Saturday, September 6, 2025
spot_img

దేశ అభివృద్ధి కోసం అందరం కలిసి పోరాడాలి

Must Read
  • 2047 వికసిత భారత్ స్వప్నాన్ని సాకారం చేసే విధంగా కేంద్ర బడ్జెట్
  • మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తోలి బడ్జెట్ ప్రవేశపెడ్తున్నాం
  • ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ముందుకు సాగుతున్నాం
  • కొత్త ఎంపీలకు అవకాశం ఇవ్వాలి
  • పార్లమెంట్ సమావేశాలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోదీ

2047 వికసిత భారత్ స్వప్నాన్ని సాకారం చేసే విధంగా కేంద్ర బడ్జెట్ ఉంటుందని తెలిపారు ప్రధాని మోదీ.సోమవారం వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.మంగళవారం పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.ఈ సందర్బంగా పార్లమెంట్ సమావేశాలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు.భారత దేశ ప్రజల స్వప్నాలని సాకారం చేసే దిశగా పార్లమెంట్ సమావేశాలు సాగాలని తెలిపారు.మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మంగళవారం తోలి బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని వెల్లడించారు.ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.ఎన్నికల్లో అన్నీ పార్టీలు హోరాహోరీగా పోరాడాయి,దేశ అభివృద్ధి కోసం అందరు కలిసి పోరాడాల్సిన అవసరముందని అన్నారు.పార్లమెంట్ సమావేశాల్లో కొత్త ఎంపీలకు అవకాశమివ్వాలని ప్రధాని మోదీ కోరారు.

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img

More Articles Like This