ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్ కోసం ఎమ్మెల్సీ కవిత చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి.మరోసారి కవితకు నిరాశ తప్పలేదు.డిఫాల్ట్ బెయిల్ పై విచారణ మరోసారి వాయిదా పడింది.కవిత దాఖలు చేసిన బెయిల్ ఫిటిషన్ పై సోమవారం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరిపింది.60 రోజుల గడువులో పూర్తిస్థాయి చార్జిషీట్ దాఖలు చేయడంలో సీబీఐ విఫలమైందని కవిత తరుపున న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు.సీబీఐ ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్ట్ చేసారని కోర్టుకు తెలిపారు.ఈ మేరకు విచారించిన కోర్టు తదుపరి విచారణను ఆగష్టు 05 వరకు వాయిదా వేసింది.మరోవైపు గత నాలుగు నెలల నుండి తీహార్ జైలులోనే ఉన్న కవిత బెయిల్ కోసం విశ్వా ప్రయత్నాలు చేస్తున్న ఆ ప్రయత్నాలన్నీ విఫలం అవుతున్నాయి.