ఈ తొలకరి వాన చినుకుల పరిమళం నా శ్వాసతో నా మదిలో కి చేరి,
నా కంటి పాపకు తెలిపి,నిద్రలో ఉన్న నా మనసుని ఊరించి,
ఈ పరిమళాలను ఆస్వాదించమని నాతో గోల చేస్తున్నాయి.
అయినా ఈ పరిమళాలు ఎంత సేపు, తొలకరి చినుకంత సేపు,
రైతులకు ఈ వర్షం ఇప్పుడు వరం,అమ్మ పాల కోసం వేచి చూసే
చంటి పాపాల,వెన్నెల కోసం వేచి చూసే కలువ పువ్వులా ఈ రైటన్నలు వాన కోసం ఎదురు చూశారు.ఇప్పుడు ఆ క్షణం వచ్చింది కానీ ఎంత సేపో ఈ ఆనందం,ఎన్నో ఏళ్ల నిరీక్షణల ఫలితం ఎంతో మంది రైతుల కలల ఫలం,భవిష్యత్తు తరాలకు బంగారు పంటను అందించాలని
పరితపిస్తూ,ఆరాటపడుతూ,కష్టపడుతున్న ఈ రైటన్నలకు యావత్తు ప్రపంచం తలవంచి ప్రణామం చేస్తుంది ఈ తరం
- సాయి కృష్ణ రెడ్డి