Friday, November 22, 2024
spot_img

చరిత్ర చెప్పే సంస్కృతి సౌరభాలు..

Must Read
  • చెరగని గుర్తులు,విదేశీయులను ఆకట్టుంటున్న కట్టడాలు..!!

నగరంలో నలుమూలా విస్తరించిన ఎన్నో చారిత్రక మసీదులు కట్టడాలు, ఇక్కడి సంస్కృతి సౌరభాలకు అద్ధం పడుతున్నాయి. కుతుబ్షాహీ సుల్తానులు, ఆసీఫ్జాహీ నవాబుల కాలంలో నిర్మించిన ఈ ప్రార్థన స్థలాలు నేటికి చెక్కు చెదరకుండా ఉన్నాయి.ఈ నిర్మాణాలన్నీ ఇండో ఆరబిక్ పర్షియన్ వాస్తు శైలికి నిలువేత్తు నిదర్శనాలు,హైదరబాద్ నగరాన్ని పాలించిన నవాబులు,సుల్తాన్లు తమ తమ వంశస్తుల జ్నాపకార్థం ఎన్నో ప్రార్థన మసీదులను(ఆషూర్ఖానలను)నిర్మించారు.ఇందులో ఒక్కో ఆఘూర్ఖానాలకు ఒక్కచరిత్ర ఉంది.షీయా ముస్లీం సోదరుల‘‘మొహ్రారం’’ సంతాప దినాల సందర్భంగా వాటి ప్రాశస్త్యాన్ని పరికిస్తు పాఠకులకు ‘‘ఆదాబ్’’ఆందిస్తున్న పరిశీలనాత్మక ప్రత్యేక కథనం…!!

ఇది చరిత్ర…!!

ఆజాఖాన-ఇ- జహ్ర మూసీనది తీరంలో దారుష్ షిఫాకు దగ్గలో నిర్మించిన ఆఘూర్ఖానా, ప్రార్థనమందిరం. ఏడవ నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ ఈ ఆఘూర్ఖానా నిర్మాణం, ముస్లీం హిజ్రీ క్యాలెండర్ ప్రకారం 1360సం, 1942 ప్రాంతంలో చెపట్టారు. మహ్మదీయుల్లోని షీయా తెగవారు మొహరం-పదిరోజుల పాటు పలు ప్రార్థనలు నిర్వహిస్తారు.

మొహరం సందర్భంగా షీయా మహ్మదీయుల సోదరులు ప్రార్థన చేసుకోవాడానికి వీలుగా ఏడవ నిజాం-ఈ షూర్ఖానా నిర్మాణం చేపట్టారు. అయితే ఆసీఫ్జాహీ నిజాం నవాబులు అధిక శాతం సున్నీ తెగకు చెందిన వారనీ అయినప్పటికి నిజాం నవాబులు షీయాల కోసం ప్రత్యేక ఆషూర్ఖానాల ఏర్పాటులో సహకరించారని చెప్తారు.

తల్లీ పట్ల గౌరవంతో నిర్మాణం..!!

ఏడవ నిజాంకు తల్లీ జోహ్రబెగం షీయా మహ్మదీయురాలని, నిజాం తన తల్లిపట్ల అమితమైన గౌరవాభిమానాలు కలిగి వుండేవారని చరిత్రకారులు అభిప్రాయపడతారు. అంతేకాదు నిజాం నవాబు తానెంత పని ఒత్తిడిలో వున్నా పురానా హావేలిలో వుంటున్నా తన తల్లిని నిత్యం సందర్శించి ఆమేకు పాదాభివందనం చేసేవాడని ప్రతీత.జోహ్రా బేగం మరణాంతరం ఆమే పట్ల గల ప్రేమ, గౌరవంతో నిజాం నవాబు జహ్రాబేగం పెరిటా అజాఖానా-ఇ-జహ్ర ఆషూర్ఖానాను నిర్మించారు.ఈ ప్రార్ధనమందిర నిర్మాణ విషయంలో ఏడవ నిజాం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

హిందువు.. ముస్లీంల ఐక్యతకు నిదర్శం..

ఆజా ఖాన జహ్ర ముస్లీం, హందువుల ఐక్యతకు నిదర్శనం. ఏందరో ముస్లీం, హిందువులు సయితం ఈ నిర్మాణ సమయంలో ఉదారంగా విరాళాలు వెయ్యి రూపాయలకు తక్కవ కాకుండా ఇచ్చారు. కాగా విరాళాలకు పైబడి ఏడవ నిజాం లక్షలాది రూపాయలు ఖర్చుచేసి, ఈ ఆషూర్ఖానా నిర్మించారు.

ప్రత్యేక కట్టడం విశాలమైన మందిరం..!!

