చార్ ధామ్ యాత్ర వాయిదా పడింది. ఈ యాత్రను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.భారీ వర్షాల కారణంగా నదులన్నీ ఉదృతంగా ప్రవహిస్తున్నాయి.మరోవైపు చాలా చోట్ల కొండచరియలు కూడా విరిగి పడుతున్నాయి.రానున్న తొమ్మిది రోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది.
ఇక గర్వాల్ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో చార్ ధామ్ యాత్రను నిలిపివేస్తున్నామని కమిషనర్ విజయ శంఖర్ తెలిపారు.బద్రినాథ్ హైవే పెద్దఎత్తున్న కొండచరియలు విరిగి పడుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయింది.వాహనాల రాకపోకల పై ఆంక్షలు విధించింది.తొమ్మిది రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉందని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ఆదేశించారు.