Friday, November 22, 2024
spot_img

మెడికల్ షాపులపై మెరుపు దాడులు

Must Read
  • అక్రమ నిల్వలపై డీసీఏ కేసులు
  • జంట నగరాల పరిధిలోని 20 మెడికల్‌ షాపుల లైసెన్సులు సస్పెండ్‌
  • నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఓ మెడికల్‌ షాపు లైసెన్స్‌ పూర్తిగా రద్దు
  • డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల విక్రయం
  • బిల్లులు ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా అమ్ముతున్న మెడికల్ షాప్స్
  • రిజిస్టర్ వ్యక్తి లేకుండానే మెడికల్ షాపుల నిర్వహణ
  • అనారోగ్యం, మరణానికి కారణమయ్యే మెడిసిన్ ను అమ్ముతుండడంపై సీరియస్

తెలంగాణలో డీసీఏ విస్తృత తనిఖీలు చేపడుతోంది. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీ వి.బి. కమల్ హాసన్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారుల బృందం సోదాలు నిర్వహిస్తున్నారు. గతేడాది జులైలో డీసీఏకు డైరెక్టర్ జనరల్ గా కమల్ హాసన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి నేటివరకు తెలంగాణలోని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ చాలా పటిష్టంగా నడుస్తోంది.

రాష్ట్రంలో మెడికల్ షాపులు నిబంధనలు ఉల్లంఘిస్తే వాటిపై వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మెడికల్ షాపుల లైసెన్స్ లు సస్పెండ్ చేయడం, అవసరమైతే పూర్తిస్థాయిలో లైసెన్స్ లు రద్దు చేయడం జరుగుతుంది. ఇటీవల కాలంలో మెడికల్ దుకాణాలపై చాలా కేసులు బుక్ చేసి క్రిమినల్ చర్యలు తీసుకుంటున్నారు.

తెలంగాణ డీసీఏ ఆధ్వర్యంలో బృందాలు ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేస్తున్నారు. అందులో భాగంగా జులై నెల మొదటి వారం నుంచి ఇప్పటి వరకు సిటీలో వరుస సోదాలు జరుగుతున్నారు. బుధవారం హైదరాబాద్, సికింద్రాబాద్ లో డీజీ కమల్ హాసన్ రెడ్డి ఆధ్వర్యంలో బృందం వివిధ మెడికల్ షాపుల్లో రైడ్స్ చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జోన్ల పరిధిలోని అక్రమాలకు పాల్పడుతున్న 20 మెడికల్ షాపుల లైసెన్స్ లు సస్పెండ్ చేశారు. డీసీఏ నిబంధనలు ఉల్లంఘించిన ఒక మెడికల్ షాపు లైసెన్స్ పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఇకపై ఎవరైనా ప్రభుత్వ నియమాలు పాటించకుంటే క్రిమినల్ చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.

కాగా, హైదరాబాద్, సికింద్రాబాద్ జోన్ల పరిధిలోని మెడికల్ షాపులపై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ మెరుపు దాడులు నిర్వహించింది. హైదరాబాద్‌లోని టాస్క్ ఫోర్స్ కమిషనర్ ఫిర్యాదు మేరకు డీసీఏ అధికారులు ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా అక్రమ విక్రయాలపై దాడులు చేశారు. ఈ నెల (జులై) మొదటి వారం నుండి డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ వారు తెలంగాణలోని మెడికల్ షాపులపై వరుస సోదాలు చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం నాడు రెండు జంట నగరాల పరిధిలోని వివిధ మందుల షాపుల్లో సోదాలు చేశారు. ఈ దాడుల్లో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి రావడంతో డీసీఏ అధికారులే అవాక్కయ్యారు.

అక్కరరాని మందులు, మనుష్యులను అనారోగ్యానికి గురిచేసే మెడిసిన్ ఎక్కువగా విక్రయిస్తున్నట్లు సోదాలు తేలింది. అంతేకాకుండా తక్కువ రోగానికి ఎక్కువ మందులు ఇస్తూ ప్రజల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు సోదాల ద్వారా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని కోడిన్‌తో కూడిన దగ్గు సిరప్‌లు, నైట్రావెట్ (నైట్రాజెపామ్) ట్యాబ్లెట్‌లు, రెస్టైల్ (అల్‌ప్రజోలం) ట్యాబ్లెట్‌లు, అల్ట్రాసెట్ ట్యాబ్లెట్‌లు (ట్రామాడోల్), టైడోల్ టాబ్లెట్‌లు (టాపెంటాడోల్) వంటి అలవాటును పెంచే మందుల అక్రమ విక్రయాలను డీసీఏ గుర్తించింది. డ్రగ్స్ రూల్స్‌లోని షెడ్యూల్ హెచ్1, షెడ్యూల్ ఎక్స్‌ కింద ప్రధానంగా వర్గీకరించబడిన అనేక ఔషధాల విచక్షణారహిత అమ్ముతున్నట్లు సోదాల టైంలో అధికారులు గుర్తించారు.

