Monday, November 25, 2024
spot_img

అక్రమార్కుల చేతిలో టీ.ఎస్‌.బి.పాస్‌ చట్టం..?

Must Read
  • పూర్తిగా విఫలమైన స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌..
  • ప్రభుత్వ విజిలెన్స్‌, నిఘా విభాగాలు దృష్టి సారించలేని పరిస్థితి..
  • జి.హెచ్‌.ఎం.సిలో ఓ అవినీతి తిమింగలం అడ్డదారిలో అక్రమ అనుమతుల జారీ.. !
  • అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకునే ఉన్నతాధికారులు స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ టీంగా ఏర్పాటు కాకపోవడం ఏమిటి..?
  • ఇది పూర్తిగా వైఫల్యం అంటున్న మేధావి వర్గం..
  • అభాసుపాలవుతున్న తెలంగాణ స్టేట్‌ బిల్డింగ్‌ పర్మిషన్‌ అప్రూవల్‌ అండ్‌ సెల్ఫ్‌ వెరిఫికేషన్‌ సిస్టమ్‌.. !
    టీఎస్‌-బీపాస్‌ అమల్లోకి వచ్చిన అనంతరం భవన నిర్మాణ అనుమతుల్లో టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల భాగస్వామ్యం లేకుండా నేరుగా భవన నిర్మాణదారులే టీఎస్‌-బీపాస్‌ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని అనుమతులు మొదట్లో పొందారు. కానీ రాను రాను పూర్తిగా టి.ఎస్‌.బి పాస్‌ అధికారుల చేతుల్లోకి వెళ్లి తప్పుదారి పట్టింది.. ఇది జీర్ణించుకోలేని సత్యం.. టీఎస్‌-బీపాస్‌ నిబంధనల ప్రకారం 75 చదరపు గజాలలోపు స్థలంలో నిర్మించే భవన నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని ప్రభుత్వం నిర్ణయించింది. కేవలం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసి, నామమాత్రంగా ఒక్క రూపాయి మాత్రం చెల్లిస్తే సరిపోతుంది. 75 గజాల నుంచి 600 గజాల వరకు స్వీయ ధ్రువీకరణ పత్రం ద్వారా అనుమతులిస్తున్నారు అనేది ప్రశ్నార్ధకంగా మిగిలిపోయిన వ్యవహారం..600 గజాలపైన 21 రోజుల్లో అనుమతులు మంజూరు చేస్తారు.. ఒకవేళ నిర్ణీత గడువులోగా అనుమతులు మంజూరు చేయలేనట్లయితే.. డీమ్డ్‌ అప్రూవల్‌ జారీ అవుతుంది. టౌన్‌ ప్లానింగ్‌ అధికారులకు సంబంధం లేకుండా, జిల్లా అదనపు కలెక్టర్‌ ఆధ్వర్యంలోని జిల్లా స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం (ఇరిగేషన్‌, ఆర్‌ అండ్‌ బీ, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు)క్షేత్రస్థాయిలో ప్రతి పదిహేను రోజులకోసారి తనిఖీలు నిర్వహిస్తారు.. అనే మాట అబద్ధంగా మిగిలిపోయింది.వాస్తవాలను తప్పుగా పేర్కొని, నిర్మాణాన్ని చేసినట్లయితే ఎటువంటి నోటీసు ఇవ్వకుండానే సదరు నిర్మాణదారులకు జరిమానా విధించడంతోపాటు సంబంధిత భవన నిర్మాణాన్ని కూలగొట్టడం లేదా స్వాధీనపర్చుకుంటారు. ఈ విషయం కూడా అధికారులకు డబ్బులు సంపాదించుకోవడానికి అస్త్రంగా మారింది.. పేపర్ల వరకే నోటీసులు ఇచ్చి దురాక్రమణదారున్ని భయపెట్టి డబ్బులు ఇవ్వగానే వదిలేయడం జరుగుతోంది.. (అక్రమ నిర్మాణాలకు నోటీసులు ఇచ్చినా ఎన్ని భవన నిర్మాణాలు కూల్చివేశారు..? ఎన్నింటికి ఫైన్‌ వేశారు..? వాటి వివరాలను పరిశీలిస్తే పూర్తి ఆధారాలు బయటపడతాయి..) వందల్లో ఇలాంటి వారి విషయంలో సాక్షాదారాలున్నాయి.. టీఎస్‌ బి పాస్‌ లో నోటీసు లేకుండానే అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తామనే నిబంధన పూర్తిగా మరుగునపడిపోయింది.. ఒక అక్రమ నిర్మాణదారుడు హైకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు టౌన్‌ ప్లానింగ్‌ ఉన్నత అధికారులకు,ప్రభుత్వానికి మొట్టికాయలు వేస్తూ.. అతి క్రూరుడైన మరణశిక్ష పడ్డ నేరస్తులకి క్షమాభిక్ష ఉంటుంది.. అలాంటిది అక్రమ నిర్మాణం చేపడితే సదరు నిర్మాణదారుడికి తెలియపరచకుండా ఎలా కూల్చివేస్తారు..? అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి, టీఎస్‌ బిపాస్‌ పై హుకుం జారీ చేసింది..ఎవరైనా నిర్మాణదారుడు తప్పిదాలకు పాల్పడితే మూడు నోటీసులు ఇచ్చి, తదుపరి చర్యలు తీసుకోవాలని తెలియపరిచింది..