ఆజాఖాన జహ్రా ప్రధాన మందిరం ఎంతో విశాలంగా సుమారు 10వేలమంది ఒకే సారి ప్రార్ధనలు జరుపుకోవడానికి వీలుగా ఉంది. ఎలాంటి పిల్లర్లు లేకుండా గల 45అడుగుల ఎత్తునగల సీలింగ్ ప్రధాన ఆకర్షణగా నిర్మించారు. ముస్లీం స్త్రీలకు ప్రత్యేక స్థలం కేటాయింపు ఇక్కడే ఉంది. ప్రార్ధనా మందిరంలో బంగారూపూతతో రాసిన ఖూరానులోని ఆంశాలు, బంగారు వన్నేతోగల ఆలంలుకు హిందు, ముస్లీంలు అందరూ కూడా ప్రార్ధనలు జరుపుతుండటం విశేషం.బెల్జీయం,ఫ్రాన్స్ దేశాలనుంచి తెప్పించినట్లు చెప్తున్న అతి పెద్ద అందమైన శాండిలీయర్లు విద్యుత్ దీపాలతో ప్రధాన ప్రార్ధనా మందిరం ఎంతో ఆకర్షణీయంగా నేటికి దర్శనమిస్తోంది.మొహరం సమయంలో నిజాం వారసులు ఈ ఆషూర్ఖానా తప్పక సందర్శిస్తారు.ఈ ఆషూర్ఖానా నిర్వహణ బాధ్యతను ఒక ప్రత్యే క ట్రస్ట్కు అప్పగించారు.దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1999 హేరిటేజ్ ఆవార్ఢును సోంతం చేసుకోవడం జరిగింది.

బీబీకా ఆలవా… ఆఘూర్ఖాన…100సం.. ఒల్డ్…

ఆలం ఉరెగింపు నగరంలో 300సంవత్సరాల నుంచి కోనసాగుతుంది.మొదట గోల్కోండా కోటనుంచి జరిగేది. ఆక్కడినుంచి నిజాం నివాబు డబీర్పురాలోని బీబీక ఆలవాను నిర్మించారు. నాటినుంచి నేటివరకు ఆలం ఉరేగింపు అక్కడినుంచి జరుగుతుంది. నిజాం+కుతుబ్షాహి వంశస్థులు బీబీక ఆలవాను 1925లో నిజాం ఆఫ్ ట్రస్ట్ తరుపున వాటిని అధికారికంగా ప్రకటించారు. దీంతో నేటికి ఇక్కడి నుంచి ఆంబారిపై ఆలం ఉరేగింపు ఉంటుంది. ఈ ఉరేగింపులో నిజాం వంశస్థులు పాల్గోంటారు.9వ,నిజాం మొహ్రరం నాడు పత్తర్ఘట్టీ వద్ద నున్న ఆఘార్ఖాన సందర్శిస్తారు. 10మొహ్రారం నాడు.. ఆజా-ఖానాజహ్రా ఆఘూర్ ఖానలో ఉదయం 7గంటలకు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. వీటితోపాటు నగరంలో 400 ఏళ్ల పూరతన ఆఘూర్ఖానాలు.. ఆలవా సర్తుక్, బాదుషా ఆఘూర్ఖాన, పంజేషా ఖద్మే రసుల్, బార్గ హాజ్రత్ ఆబ్బాస్, నాలేముబారక్, కోహేమౌలాలి,బారా ఇమాం,బారా ఇమాం పహాడి రాజేంద్రనగర్ తోపాటు నగరంలో దాదాపు 501 షీయా సోదరుల ఆఘార్ఖానాలు ఉన్నాయి. వీటి బాధ్యతను రాష్ట్రా వక్ఫుబోర్డు చూసుకుటుంది.

రాష్ట్ర షీయా యూత్ కాన్ఫ్ రెన్స్ ఆధ్యక్షుడు సయ్యద్హామెద్హుసేన్ జాఫ్రీ..!!

గ్రేటర్ పరిధిలో ఉన్న ఆఘార్ఖాన మరమ్మత్తులకు ప్రభుత్వంరూ.38లక్షల రూపాయల నిధులు మంజురుచేస్తోంది. వీటితోపాటు 9–10మొహ్రారం ఎనుగు ఆలం ఉరేగింపు కోసం ప్రత్యేక నిధులు కేటాయింపు చేస్తుంది 9, తేదినాడు ఎనుగుపై ఆలం ఉరెగింపుఉంటుంది, ఉరేగింపు సమయంలో నగర పోలీస్ ఆధ్వరంలో పటిష్ఠమైన బందోబస్తు నడుమ జరుగుతుంది. నియమ నిబంధనాలను పాటిస్తు సంతాప దినాల ఉరెగింపు ఉంటుందని ఆయన తెలిపారు.బీబీకా ఆలవా వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు.భక్తులకు ఎలాంటి ఆసౌకర్యాలు లేకుండా తగిన చర్యలు చేపట్టారు.

Latest News

ఆదానీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలి

రాష్ట్ర ప్రభుత్వానికి కేటీఆర్ డిమాండ్ ఆదానీపై కేసు పెట్టాలని ఎన్నిసార్లు కోరిన ప్రధాని మోదీ పట్టించుకోలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదానీ వ్యవహారంపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS