- నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్
అమ్మవారి దయతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి.సోమవారం శ్రీ అక్కన్న మాదన్న ఆలయ నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఆలయాన్ని సందర్శించి అమ్మవారి ఊరేగింపును ప్రారంభించారు.భారీ జనసందోహం మధ్య,హరిబౌలి (అక్కన్న మాదన్న ఆలయం) నుండి ఏనుగు (అంబారి) ఊరేగింపు ప్రారంభమైంది.ఈ సందర్భంగా కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, బోనాల జాతరకు రావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.శ్రీ అక్కన్న మాదన్న ఆలయ నిర్వహకులందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.సిటీ పోలీసు తరుపున అమ్మవారి దయతో తెలంగాణ రాష్ట్రం మొత్తం సుఖ సంతోషాలతో ఉండాలని పేర్కొన్నారు.హైదరాబాద్ ప్రజల సుఖసంతోషాల కోసం కొరకు అహర్నిశలు పనిచేస్తామని తెలిపారు. హైదరాబాదు భిన్న సంస్కృతికి ప్రతికాని పేర్కొన్నారు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆలయం వద్ద,ఊరేగింపు మార్గంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని వెల్లడించారు.భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేశామని అన్నారు.మహిళా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా (షీ టీమ్) ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని,ఈవ్ టీజింగ్,చైన్,పిక్ పాకెట్ దొంగతనాలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో విక్రమ్ సింగ్ మాన్ ఐపీఎస్ అడిషినల్ సిపి,ఎల్ అండ్ ఓ,పి విశ్వప్రసాద్ ఐపీఎస్ అడిషనల్ సీపీ ట్రాఫిక్,స్నేహా మెహ్రా ఐపిఎస్ డిసిపి సౌత్ జోన్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.