలని సిఫార్సు చేశారు. బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది యొక్క బాధ్యతాయుతమైన, మర్యాదపూర్వక ప్రవర్తన మరియు సత్వర చర్యకు సీనియర్ సిటిజెన్ చాలా సంతోషంగా భావించి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లోని తన అనుభవాన్ని డిజిపి శ్రీ రవి గుప్త తో పంచుకున్నారు. పోలీసు సిబ్బంది సత్వర స్పందన, బాధ్యతాయుతమైన పనితీరు మరియు ప్రవర్తనకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

హైదరాబాదులోని ఇ-చలాన్ కేంద్రం మహిళ యొక్క దావాను ధృవీకరించి మరియు ఆమె క్లెయిమ్ సరైనదని గుర్తించి, దానిని తొలగించడం ద్వారా తప్పుడు చల్లాన్ పై తదుపరి చర్యను ఉపసంహరించుకోవడం కూడా సంతోషకరమైన విషయమని
తెలంగాణ డిజిపి శ్రీ రవి గుప్తా అన్నారు. వారి సత్ప్రవర్తన, మర్యాదపూర్వక ప్రవర్తన మరియు వృద్ధురాలి ఫిర్యాదును పరిష్కరించడంలో సత్వర చర్యను గుర్తించి వారికి నగదు రివార్డుతో పాటు రివార్డ్ సర్టిఫికేట్ అందించారు. వారు నిరంతరం ఈ విధంగా పని చేయాలని ప్రోత్సహించారు. భవిష్యత్తులో కూడా అదే ఉత్సాహం మరియు అంకితభావం తో పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This