మరోవైపు ఎమ్మార్పీలు సైతం ఇష్టారీతిన వేసి కొన్ని మెడికల్ షాపులు రకరకాల పేర్లతో విక్రయిస్తున్నాయి. అంతేకాకుండా ఏ మెడికల్ షాపుకు రిజిస్టర్ (సర్టిఫికేట్) వ్యక్తి పేరు ఉందో వాళ్లు సదరు మందుల దుకాణంలో అందుబాటులో లేకపోవడం, అనర్హులతో (ఇంటర్) మెడిసిన్ షాపులు నిర్వహిస్తున్నట్లు డీసీఏ అధికారులు గుర్తించగలిగారు. అదేవిధంగా కోడైన్ సిరప్‌లు మరియు నైట్రాజెపామ్ టాబ్లెట్‌ల వంటి అలవాటును కలిగించే మందుల దుర్వినియోగం తీవ్రమైన శారీరక, మానసిక పరిణామాలకు దారి తీస్తుంది. ఈ పదార్ధాలు తరచుగా వాటి ఉపశమన ప్రభావాల కోసం దుర్వినియోగం చేయబడతాయి, దీని ఫలితంగా ఆ మందులు వ్యసనంగా, ఎడిక్ట్ అయ్యే ప్రమాదం ఉన్నట్టు తెలిపారు.

ఈ ఔషధాల యొక్క నిరంతర దుర్వినియోగం లేదా అధిక మోతాదు శ్వాసకోశ మాంద్యం, మూర్ఛలు, కోమాలోకి వెళ్లడం, మరణానికి కూడా కారణమయ్యే మందులను కమిషన్ కోసం డబ్బుతో చాలా మెడికల్ షాపుల్లో విక్రయిస్తున్నట్లు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ వారు గుర్తించడం జరిగింది. ఇంకా అల్ప్రాజోలం యొక్క దుర్వినియోగం చేయకూడదు.. ఎందుకంటే మత్తు, మగత, మైకము, గందరగోళం, బలహీనమైన సమన్వయం, జ్ఞాపకశక్తి సమస్యలు, శ్వాసకోశ మాంద్యం, ముఖ్యంగా ఆల్కహాల్ లేదా ఇతర కేంద్ర నాడీ వ్యవస్థ డిప్రెసెంట్‌లతో కలిపి ఉన్నప్పుడు. అల్ప్రాజోలం యొక్క దీర్ఘకాలిక దుర్వినియోగం శారీరక మరియు మానసిక ఆరోగ్యం రెండింటికీ తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుంది, ఇందులో అభిజ్ఞా బలహీనత, మానసిక రుగ్మతలు మరియు ప్రమాదాలు పెరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఇలాంటి మెడిసిన్ డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా ఇవ్వకూడదని అధికారులు సూచించారు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జోన్లలోని 20 మెడికల్‌ షాపుల లైసెన్సులు సస్పెండ్‌ చేశారు. అదేవిధంగా డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ నిబంధనలకు విరుద్దంగా మందులను అక్రమంగా విక్రయించినందుకు గాను ఒక మెడికల్‌ షాపు లైసెన్స్‌ను పూర్తి రద్దు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అలాగే అలవాటుగా మార్చే మందులను అక్రమంగా విక్రయించడం తీవ్రమైన నేరం, ఇదీ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం ప్రకారం శిక్షార్హమైనది. డ్రగ్స్ రూల్స్ నిబంధనలను ఉల్లంఘించే ఎడిక్ట్ అయ్యే మందుల విక్రయాలు చేసే మెడికల్ షాపులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీఏ అధికారులు హెచ్చరించారు. మరోవైపు మెడికల్ షాపులు. ఔషధాలకు సంబంధించిన ఇతర చట్టవిరుద్ధమైన కార్యకలాపాల ద్వారా అలవాటును కలిగించే మందులను అక్రమంగా విక్రయించడం గురించి ఏవైనా ఫిర్యాదులుంటే డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, టోల్-ఫ్రీ నంబర్ 1800-599-6969 ద్వారా ఫోన్ ద్వారా తెలుపవచ్చు. ప్రతిరోజు ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 వరకు పని చేస్తుందని అధికారులు వివరించారు.

Latest News

జగన్ ఏపీని ఆదానీ రాష్ట్రంగా మార్చేశారు

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా మాజీ సీఎం, వైసీపీ అధినేత ఏపీని ఆదానీ రాష్ట్రంగా మార్చేశారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా అన్నారు. శుక్రవారం హైదరాబాద్ లో...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS