Friday, September 20, 2024
spot_img

బీఆర్ఎస్ సర్కార్ లో.. బ‌ది’లీలలు’

Must Read
  • గ‌త ప్ర‌భుత్వంలో యధేచ్చగా అక్ర‌మ బ‌దిలీలు
  • నాటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ అండదండలతో అరాచకాలు
  • అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందే పలువురికి స్థాన‌చ‌ల‌నం
  • ఎక్సైజ్ శాఖలో నిజాయితీప‌రుల‌కు తీవ్ర అన్యాయం
  • ప్ర‌శ్నించిన అధికారుల‌కు, ఉద్యోగుల‌కు వేధింపులు
  • నేడు అదే కంటిన్యూ చేస్తున్న కాంగ్రెస్ సర్కార్.?
  • యువరాజు పెత్తనానికి అధికారుల ఫుల్ సపోర్ట్

గత పదేళ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలు అంతా ఇంతాకాదు. మంత్రులు, ఎమ్మెల్యేల ప్రొద్బలంతో కొందరి పెత్తనం కొనసాగేది బహిరంగంగానే చర్చించుకునేవారు. ఉన్నత అధికారులను సైతం అదిరించి, బెదిరించి పనులు చేయించుకునే వారని టాక్. అధికారమదంతో ట్రాన్సఫర్, ప్రొమోషన్స్ చేయించుకునేవారు. వాళ్ల అనుయాయులకు కావాల్సిన ఆఫీసర్లను పెట్టుకునేవారని తెలుస్తోంది. ప్రశ్నించే, సిన్సియర్ గా వర్క్ చేసే ఉద్యోగులకు నాటి ప్రభుత్వంతో తిప్పలు తప్పేవి కావు. అప్పటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో ఎంతోమంది ఉద్యోగులు సతమతం అయ్యారని ఆరోపణలు ఉన్నాయి. ఎక్సైజ్ శాఖలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తాసు పలుకుతోందా అనే అనుమానాలు కలుగకమానదు. బదిలీలపై తాజాగా రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఎన్నికలకు ఆరు నెలల ముందు నుండే నిబంధనలను కాలరాస్తూ నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అక్రమ బదిలీలకు తెరలేపారు. తన అనుంగ అధికారుల కోసం రూల్స్ ను బుట్ట దాఖలు చేసినట్టు సమాచారం. తనవారిపై అక్రమాలు అవినీతిపరులనే ముద్ర ఉన్నప్పటికీ పట్టించుకోకుండా వారు కోరుకున్న చోటికి బదిలీలు చేసిపడేశారు.

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా నిజాయితీగా ఉద్యోగం చేసే అధికారులను తన అనుంగుల కోసం బలి పశువులను చేశారు. శ్రీనివాస్ గౌడ్ హయాంలో వారి ప్రభుత్వం చివరి రోజుల్లో ఉన్న సమయంలో అక్రమ పద్దతిలో ఎడాపెడా చేసిన బదిలీల వల్ల అక్రమార్కులు కీలక స్థానాల్లో తిష్ట వేశారు. దాదాపు ముప్పైకి పైగా బదిలీలు జరగగా అందులో పదిహేను మంది వరకు ఎలాంటి ఫిర్యాదు లేని సిన్సియర్ అధికారులు కూడా అన్యాయానికి గురయ్యారు. సిన్సియర్ గా పనిచేస్తున్న తమనెందుకు ఉన్నఫలంగా బదిలీ చేస్తున్నారని ప్రశ్నించిన అధికారులను, ఉద్యోగులను మంత్రి గారి అనుచర అధికార ఘనం తీవ్ర ఇబ్బందులకు గురిచేసినట్లు తెలుస్తోంది. నిజానికి ఎక్సైజ్ శాఖలో ఉన్న చోట రెండేళ్ల సర్వీస్ పూర్తయితేనే బదిలీ చేయాల్సి ఉంటుంది. లేదంటే ప్రత్యేక పరిస్థితుల్లో నిబంధనలను అనుసరించి మాత్రమే ట్రాన్స్ ఫర్ చేయాల్సి ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందే ఇష్ట రాజ్యాంగ ప్రభుత్వం నుండి ప్రత్యేక ఉత్తర్వులు జారీచేయించి మరీ నాటి ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అక్రమ బదిలీలకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. శ్రీనివాస్ గౌడ్ ఓ ఎక్స‌జ్ శాఖ మంత్రి అయి వుండి.. మున్సిప‌ల్ శాఖ మంత్రికి లేఖ రాయ‌డం విడ్డూరం ఉంది… ప్రశ్నించిన అధికారులు, ఉద్యోగులు వేధింపులకు గురికావడంతో ఎన్నికల సమయంలో ఈ విషయం బయటకు రాకుండా పోయింది.

