Wednesday, November 13, 2024
spot_img

కమ్మ అంటేనే కష్టపడే గుణం ఉన్నవారు- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు

Must Read

కమ్మ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీచ్..

  • కమ్మ అంటేనే కష్టపడే గుణం ఉన్నవారు.. అమ్మలాంటి ఆప్యాయత కలిగినవారు.
  • కమ్మవారు నేలను నమ్ముకుని కష్టపడి పనిచేస్తారు.
  • ఎక్కడ సారవంతమైన నేల ఉంటే అక్కడ కమ్మవారు కనిపిస్తారు.
  • కష్టపడటం… పదిమందికి సాయం చేయడం కమ్మవారి లక్షణం.
  • కమ్మసామాజికవర్గం నన్ను ఎంతగానో అభిమానిస్తుంది..

ఎన్టీఆర్ లైబ్రరీలో మేం చదువుకున్న చదువు.. మమ్మల్ని ఉన్నతస్థానంలో నిలబెట్టింది.
నాయకత్వానికి ఎన్టీఆర్ ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు. ఎన్టీఆర్ రాజకీయంగా ఎంతోమందికి అవకాశాలు ఇచ్చారు. దేశంలో ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంకీర్ణ రాజకీయాల వల్లే ఇవాళ చాలా మందికి రాజకీయ అవకాశాలు వచ్చాయి. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చేందుకు మీరు భాగస్వాములు కావాలి. మీలో నైపుణ్యాలను ప్రోత్సహించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మాకు భేషజాలు లేవు.. మేం కులాన్ని అభిమానిస్తాం.. ఇతర కులాలను గౌరవిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఎవరిపై వివక్ష ఉండదు.. అది మా ప్రభుత్వ విధానం కాదు.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ఒక హక్కు. నిరసన తెలపకుండా నియంత్రించాలనుకుంటే.. ఫలితాలు ఎలా ఉంటాయో మీరు చూశారు. జాతీయ స్థాయిలో తెలుగువారు లేని లోటు కనిపిస్తోంది.కుల, మతాలకు అతీతంగా జాతీయ స్థాయిలో రాణించే తెలుగువారిని ప్రోత్సహించాలి. వివాదంలో ఉన్న 5ఎకరాల కమ్మ సంఘం భూ సమస్యను పరిష్కరిస్తాం.. భూసమస్యను పరిష్కరించడంతో పాటు సంఘం భవన నిర్మాణానికి నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పదిమందికి సాయం చేసే మీ సహజ గుణాన్ని వీడొద్దని కోరుతున్నా..

Latest News

లగచర్ల ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయండి

డీజీపీని కోరిన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ అధికారులపై దాడి చేస్తే నోరుమెద‌ప‌ని వారు, అరెస్టులు చేస్తే ఎలా ఖండిస్తారు.. దాడికి పాల్ప‌డిన వారిపై చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకోవాలి వికారాబాద్ జిల్లాలో...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS