Friday, September 20, 2024
spot_img

జెర్ర వాగును కాపాడండి… సారు.!

Must Read
  • రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుప్రాఖుర్దు గ్రామస్థుల వేడుకోలు
  • వాగును ఆక్రమించుకున్న రియల్ ఎస్టేట్ సంస్థ
  • భూకబ్జాకు పాల్పడ్డ సుభిషి గ్రూప్ ఆఫ్ కంపెనీ
  • పంట పొలాలు కొనుగోలు చేసి వెంచర్ ఏర్పాటు
  • పక్కనే ఉన్న 62/అ, 76/అ కాలువ కబ్జా
  • మిగులు భూమి సైతం ఆక్రమించుకున్న సుబిషి కంపెనీ

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు అయినకాంచి ఇక్కడ భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రియల్ భూమ్ సంస్థలు కోకొల్లలు గా ఏర్పడి ఓ వైపు అమాయక ప్రజలకు భూములు ముట్టజెబుతూ, మరోవైపు ఖాళీగా ఉన్న భూములపై వీళ్ల కన్నుపడుతుంది. పుట్టగొడుగుల్లా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏర్పడడంతో పాటు ప్రభుత్వం, ప్రజా ప్రతినిధుల అండదండలతో మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతున్నాయి. ఎక్కడ అసైండ్ భూమి ఉందా, పుట్టలు, గుట్టలు, చెర్వులు, కాల్వలు కబ్జా చేసేందుకు అనుకూలంగా ఉన్నాయా అనే వెతుకులాటలో పడతారు కబ్జాకోరులు.

తెలంగాణలో మా భూమి కబ్జాకు గురైంది అని బోరున విలపించేవారు చాలా మందే ఉన్నారు. ఇలాంటి కష్టమే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుప్రాఖుర్దు గ్రామస్థులకు వచ్చింది. ఇక్కడ ఏండ్లుగా అన్న సాగునీటి కాల్వ కబ్జాకు గురైంది. సుభీషి గ్రూపు ఆఫ్ కంపెనీ (రియల్ ఎస్టేట్) పెద్ద మొత్తంలో పంట పొలాలు కొనుగోలు చేసి వాటిని వెంచర్లుగా మార్చి భూములు సేల్ చేస్తున్నారు. అందులో భాగంగా పక్కనే ఉన్నా పంటపొలాలకు వెళ్ళే సర్వే నెంబర్. 62/అ, 76/అ లో ఉన్న సాగునీటి కాల్వను కబ్జా చేయడం జరిగింది. మరియు ఆ ప్రాంతంలో ఉన్న మిగులు భూమి (మూడు ఎకరాలు) ని కూడా కబ్జా చేయడం జరిగింది. ఈ విషయమై ఉన్నతాధికారులకు పిర్యాదు చేసిన తమకు న్యాయం జరగడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు.

రియల్ ఎస్టేట్ బిజినెస్ లో భాగంగా సరిహద్దులో ఉన్న అన్నదాతల వద్ద నుంచి వ్యవసాయ భూములు లాక్కోవలనే ఉద్దేశంతో టార్చర్ పెడుతున్నారు. పరిసర ప్రాంత భూములకు వెళ్ళకుండా అడ్డుగా ప్రహరీగోడ నిర్మించి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రభుత్వ అధికారుల సపోర్ట్ తో సుభిషి సంస్థ అమాయక రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. కొందరు రాజకీయ నాయకుల పలుకుబడితో వెంచర్ చేసి ప్లాట్స్ అమ్మకాలు జరుపుతున్నట్లు ఆరోపిస్తున్నారు.

ఇకనైనా ఆక్రమణకు గురైన సాగునీటి కాల్వను కాపాడి, మిగులు భూమిని కూడా కబ్జా నుండి విడిపించాలని తుప్రఖుర్దు రైతులు కోరుతున్నారు. కలెక్టర్ దృష్టిసారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This