ఒత్తాసు పలుకుతున్న కాంగ్రెస్ గవర్నమెంట్.!
బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పీడ విరగడైందని, తమను వేధించిన మాజీ మంత్రి అనుంగ అధికార ఘనానికి తగిన శాస్తి జరుగుతుందని భావించిన వారికి చేదు అనుభవం ఎదురైంది. నాటి అక్రమ బదిలీలను రద్దు చేయకుండా రెండేళ్ల సర్వీస్ ను పట్టించుకోకుండా… వాటిని యదాతథంగా కొనసాగిస్తూ రెండేళ్లు పూర్తి చేసిన వారిని మాత్రమే బదిలీ చేస్తామంటూ ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం… నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్యాయానికి గురైన అధికారులను, ఉద్యోగులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కొత్త ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని భావించామని, కానీ రాజకీయ నాయకులు పార్టీలతో సంబంధం లేకుండా అంతా ఒకటే అని నిరూపించుకున్నారని, ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వ అక్రమాలను సమర్ధించడం తీవ్ర అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు ముందు ప్రభుత్వ అక్రమ ఉత్తర్వులతో యథేచ్ఛగా బదిలీలకు పాల్పడి తన అనంగులను, అక్రమార్కులకు కీలక స్థానాలను కట్టబెట్టిన మాజీ మంత్రి వైనంపై విచారణ జరిపించాలని, వెంటనే నాటి ప్రభుత్వం జారీ చేసిన అక్రమ ఉత్తర్వును రద్దు చేయాలనీ వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే బయటకు వచ్చి మాట్లాడేందుకు వారు సాహసించక పోవడం వల్ల వారి ఆక్రోశం అరణ్య రోదనగా మిగిలిపోతోంది.

యువరాజు పెత్తనానికి అధికారుల సపోర్ట్ :
నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిబంధనలు పూర్తిగా అపహాస్యం చేస్తూ కేటీఆర్ ఎలా పెత్తనం చెలాయించాడో, అధికారులను ఎలా తన కనుసన్నలలో నడిపించాడు. చెప్పడానికి ఎక్సైజ్ శాఖలో జారీచేసిన ప్రభుత్వ ఉత్తర్వు నిదర్శనం. ఐఏఎస్ గా ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు కనీస నిబంధనలు పాటించకుండా రాజావారు చెప్పిందే తడవుగా వెనకా ముందూ చూడకుండా ఉత్తర్వులు ఇచ్చి పడేశారు. వరుసగా రెండుసార్లు గెలిచి అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తొమ్మిదిన్నరేళ్ళ పాటు ఎక్సైజ్ మంత్రిగా శ్రీనివాస్ గౌడ్ పనిచేశారు. ఆయన అంతకుముందు మున్సిపల్ శాఖలో అదనపు కమిషనర్ గా పనిచేశారు. ఉన్నత విద్య, ఉన్నత ఉద్యోగంలో కొనసాగి ప్రభుత్వ పాలనా, విధానపరమైన నిర్ణయాలు, విధివిధానాలపై సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తి శ్రీనివాస్ గౌడ్. అలాంటి వ్యక్తి మంత్రిగా తన శాఖకు సంబందించిన నిర్ణయాల ఫైల్ ను ముఖ్యమంత్రి ఆమోదానికి పంపకుండా, సహచర మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆమోదం కోసం ఎలా పంపిస్తారు? వినడానికే విడ్డూరంగా అనిపిస్తోంది కదా. కానీ నిజంగానే ఇది పచ్చి నిజం. ఎన్నికలకు కొన్ని నెలలముందు ఎక్సైజ్ శాఖలో బదిలీలకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతూ రూపిందించిన ఫైల్ ను శ్రీనివాస్ గౌడ్ నేరుగా కేటీఆర్ కు పంపించారు. ఆ ఫైల్ ను పరిశీలించిన కేటీఆర్… పరిశీలించి ఆమోదించాల్సిందిగా చీఫ్ సెక్రెటరీకి సూచిస్తూ రికమండ్ చేశారు. శ్రీనివాస్ గౌడ్ పంపిన లేఖపై తాను పెన్నుతో సీఎస్ గారు ఎక్జామిన్ అండ్ కన్సిడర్ అని పెన్నుతో రాసి సంతకం చేసి మరీ కేటీఆర్ సీఎస్ కు పంపించారు. ఒక మంత్రిగా, గతంలో ఉన్నత స్థానంలో పనిచేసిన ప్రభుత్వ అధికారిగా శ్రీనివాస్ గౌడ్ దిగజారుడు తనంతో వ్యవహరిస్తే కేటీఆర్ ఎందుకు తప్పు పట్టలేక పోయాడు? లేని అధికారాన్ని ఎలా ఆపాదించుకున్నాడు. నేరుగా ఫైలుపై రికమండ్ చేస్తూ సంతకం ఎలా చేస్తాడు? ఇవన్నీ నాటి యువరాజ వారి పెత్తనానికి.. అయన హుకూం లను జీ హుజూర్ అంటూ పాటించిన పేరుగొప్ప ఐఏఎస్ అధికారులకే తెలియాలి.

గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలపై దృష్టిపెట్టాల్సిన రేవంత్ సర్కార్ ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో తెలియాలి. ఆయా డిపార్ట్ మెంట్ లలో జరిగే అక్రమ ట్రాన్స్ ఫర్స్, ప్రమోషన్స్ పై జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేయాలి. ఇంత అడ్డంగా ఎన్నికల ముందు జరిగిన అక్రమ తంతుపై తెలిసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This