ఓ బీసీ అన్నలారా,అక్కల్లారా ఇకనైనా మేల్కొంటారా!
బీసీ కులగణన కుంటు పడకముందే గళం ఎత్తి గర్జిద్దాం..
బిసి రిజర్వేషన్ల కొరకు పోరాటం చేద్దాం..
అగ్రవర్ణాల ఆధిపత్యానికి దాసోహం అంటారా!
అస్తిత్వం కోసం పోరాటానికి నడుం బిగిద్దాం..
బీసీలు ఓట్ల అప్పుడే యాది కొచ్చే మర మనుషులేనా!
బీసీలలో మేధావులకు కొదవలేదు కానీ కుల గణన కోసం ఎవరు ముందుకు రావట్లేదు…
మన మౌనం,మన బీసీల మనుగడనే దెబ్బతీయకముందే ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకుందాం..
ఎన్నో ఉద్యమాలను ముందుండి నడిపిన మనం,ఎందుకు వెనకడుగు వేస్తున్నామో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి?
పచ్చ నోట్ల కట్టలు,అగ్రవర్ణాల అధికార బలం మన నోటికి తాళం వేస్తుందా అనే అనుమానం తేలేత్తుతుంది..
గల్లీ నుండి ఢిల్లీ వరకు బీసీలకు అడుగడుగునా అన్యాయమే కదా!
బీసీల హక్కుల కోసం పోరాటానికి సిద్ధం కండి…
యాచించడం మానుకొని, శాసించే స్థాయికి వెళ్దాం పదండీ..
Must Read