Friday, September 20, 2024
spot_img

రిక్రూట్మెంట్ లో గోల్ మాల్.?

Must Read
  • సిబ్బంది నియామక ప్రక్రియలో అవకతవకలు
  • జనగామ జిల్లాల్లో ఉద్యోగాల భర్తీ వెలుగు చూసిన మోసం
  • మహిళా, శిశు సంక్షేమ శాఖలో 8పోస్టులకు నోటిఫికేషన్
  • తూతూ మంత్రంగా ఉద్యోగాల భర్తీ
  • అర్హులను పక్కన పెట్టి అనర్హుల ఎంపిక
  • ఇదేంటని ప్రశ్నిస్తే మళ్లీ సరిచేస్తామంటూ బుకాయింపు
  • జిల్లా శాఖా అధికారిణిపై దర్యాప్తు జరపాలని డిమాండ్

తెలంగాణ రాష్ట్రంలో సర్కారు నౌకర్ల నియామకంలో అవకతవకలు జరగడం పరిపాటైంది. రాష్ట్రం వచ్చి పదేళ్ల అయిన నాటినుంచి ఇదే కథ. ఏ డిపార్ట్ మెంట్ చూసిన అక్రమ రిక్రూట్మెంట్ లే దర్శనం ఇస్తాయి. గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇలాంటి ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. సివిల్ సర్వీస్ తర్వాత అతిపెద్ద పోస్టులైన గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీలోను అక్రమాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అక్కడ నుంచి మొదలు అటెండర్, స్వీపర్ ఉద్యోగాలను సైతం లక్షల రూపాయలకు అమ్ముకోవడం దారుణం. ఇప్పుడు ఇలాంటి విషయమే తాజాగా వెలుగులోకి వచ్చింది. మహిళా, శిశు సంక్షేమ శాఖ లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో గోల్ మాల్ జరిగినట్లు వెల్లడైంది. జిల్లా స్థాయి అధికారులే ఇందులో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.

వివరాల్లోకి వెళితే.. జిల్లాల్లో మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ పరిధిలోని ఉద్యోగాల భర్తీలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. వివిధ సహాయ కేంద్రాల నిర్వహణకు అవసరమైన సిబ్బంది నియామక ప్రక్రియ ఓ కొలిక్కి రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ శాఖ పరిధిలో కొన్ని జిల్లాల్లో మహిళా సహాయక కేంద్రాల్లో, మరికొన్ని చోట్ల ఛైల్డ్ హెల్ప్ లైన్ లో ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి గతేడాది మే, జూన్ నెలల్లో ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో జనగామ జిల్లా మినహా అన్ని జిల్లాల్లో భర్తీ ప్రక్రియ అదే ఏడాది జులై, ఆగస్టు నెలల్లోనే పూర్తయింది. కానీ ఈ జిల్లాలో మాత్రం ఎన్నికల సాకుతో భర్తీ ప్రక్రియ పూర్తి చేయకపోవడం గమనార్హం. జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు, వయో వృద్దులశాఖ పరిధిలో బాలల సహాయ కేంద్రంలో పని చేసేందుకు జూన్ 3న ఉద్యోగ ప్రకటన జారీ చేయడం జరిగింది. ప్రాజెక్టు సమన్వయకర్త-1, కౌన్సెలర్-1, స్టోల్ట్ హెల్ప్ లైన్ సూపర్వైజర్-3, కేస్ వర్కర్స్-3 కాగా మొత్తం 8 పోస్టుల కోసం జాబ్ నోటిఫికేషన్ ను అధికారులు రిలీజ్ చేశారు.

ఉద్యోగ భర్తీ ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కాగా జూన్ 13లోగా వందమందికి పైగా నిరుద్యోగులు అప్లై చేసుకున్నారు. అయితే జులై 11న అధికారులు వారి ధృవపత్రాలను పరిశీలించడం జరిగింది. ఆ తర్వాత నెలలో (ఆగస్టు) 1:3 నిష్పత్తిలో కొందరినీ సెలక్ట్ చేసి అభ్యర్థులతో ముఖాముఖీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో మెరిట్ మార్క్స్ , అనుభవం కలిగిన వారికి ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇస్తామని చెప్పడం జరిగింది. మరో వారం పది రోజుల్లో నియామక ప్రక్రియను పూర్తి చేసి ఎంపికైన వారికి నియామక ఉత్తర్వులు ఇస్తామని అభ్యర్ధులకు తెలుపారు. మూడేళ్లు అనగా 2026 వరకు పని చేసే ఒప్పందంతో ఉద్యోగులను నియమించాల్సి ఉంది. కానీ ఇతర జిల్లాలతో పోలిస్తే… జనగామ జిల్లాలో ఈ పోస్టులకు ఎంపికయ్యే వారు ఇప్పటికే నాలుగు నెలలు నష్టపోయినట్లేనని వాపోతున్నారు. మెరిట్ ప్రకారం నియామకాలు జరగాల్సి ఉండగా, పలు రకాల ఒత్తిళ్లు రావడంతో అధికారులు ఇరకాటంలో పడినట్లు తెలుస్తోంది. ఉద్యోగాల భర్తీలో పైరవీలకు తలొగ్గి నియామకాలు చేపట్టినట్లు అర్థమవుతోంది. ప్రాజెక్ట్ కో – ఆర్డినేట‌ర్ వంగాల ర‌వికుమార్‌, కౌన్సెల‌ర్ గుగ్గిల మ‌మ‌త‌, చైల్డ్ హెల్స్‌లైన్ సూప‌ర్‌వైజ‌ర్లు కె శ్రీధ‌ర్‌, మాచ‌ర్ల అశోక్‌, టి. ప‌ద్మావ‌తి, కేస్ వ‌ర్క‌ర్లు స‌ముద్రాల నాగ‌రాజు, రాగ‌ల్ల క‌విత‌, లింగాల ప్ర‌శాంత్‌లను కాకుండా లోపాయికారి ఒప్పందాల‌తో ఉద్యోగాల భ‌ర్తీ పూర్తి చేశారు. ఈ ఉద్యోగాలకు అనర్హులతో నియామకాలు చేశారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అర్హులైన అభ్యర్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అర్హుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో సెలెక్ట్ చేసిన ఎనిమిది మందిని పునః పరిశీలిస్తామని జిల్లా సంక్షేమ అధికారి తెల్పడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఏదైనా డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాలకు సెలెక్ట్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయాల్సి ఉంటుంది. అధికారులు ఎంతో కసరత్తు చేసి మరీ అర్హులతో ఆ ఖాళీలను నింపాలి. ఎలాంటి రాజకీయ, డబ్బు ఆశకు లొంగకుండా నిక్కచ్చిగా చేపట్టాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసే ముందు నోటిఫికేషన్ ప్రకారం క్వాలిఫై ఉన్న అభ్యర్థులకు మాత్రమే నియామకం చేపట్టాల్సి ఉంటుంది. కానీ స్వార్థ ప్రయోజనాల కోసం సెలెక్ట్ చేసి ఆరోపణలు రావడంతో మళ్లీ పునః పరిశీలిస్తామని చెప్పడం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు ఇప్పటికైనా అర్హత ఉన్న అభ్యర్థులను రిక్రూట్మెంట్ చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This