తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ ని నియమించే అవకాశం ఉంది.ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.బుధవారం ఇందుకు సంభందించిన ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.పంజాబ్ లోని జలంధర్ లో జన్మించిన ఆయన 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి.ప్రస్తుతం హోం శాఖ ముఖ్యకార్యదర్శి,విజిలెన్స్-ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.