ఆలోచనలో పడ్డ టి ఎస్‌ బి పాస్‌ నిర్వహణ అధికారులు :

కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా మూడు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలని ఉన్నత స్థాయి అధికారులు, కిందిస్థాయి పట్టణ ప్రణాళిక అధికారులకు డైరెక్షన్స్‌ ఇచ్చారు.. జిహెచ్‌ఎంసిలో అయితే అక్రమ నిర్మాణాలపై డిప్యూటీ కమిషనర్‌ కింద అసిస్టెంట్‌ కమిషనర్‌ ఏఎంసి ఫిర్యాదులు స్వీకరించి, నోటీసులు జారీ చేయించాలి.. ఈ రిపోర్టును ఎస్‌ టి ఎఫ్‌ స్పెషల్‌ టాస్క్ఫోర్స్‌ టీం కి పంపించాలి.. అంటే ఉన్నత స్థాయి అధికారి జోనల్‌ కమిషనర్‌ కి పంపించాలి.. జోనల్‌ కమిషనర్‌ తను నియమించుకున్న ఎస్టిఎఫ్‌ టీం..కు ఆ రిపోర్ట్‌ ను పంపి, దానికి సంబంధించిన చర్యలను చేపట్టాలి.. కానీ అలా జరగటం లేదు.. పూర్తి కాలయాపన.. ఫిర్యాదులపై జీరో యాక్షన్‌.. జవాబుదారీతనం నిర్వీర్యం అయిపొయింది.. అక్రమ నిర్మాణాలపై నియంత్రణ లేకుండా పోయింది..ఇక కిందిస్థాయి పట్టణ ప్రణాళిక అధికారులు అక్రమ నిర్మాణాలను గుర్తించి నోటీసులు జారీ చేసి, బేరం మాట్లాడుకుని లక్షల కోట్లు మూట కట్టారు అనడానికి ఆధారాలు ఎన్నో ఉన్నాయి.

అయితే కొందరు ఉన్నత అధికారులు సైతం ఒక అడుగు ముందుకేసి…పారదర్శకత కరువైపోవడంతో ఎవడు చూస్తున్నాడులే.. నేను చేసే తప్పు ఎవరికీ తెలియదు.. నన్ను ఎవరు పట్టుకోలేరు. అనే విచ్చలవిడితనంతో, ఎలాగైనా డబ్బు సంపాదించాలనే అవినీతి అధికారులకు దేవుడిచ్చిన వరంగా మారింది టీఎస్‌.బి.పాస్‌.

టి.ఎస్‌.బి.పాస్‌ అక్రమాలపై నియంత్రణ కరువు :

ఎస్‌ టి ఎఫ్‌.. స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ పూర్తిగా విఫలం కావడంతో అక్రమాలను నియంత్రించేవారు లేక అవినీతి అధికారులకు ఆడిరది ఆట పాడిరది పాటగా.. ఇష్టం వచ్చినట్లుగా అక్రమ పద్ధతిలో పర్మిషన్లు ఇవ్వడం.. ప్రొబిటెడ్‌ నిషేధించబడ్డ స్థలంలో పర్మిషన్లు ఇవ్వడం.. మున్సిపల్‌ టి.డి.ఆర్‌ నిబంధనలను తుంగలో తొక్కి లక్షల్లో బేరం మాట్లాడుకుని, అక్రమ పద్ధతిలో బిల్డింగ్‌ అనుమతులు ఇచ్చి, కొందరు అవినీతి పట్టణ ప్రణాళిక అధికారులు కోట్లకు పడగలెత్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.. జిహెచ్‌ఎంసిలో ఒక డైరెక్టర్‌ స్థాయి అధికారి అడిషనల్‌ సీసీపీగా విధులు నిర్వహిస్తున్న ప్రదీప్‌ కుమార్‌ లక్షల లంచం తీసుకొని అక్రమ పద్ధతిలో ఇచ్చిన పర్మిషన్ల చిట్టా మీ ముందు ఉంచుతున్నాము..

ప్రమోద్‌ కుమార్‌ కాదు ‘ప్రమాద’ కుమార్‌..

మున్సిపల్‌ చట్టాన్ని ధిక్కరించి, టిడిఆర్‌ నిబంధనలను అతిక్ర మించి, ఫైర్‌ అండ్‌ సేఫ్టీ నిబంధనలను అతిక్రమించి, అక్రమంగా 20 ఫీట్ల రోడ్డుకి టిడిఆర్‌ ఇచ్చిన ఘనుడు ఈ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి.. వాటి వివరాలు ఫైల్‌ నెంబర్‌ మీరు చూడొచ్చు..

  1. ఫైల్‌ నెం:004244/G/2164/2/2022-
  2. ఫైల్‌.నెం:007861/G/3906/2/2023 మరియు 007860/G/3905/2/2023 రెండు ఫైల్‌లు తిరస్కరించబడ్డాయి. అదే ఫైల్‌ తర్వాత ఆమోదించబడుతుంది..
  3. 008546/G/4235/2/2023.
  4. 010607/G/5237/2/2023-
  5. 007691/G/3825/2/2023 మిడ్‌ ల్యాండిరగ్‌ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్‌ జారీ చేయబడిరది.. 25 అడుగుల రహదారి..
  6. 009135/G/2/2023
  7. 008545/G/4234/2/2023, సంగీత దున్గర్వాల్‌,5 అంతస్తుల కోసం 25 అడుగుల రోడ్డు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ జారీ చేయబడిరది..
  8. 008546/G/4235/2/2023-
    తిరస్కరించబడిన ఫైల్‌.నం:008043/G/3956/1/2022-, రమీలా పోకర్‌, ప్లాట్‌.నెం:6, ఖాప్రా యొక్క 3 ఇతరులు మరియు ఫైల్‌తో మళ్లీ మంజూరు చేసి జారీ చేయబడింది నం:011375/G/5600/1/ అదే సైట్‌ యొక్క 2022-ూజ.. ముందు సెట్‌బ్యాక్‌లలో విచలనం.. సైట్‌లో రోడ్డు విస్తరణ ప్రాంతంలో ఎడమవైపు కాకుండా పూర్తి ూజ ప్రమాణపత్రం నిబంధనలకు విరుద్ధంగా జారీ చేయబడిరది.

తిరస్కరణకు గురైన ఓ.సి బిల్డింగ్‌ ఆక్యుపేన్సీ సర్టిఫికెట్‌ ను పట్టణ ప్రణాళిక అధికారిని అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ టౌన్‌ ప్లానింగ్‌ శ్రావణి, సైట్‌ ఇన్స్పెక్షన్‌ చేసి అధిక మొత్తంలో డబ్బులు తీసుకుని పలుమార్లు రిజెక్ట్‌ అయిన ఆకు పెన్సిల్‌ సర్టిఫికెట్‌ ను రిలీజ్‌ చేశారు.. ఈ అవినీతిలో అడిషనల్‌ సీసీపీ ప్రదీప్‌ కుమార్‌ కి కూడా భాగం ఉంది…! ఇలా అక్రమాలకు పాల్పడితే ఎన్నో అనార్ధాలు జరుగుతాయి.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు అవినీతి పట్టణ ప్రణాళిక అధికారులు..

అగ్ని ప్రమాదాలను ప్రోత్సహిస్తున్న పట్టణ ప్రణాళిక అధికారులు..! :

ఫైర్‌ అండ్‌ సేఫ్టీ నిబంధనలకు విరుద్ధంగా బిల్డింగ్‌ పర్మిషన్లు, ఆక్యు పెన్సి సర్టిఫికెట్లు ఇవ్వడంతో.. అక్రమ నిర్మాణంతో హాస్పిటల్స్‌ నిర్వహించి, లాడ్జిలు, హోటల్స్‌ నిర్వహించి, అగ్ని ప్రమాదాలకు గురికావడంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతోంది.. ఇలాంటి అగ్ని ప్రమాదాలకు మొట్టమొదట ఆజ్యం పోస్తుంది పట్టణ ప్రణాళిక అధికారులే అనడంలో అతిశయోక్తి లేదు..

తీవ్రమైన ట్రాఫిక్‌ సమస్యలకు మూల కారణం పట్టణ ప్రణాళిక అధికారులే..! :

ఇరికిరుకు రోడ్లలో అక్రమ పద్ధతిలో పర్మిషన్లు ఇస్తున్న టౌన్‌ ప్లాని ంగ్‌ అధికారులు 20 ఫీట్లకు 25 ఫీట్లకు మున్సిపల్‌ నిబంధనల కు, టిడిఆర్‌నిబంధనలకు విరుద్ధంగాఅదనపుఫ్లోర్లు అనుమతులు ఇచ్చి, ట్రాఫిక్‌సమస్యలను పెంచుతున్నది కూడా పట్టణ ప్రణాళిక అధికారులు అనడంలో ఎలాంటి సందేహం లేదు.. జిహెచ్‌ఎం సిలో బడా అవినీతి ప్రదీప్‌ కుమార్‌ మిగతా అవినీతి తిమిం గలాలపై మరొక కథనంలో పూర్తి ఆధారాలతో ప్రజల ముందుకు

Latest News

రూ.27 కోట్లతో రిషబ్ పంత్‎‎ని సొంతం చేసుకున్న లక్నో

ఐపీఎల్ 2025 మెగా వేలం ఆదివారం ప్రారంభమైంది. మెగా వేలంలో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ రికార్డు ధర పలికాడు. లక్నో టీం పంత్‎ను...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS