Friday, September 20, 2024
spot_img

నోటీసుల పేరుతో డ్రామా

Must Read
  • కాలయాపన చేస్తూ పరోక్షంగా సాకారం
  • దమ్మాయిగూడ మున్సిపాలిటీలో అవినీతి దందా
  • ఆదాబ్ కథనంతో కదలిన యంత్రాంగం
  • అనుమతులు లేకుండా స్కూల్ బిల్డింగ్ నిర్మాణం
  • ముందు నిర్మాణం… తర్వాత అనుమతులు
  • మాముళ్ల మత్తులో జోగుతున్న మున్సిపల్ సిబ్బంది
  • 90శాతం పనులు పూర్తైన చర్యలు శూన్యం
  • చోద్యం చూస్తున్న ప్రభుత్వ అధికారులు

‘డబ్బు కోసం గడ్డి తినే రకం’ అన్న చందంగా కొందరు ప్రభుత్వ అధికారులు వ్యవహరించడం సిగ్గుచేటు. ప్రజల కోసం పనిచేయాల్సిన ఉద్యోగులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేయడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులే కాదు, అధికారుల అవినీతి ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ లో కూడా ఆఫీసర్ లు అక్రమాలకు పాల్పడడం చూస్తుంటే వీళ్ల పాడు బుద్దిపోదు కావొచ్చు అనిపిస్తది. ‘తాను చెడ్డ కోతి వనమెల్లా చెరిచింది’ అన్నట్టు ప్రభుత్వ రంగ సంస్థలను అన్నింటిని అవినీతి మయంగా మారుస్తున్నారు కొందరు అవినీతి అధికారులు. ఒకటా, రెండా వాళ్ల అక్రమాల గురించి చెప్పుకుంటూ పోతే చాంతాడు కన్నా పెద్దగానే ఉంటుంది. పైసలకు కక్కుర్తి పడుతూ తన అనుకున్న వారికోసం ఎంతవరకు రిస్క్ చేసైనా పనిచేయడం విడ్డూరంగా ఉంది. అక్రమార్కులకు అడ్డుచెప్పకుండా అవినీతి మత్తులో జోగుతూ ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

దమ్మాయిగూడలో అక్రమ నిర్మాణాలు:
హైదరాబాద్ లోని దమ్మాయిగూడ మున్సిపాలిటీ అక్రమాలకు కేరాఫ్ అడ్డగా తయారైంది. మున్సిపాలిటీ పరిధిలో యధేచ్చగా భవన నిర్మాణాలు జరుగుతున్న అడ్డుకునే నాధుడే కరువయ్యాడు. దమ్మాయిగూడలో అక్రమార్కులు ఇష్టారీతిన బిల్డింగ్ కన్ స్ట్రషన్ చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా మున్సిపాలిటీలో నిర్మాణాలు చేపడుతున్నా కూడా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. దమ్మాయిగూడ సర్వే నంబర్ 464లో ఎలాంటి అనుమతులు లేకుండా స్కూల్ బిల్డింగ్ నిర్మాణ పనులు చేపడుతున్నా కూడా అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. మున్సిపాలిటీకి కూత వేటు దూరంలో ఉన్న ఈ నిర్మాణంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అధికారులు మాముళ్లు తీసుకోవడం వల్లనే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నల్లా కనెక్షన్ వేసుకుంటుంటే, రోడ్డును తవ్వి పైప్ లైన్ కోసం చిన్న గుంత తవ్వితే వెంటనే వచ్చి నిలదీసే మున్సిపల్ సిబ్బంది కొన్ని నెలలుగా బిల్డింగ్ కన్ స్ట్రషన్ వర్క్ అడిగేవైపు వచ్చి అడిగేవారు లేక పోవడం విడ్డూరం.

మాముళ్లు తీసుకొని, నోటీసుల డ్రామా :

‘దొంగలు పడిన ఆరునెల్లకు కుక్కలు మొరిగినట్లు’ ఉంది దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ యవ్వారం. హైదరాబాద్ లోని దమ్మాయిగూడ మున్సిపాలిటీ లో అక్రమ నిర్మాణాలు కోకొల్లలు జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా కమిషనర్ మాముళ్ల మత్తులో జోగుతున్నట్లు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 464లో చేపడుతున్న స్కూల్ నిర్మాణానికి మున్సిపాలిటీ నుండి ఎలాంటి అనుమతులు లేవు. అనుమతులు తీసుకోకుండా స్కూల్ బిల్డింగ్ నిర్మాణం చేపట్టడం.. దాన్ని ఎవరూ ఆపకపోవడం వెనుక ఆంతర్యామేంటి. హెచ్ఎండిఏ దరఖాస్తును తిరస్కరించడంతో అక్రమార్కులు మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారుల సంపూర్ణ సహకారాలతో నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సుమారు 90 శాతానికి పైగా పాఠశాల భవన నిర్మాణం పూర్తైన ఇంతవరకు అటువైపు వెళ్లకుండా, కనీసం అనుమతులు ఉన్నాయా లేవా అని చెక్ చేయకుండా ఉండడం అంటే అనుమానాలు రాకతప్పదు. అంత బిల్డింగ్ నిర్మాణం అయ్యేందుకు కనీసం 7 నుంచి 10నెలలు సమయం పడుతుంది. ఇన్ని నెలలు సీరియస్ బిల్డింగ్ కన్ స్ట్రషన్ జరుగుతుంటే మున్సిపల్ అధికారులు ఎటూ పోయారు అనేది వెయ్యి డాలర్ల ప్రశ్న. అంటే పాఠశాల భవనం కడుతున్న యజమాని వద్ద కమిషనర్ డబ్బులు తీసుకోవడం వల్లే నిర్మాణం అడ్డుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి.

ఆదాబ్ కథనం ఉలిక్కిపడ్డ యంత్రాంగం:

‘ముందు నిర్మాణం.. తర్వాత పరిష్మన్’ అనే శీర్షికతో ఆదాబ్ లో వచ్చిన కథనంతో దమ్మాయిగూడ మున్సిపల్ యంత్రాంగం కదిలింది. ఈ వార్త దెబ్బకు జంకిన మున్సిపల్ కమిషనర్ కొత్త డ్రామాకు తెరలేపాడు. నిజంగానే అనుమతులు లేకుండా స్కూల్ బిల్డింగ్ నిర్మాణం చేపట్టారు. సదరు యజమానికి త్వరలోనే నోటీసులు జారీ చేస్తామని చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా స్కూల్ బిల్డింగ్ కన్ స్ట్రషన్ చేస్తున్న వ్యక్తిపై చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని కమిషనర్ సమాధానం ఇవ్వడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏడు, ఎనిమిది నెలలు బిల్డింగ్ నిర్మాణం జరుగుతుంటే కనీసం సోయి లేకుండా ఉండడం ఏంటి.. అందులో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది. కమిషనర్ మాముళ్లు తీసుకొని కావాలనే సైలెంట్ గా ఉన్నట్లు సమాచారం. అందుకే ఇప్పుడు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది.

నోటీసులు జారీ చేశామంటూ కాలయాపన చేస్తూ అక్రమార్కులకు మున్సిపల్ కమిషనర్ రాజమల్లయ్య సహకరిస్తున్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలను కమిషనర్ పెంచి పోషిస్తున్నట్టు ఆరోపిస్తున్నారు. అక్రమ నిర్మాణాలతో తన జేబు నింపుకుంటున్న కమిషనర్ రాజ మల్లయ్య, టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీధర్‌లను విధుల నుండి తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This