Friday, September 20, 2024
spot_img

తెలంగాణ పై కేంద్రానిది కక్షసాధింపు : సీఎం రేవంత్ రెడ్డి

Must Read

తెలంగాణకు నిధులు ఇచ్చే బాధ్యత కేంద్రానికి లేదా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి.కేంద్రం ప్రకటించిన బడ్జెట్ పై స్పందించారు.ఈ సంధర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,ఢిల్లీకి వెళ్ళి ప్రధాని మోదీని మూడుసార్లు కలిసిన లాభం లేకుండా పోయిందని అన్నారు.విభజన చట్టం వంకతో ఏపీకి నిధులు ఇచ్చారు కానీ అదే చట్టం ప్రకారం తెలంగాణకు ఎందుకు నిధులు ఇవ్వలేదు అని ప్రశ్నించారు.తెలంగాణ పై కేంద్రానిది కక్ష సాధింపు అని,ప్రధాని మోదీ మొదటి నుండే తెలంగాణ పై కక్ష చూపించారని విమర్శించారు.పెద్దన్న పాత్ర పోషించాలని ప్రధాని మోదీను పదే,పదే కోరిన లాభం లేకుండా పోయిందని తెలిపారు.కేంద్రం ప్రకటించిన బడ్జెట్ లో తెలంగాణ పదాన్నే నిషేదించారని మండిపడ్డారు.సభలో తెలంగాణ పదాన్ని పలకడానికి కూడా వారికి మనసు ఒప్పలేదని విమర్శించారు.తెలంగాణకు ఇంతటి విపక్ష ఎప్పుడు జరగలేదని,రాష్ట్ర ప్రజలకు బీజేపీ నాయకత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.సబ్ కా సత్ సబ్ కా వికాస్ బీజేపీ బోగస్ నినాదామని,కేవలం వారికి కావాల్సింది ఓట్లు,సీట్లు మాత్రమేనని ఆరోపించారు.తెలంగాణకు జరిగిన అన్యాయం పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాజీనామ చేయాలని డిమాండ్ చేశారు.మాకు మద్దతు ఇవ్వండి,మీకు నిధులు ఇస్తాం అనేల బడ్జెట్ ఉందని మండిపడ్డారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This