Friday, September 20, 2024
spot_img

ఆదాబ్ ఎఫెక్ట్…?

Must Read
  • ఆదాబ్ కథనానికి స్పందించిన తహశీల్దార్
  • జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పరిశీలిస్తున్న అధికారులు..!
  • మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్న తహసిల్దార్ ఫణి కుమార్,ఎంపీడీవో దయాకర్..!
  • స్టోర్ రూమ్ లో తుట్టెలు కట్టిన బియ్యం,వల్లిపోయిన కూరగాయల తొలగింపు..!
  • విద్యార్థినిలకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి లేకుంటే చర్యలు తప్పవు…!

చెన్నారావుపేట విద్యార్థినిలకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని చెన్నారావుపేట తహసిల్దార్ ఫణి కుమార్,ఎంపీడీవో గడ్డం దయాకర్ అన్నారు.ఈనెల 8న సోమవారం’ఆదాబ్ ‘దినపత్రికలో సోషల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్ లో దొడ్డు అన్నం..నీళ్ల చారు..స్టోర్ రూమ్ లో తుట్టెలు కట్టిన బియ్యం,వల్లిపోయిన కూరగాయలు.అని వచ్చిన కథనానికి వారు వెంటనే స్పందించారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం చెన్నారావుపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాల భవనంలో కొనసాగుతున్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, కళాశాల (దుగ్గొండి)ను వారు సందర్శించారు.అధికారులు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ సందర్శనకు వెళ్లేసరికే హాస్టల్ నిర్వాహకులు స్టోర్ రూమ్ లో తుట్టెలు కట్టిన బియ్యం బస్తాలు,వల్లిపోయిన కూరగాయలను తొలగించారు.వాటి స్థానాల్లో నాణ్యత ప్రమాణాలతో కూడిన సన్న బియ్యం బస్తాలను, కూరగాయలను ఏర్పాటు చేశారు.అంతేకాక సోషల్ వెల్ఫేర్ హాస్టల్ పరిసరాల్లో బ్లీచింగ్ పౌడర్ ను చల్లించి పరిశుభ్రంగా ఉంచడం గమనార్హం.ఈ సందర్భంగా అధికారులు విద్యార్థినిలకు వండిపెట్టిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.అలాగే స్టోర్ రూమ్ ను తనిఖీ చేశారు.తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థినిలతో స్వయంగా మాట్లాడారు.ప్రతిరోజు విద్యార్థినిలకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని ప్రిన్సిపాల్ రజినికి సూచించారు.

మధ్యాహ్న భోజనం వండి పెట్టే నిర్వాహకులకు రుచి,శుచికరమైన భోజనాన్ని అందజేయాలని ఆదేశించారు.అలాగే టెండర్ ద్వారా హాస్టల్ కు కూరగాయలను సరఫరా చేసే నిర్వాహకుడిని తాజా కూరగాయలను సరఫరా చేసే విధంగా చూసుకోవాలని తెలిపారు.అలాగే పాఠశాల ప్రిన్సిపాల్,ఉపాధ్యాయినీలకు విద్యార్థినిల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు,సలహాలు ఇచ్చారు.వారి వెంట కోనాపురం పంచాయతీ కార్యదర్శి కత్తెరపెల్లి రాజు, తహసిల్దార్ కార్యాలయం ఆఫీస్ సబార్డినేట్ నరసయ్య,తదితరులు పాల్గొన్నారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This