Wednesday, December 4, 2024
spot_img

కాంగ్రెస్ ప్రభుత్వం నియంతృత్వ ధోరణి ప్రదర్శిస్తుంది

Must Read

( బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణీ రుద్రమ )

డీఎస్సీ పరీక్ష వాయిదా కోసం ఉస్మానియా యూనివర్సిటీ వద్ద పోరాటం చేస్తున్న విద్యార్థులతో పాటు జర్నలిస్ట్ లపై పోలీసులు చేయి చేసుకోవడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణీ రుద్రమ.బుధవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు.ఈ సంధర్బంగా రాణి రుద్రమ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ సమయంలో వలస కాంగ్రెస్ పాలనలో తెలంగాణ యూనివర్సిటీలు ఏ విధంగా పోలీసుల లాఠీ దెబ్బలతో రక్త మొడినయో,మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో అదే పోలీసుల ధమన ఖాండ కనిపిస్తుందని విమర్శించారు.ఉద్యోగాల కోసం విద్యార్థుల బలిదానలతో తెచ్చుకున్న తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం,ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు అన్యాయం చేస్తున్నాయని తెలిపారు.కాంగ్రెస్ ఎన్నికల సంధర్బంగా మానిఫెస్టోలో పెట్టిన 2 లక్షల ఉద్యోగాలు ఇప్పటివరకు ఇవ్వలేదని అన్నారు.డీఎస్సీ వాయిదా కోసం పోరాడుతున్న విద్యార్థుల పై చేయి చేసుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శమని మండిపడ్డారు.మీడియా ప్రతినిధిని చొక్కా పట్టుకుని లాక్కెళ్లడం అంటే ప్రశ్నించే గొంతుల పై ఉక్కు పాదం మోపడమే అవుతుందని,వెంటనే డీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.మీడియా మిత్రుల పై పోలీస్ ల దాడి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Latest News

శ్రీశైలం ఆలయాన్ని దర్శించుకున్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం కుటుంబసభ్యులతో కలిసి శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానన్ని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS