Friday, September 20, 2024
spot_img

కాలేజీలో అక్రమ వసూళ్లు

Must Read
  • నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ ఇష్టారాజ్యం
  • నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా డోనేషన్ల వ‌సూలు చేస్తున్న యాజమాన్యం
  • ఒక్కొ సీటుకు లక్షలాది రూపాయల వసూలు
  • పేద పిల్లలకు భారంగా మారిన ఇంజనీరింగ్ విద్య
  • కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఓయూ జేఏసీ అధ్య‌క్షుడు బైరు నాగ‌రాజు గౌడ్ డిమాండ్

పేదోడి పిల్లలు చదువుకునేందుకు ఎన్నో అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. బతుకు భారమైన ఈ రోజుల్లో ఏదో ఓ చోట ఫీజుల తంటాలు ఎదురవుతూనే ఉన్నాయి. ‘అందని ద్రాక్ష పుల్లన’ అన్నట్టే మన దేశంలో పేద, మధ్యతరగతి ఇంట్లో పుట్టిన బిడ్డలకు చదువు భారంగానే అవుతుంది. ఇందుకు ఉదాహరణే తెలంగాణలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ప్రైవేటు బడులు, కార్పోరేట్ స్కూల్స్, కాలేజీలే. ఒకటా, రెండా చిట్టా తీస్తే శాంతాడంత అవుతాయి. అందులో ఓ మచ్చుతునక హైదరాబాద్ లోని నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్. ఈ కళాశాల యాజమాన్యం అక్రమంగా డోనేషన్లు వసూళ్లు చేస్తు విద్యార్థులను నానా ఘోసపెడుతున్నట్లు వాపోతున్నరు. ఇక తట్టుకోలేక బుధవారం నాడు ఓయూ జేఏసీ విద్యార్థి సంఘం తరపున నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ ముందు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు.

ఈ సందర్భంగా ఓయూ జేఏసీ అధ్యక్షుడు బైరు నాగరాజు గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో వృత్తి విద్య కోర్సులైన ఇంజనీరింగ్, పార్మాసి కళాశాలలు దోపిడికి పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఆయా కాలేజీలు కన్వీనర్ కోట ద్వారా 70% సీట్లు, యాజమాన్య కోట ద్వారా కేటగిరీ (బీ 30% ) అడ్మిషన్లు చేపట్టాలని నిబంధనలు ఉన్నాయని గుర్తు చేశారు. కానీ అందుకు విరుద్ధంగా కళాశాల యాజమాన్యాలు ప్రవర్తిస్తున్నాయని నాగరాజు గౌడ్ మండిపడ్డారు. ఎంసెట్ పరీక్ష నిర్వహించి కన్వీనర్ కోట ద్వారా ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా ప్రభుత్వమే అడ్మిషన్లు చేపడుతుండగా, బీ కేటగిరీ సీట్లను ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా అడ్మిషన్లు చేపట్టాల్సి ఉండగా కళాశాల యాజమాన్యాలు ధనార్జనే ధ్యేయంగా విద్య వ్యాపారానికి తెరలేపుతున్నాయని వాపోయారు. గతంలో కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులు, ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలలో ఉన్న లోపాలను ఆసరాగా చేసుకుని కాలేజీలు ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు చేస్తున్నట్లు వివరించారు. మార్గదర్శకాలను విస్మరిస్తూ యాజమాన్య కోట సీట్లను బహిరంగంగా లక్షల్లో డోనేషన్లు వసూళ్లు చేస్తూ కోట్లల్లో వ్యాపారం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నట్లు పేపర్ ప్రకటనలు ఇస్తూ తప్పుడు డాక్యుమెంట్లు ప్రభుత్వానికి సమర్పిస్తూ కాసుల కోసం యాజమాన్యాలు విద్యార్థుల జీవితాలతో చేలగాటం ఆడుతున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఎంసెట్ ఫలితాల ఆధారంగా కన్వీనర్ కోట సీట్ల భర్తీ అనంతరం నోటిఫికేషన్ విడుదల చేసి ప్రతిభ ఆధారంగా కేటాయించాల్సిన బీ- కేటగిరీ సీట్లను ఎంసెట్ పరీక్ష నిర్వహించకముందే మార్కెట్ లో లేని పోటి సృష్టించి రోజుకో రేటుతో విద్య వ్యాపారాన్ని కొనసాగిస్తూ విద్యార్థులను, తల్లిదండ్రులను తీవ్రంగా మోసాగిస్తున్నారు. అక్రమంగా డోనేషన్లు వసూళ్లు చేస్తున్న కాలేజ్ ల పై క్రిమినల్ కేసులు పెట్టాలని ఓయూ జేఏసీ అధ్యక్షుడు బైరు నాగరాజు గౌడ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంగిస్తు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యాలపై అడ్మిషన్ల పై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి నిబంధనలు ఉల్లంఘించిన కాలేజ్ ల గుర్తింపు రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అదే విధంగా మేనేజ్ మెంట్ల కోట సీట్లను కూడా అప్లికేషన్ తీసుకొని, జేఈఈ ర్యాంక్ ఫస్ట్ ప్రయార్టీ, ఆ తర్వాత ఎంసెట్, ఇంటర్ మార్కులను పరిగణలోకి తీసుకోవాలి కానీ ఇవేవి మేనేజ్ మెంట్ లు పట్టించుకోవడం లేదన్నారు. నోటిఫికేషన్ టైం లోను దరఖాస్తులను స్వీకరించకుండా, ఒకవేళ తీసుకున్న వాటిని పక్కనే పడేస్తున్నారని చెప్పారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This