Friday, November 22, 2024
spot_img

కబ్జాదారుల భూదాహానికి అధికారుల ధనదాహం తోడైంది..

Must Read
  • గాగిల్లాపూర్ లో రెచ్చిపోతున్న భూకబ్జాదారులు…
  • కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి స్వాహా…
  • రెవెన్యూ అధికారుల తీరుతో హారతి కర్పూరంలా
    కరిగిపోతున్న ప్రభుత్వ భూమి…
  • భూ కబ్జాదారులకు కొమ్ముకాస్తున్న అధికారులపై
    విజిలెన్స్ విచారణ చేపట్టాలని స్థానికుల డిమాండ్…
    • వివిధ రకాల దాహాలుంటాయి..దప్పికతో అలమటించిపోతున్న వారికి ఒక్క గ్లాసు మంచినీళ్లు ఇచ్చామంటే అమృతంలా భావించి
      సేవిస్తారు.. మంచి దీవెనెలు అందిస్తారు.. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే దాహం అంతులేనిది.. అవినీతిమయంతో కూడుకున్నది..
      అదే అధికారుల ధనదాహం.. కబ్జాకోరుల భూదాహం.. మేడ్చల్ జిల్లా, దుండిగల్ మండలం, గాగిల్లాపూర్ లో ఒక అంతులేని అవినీతి
      ఆ వివరాలు ఒకసారి చూద్దాం..

అధికారుల ధన దాహం… భూ కబ్జాదారుల భూదాహానికి మేడ్చల్ జిల్లా, దుండిగల్ మండలం, గాగిల్లాపూర్ లోని సర్వేనెంబర్ 214లో కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలం హారతి కర్పూరంలా కరిగిపోతుంది. అమ్యమ్యాలకు అమ్ముడుపోయిన రెవెన్యూ అధికారులు అండతో భూ కబ్జాదారులు రెచ్చిపోయి ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపట్టి అమ్మకానికి సిద్ధంగా ఉంచారు.

నిన్న మొన్నటి వరకు వివాదస్పద స్థలాలపై దృష్టి సారించిన వారు… ఇప్పుడు ప్రభుత్వ భూమిపై కన్నేశారు. అధికార పార్టీ నాయకులం అంటూ కలరింగ్ ఇస్తూ.. కోట్ల విలువచేసే ప్రభుత్వ భూమిని మింగేస్తున్నారు. రెవెన్యూ అధికారుల అండదండలతోనే కబ్జాదారులు రెచ్చిపోతున్నారని బహిరంగంగా విమర్శలు వస్తున్నప్పటికీ అధికారులు మాత్రం తమకవేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన రెవెన్యూ అధికారులే కబ్జాదారులు ఇచ్చే కాసులకు కక్కుర్తి పడి తమ సంపూర్ణ మద్దతుని అందిస్తుండడం ముమ్మాటికి తమ విధి ధర్మానికి వెన్నుపోటు పొడవడమే అవుతుంది. భూకబ్జాదారులపై ల్యాండ్ గ్రాఫింగ్ కేసులు నమోదు చేయాల్సిన అధికారులు ఫిర్యాదుదారుల సమాచారాన్ని అక్రమార్కులకు అందిస్తుండడం చూస్తే అంతా వారికి తెలిసే జరుగుతుందని స్పష్టం అవుతుంది. భూ కబ్జాదారుల కొమ్ముకాస్తున్న అధికారులపై ఉన్నత అధికారులు దృష్టి సారించి శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వ స్థలం కబ్జా వ్యవహారంలో అధికారుల పాత్ర పై విజిలెన్స్ విచారణ చే పడితే అసలు విషయం బయటపడుతుంది. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వ స్థలాన్ని కాపాడతారా? కబ్జాదారులకి కొమ్ముకాస్తారా అనేది వేచి చూద్దాం…మరిన్ని వివరాలతో కథనాన్ని వెలుగులోకి తీసుకుని రానుంది ‘ ఆదాబ్ హైదరాబాద్ ‘.. ‘ మా అక్షరం అవినీతిపై అస్త్రం ‘…

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS