Friday, September 20, 2024
spot_img

డేంజర్ బెల్స్ మోగిస్తున్న‌ టీ.ఎస్.బి. పాస్

Must Read
  • సామాన్య నిర్మాణదారులు, బిల్డర్స్ గగ్గోలు
  • నిర్మాణదారుడి జీవితాలతో చెలగాటమాని ఆగ్రహం
  • 200 చదరపు గజాల లోపు ఇంటికి ప్లాన్‌ లేకుండానే అనుమతులు
  • లోన్లు ఇచ్చేందుకు బ్యాంకర్లు నో
  • ఫైర్ సేఫ్టీ, మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు
  • టీఎస్ బిపాస్ వెబ్ సైట్ లో పారదర్శకత కరవు
  • టౌన్ ప్లానింగ్ అవినీతిపై నోరుమెదపని ఉన్నతాధికారులు దొంగలను సద్దికట్టడం కోసమేనా.!
  • జీహెచ్ఎంసి ఎల్బీనగర్ జోన్ సర్కిల్ – 3,5 అక్ర‌మంగా ప‌ర్మిష‌న్ల వివ‌రాలు మ‌చ్చుక‌కు కొన్ని

తెలంగాణ రాష్ట్రంలో సొంతంగా ఓ ఇల్లు నిర్మించుకుందామనుకున్న సామాన్యుడికి అదీ కలగానే మిగిలిపోతుంది.ఎందుకంటే సొంత జాగ ఉండి, కొద్దో గొప్పో అప్పొసప్పొ చేసి రెండు గదుల మందం గృహాన్ని కట్టుకుందామంటే ఎవరూ సహకరించడం లేదు.’కొండనాలుకకు మందేస్తే వున్న నాలుక ఊడిపోయింది’ అన్నట్టు ఇప్పుడు టీఎస్ బీపాస్ పరిస్థితి కూడా అలాగే ఉంది.చిన్నా, చితకా అయినా, ఒక మోస్తరు బిల్డర్స్ అయినా, మరో స్థాయి నిర్మాణదారుడు అయితే నేమి..వీరందరికీ ఇబ్బందులను తప్పించి,పారదర్శకంగా ఉండాలని భావించిన అప్పటి ప్రభుత్వం టీఎస్ బీపాస్ ని తీసుకుని వచ్చింది. సమస్యలు తీరకపోగా.. మరిన్ని ఇబ్బందులను తెచ్చి పెట్టింది ఈ చట్టం. ‘కర్ణుడి సావుకి అనేక కారణాలు అన్నట్టు’ దీనికి కూడా అనేకానేకం ఉన్నా..ఓం ప్రథమంగా టీఎస్ బీపాస్ ని అడ్డుపెట్టుకుని కొందరు అవినీతి అధికారులు చేస్తున్న అరాచకాలకు నిర్మాణదారులు కన్న కష్టాలు పడుతున్నారు..చివరికి తమ జీవితాలను సైతం జారవిడుచుకునే దారుణ పరిస్థితి ఎదురవుతోంది.

భవన నిర్మాణాల అనుమతుల్లో ఇబ్బందులను తొలగించేందుకు అప్పటి ప్రభుత్వం టీఎస్‌- బీపాస్‌ (తెలంగాణ స్టేట్‌ బిల్డింగ్‌ పర్మీషన్‌ అండ్‌ సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌) కొత్త మున్సిపల్‌ చట్టం-2019 తీసుకొచ్చి నవంబర్‌ 16వ తేదీన ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం టీ.ఎస్.బి.పాస్ నీ టి.జీ.బి పాస్ గా మార్చి చలామణి చేస్తున్నారు..ఇంతవరకు బాగానే ఉంది.. కానీ,గతంలో ఉన్న డిపిఎంఎస్ వెబ్ సైట్ పనితీరుతో టి.ఎస్.బి పాస్ పనితీరును పోల్చితే,పాత వెబ్ సైటే బెటర్ అనిపిస్తుంది..డిపిఎమ్ఎస్ లో పూర్తి పారదర్శకత కనిపించేది..సామాన్యుడు,నిర్మాణదారుడు ఎవరైనా కూడా సిటిజన్స్ సర్చ్ ద్వారా నిర్మాణ అనుమతులకు సంబంధించి అక్రమాలకు సంబంధించి పూర్తి వివరాలు వెబ్ సైట్ లో కనపడేవి..కానీ నేడు టిఎస్ బిపాస్ లో పారదర్శకత పూర్తిగా కరువైంది..నిర్మాణదారుడు ఫీజు చెల్లించి,ఫీజు రాక వెబ్ సైట్ లో కనబడక..ఎవరిని అడగాలో తెలియక..బాధల్లో కూరుకుపోయి అఘాయిత్యాలకు పాల్పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వ పెద్దలు దీనిపై దృష్టి సారించాలని పలువురు సామాజిక వేత్తలు విజ్ఞప్తి చేస్తున్నారు.

భవన నిర్మాణాల అనుమతుల్లో అవినీతికి చెక్‌ పెట్టి.. పారదర్శంగా సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్‌-బీపాస్‌ పూర్తిగా విఫలమైంది అనడంలో ఇలాంటి సందేహం లేదు.ఇండ్లు,వ్యాపార సముదాయాలు నిర్మించుకునే యజమానులకు 21 రోజుల్లో అనుమతులు ఇచ్చేలా చర్యలు చేపట్టి,భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు సక్రమంగా ఉంటే ఆన్‌లైన్‌లో స్వీయ ధ్రువీకరణతో అనుమతులు పొందేలా బీ-పాస్‌ను రూపొందించారు. అంతేకాదు,75 గజాల నుంచి 200 చదరపు గజాల్లో జీ ప్లస్‌ ఇంటికి ప్లాన్‌ లేకుండానే స్వీయ ధ్రువీకరణ ఆధారంగా ఒక రూపాయితో ఆన్‌లైన్‌లో అనుమతులు ఇచ్చేలా రూపకల్పన చేసింది.దీని ద్వారా ఇంటి నిర్మాణ అనుమతులు సులభతరం కావడంతోపాటు కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పుతున్నదని అప్పటి పెద్దలు అనుకున్నారు. దీనికి సంబంధించిన అధికారులు ఎవరైనా జాప్యం చేస్తే రోజుకు వెయ్యి రూపాయలు చొప్పున ఫైన్ ఉంటుందని కఠినమైన నిబంధన చట్టంలో పొందుపరిచారు. మొదట్లో కొందరు పట్టణ ప్రణాళిక అధికారులు జాప్యం చేయడంతో వారిపై ఫైన్ లు కూడా వేశారు, వసూళ్లు కూడా చేశారు. కానీ కాలం గడిచే కొద్దీ టీఎస్ బి పాస్ ను పట్టించుకున్న నాధుడే లేక, అధికారులు ఆడిందే ఆట, పాడిందే పాటగా సాంకేతికంగా చిన్న చిన్న తప్పులు చూపించి,నెలలు నెలలు ఫైళ్ళు టౌన్ ప్లానింగ్ అధికారుల వద్దనే ఉంచుకున్న దాఖలాలు వందల సంఖ్యలో ఉండడం గమనార్హం.

ఇక ఇళ్లు కట్టుకునేందుకు అప్పు తీసుకుందామన్న బ్యాంకులు ఇచ్చే పరిస్థితి లేదు.75 గజాల నుంచి 200 చదరపు గజాల్లో జీ ప్లస్‌ ఇంటికి ప్లాన్‌ లేకుండానే అనుమతులు అనే నిబంధన ఉండడంతో, ఇంటి లోన్ల కోసం..నిర్మాణ లోన్ల కోసం బ్యాంకుకు వెళితే ఆమోదించబడిన ప్లాన్ లేకపోవడంతో బ్యాంకులు కూడా లోన్ ఇవ్వలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీనివల్ల నిర్మాణదారులు చాలా నష్టపోతున్నారు. కొందరైతే హైవే రోడ్లను అనుకొని స్థలం ఉంటే ఆ స్థలాన్ని మూడు నాలుగు ముక్కలుగా చేసి 200 గజాలుగా ప్లాట్లుగా విభజించుకుని ఇష్టం వచ్చినట్లుగా ఎలాంటి సెట్ బ్యాట్ లేకుండా, మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా, ఫైర్ అండ్ సేఫ్టీ నిబంధనలకు వ్యతిరేకంగా కమర్షియల్ బిల్డింగ్ లు నిర్మిస్తున్నారు. తెలంగాణ ప్రజానీకానికి అనుకూలంగా, ఎంతో సుళువుగా, గొప్పగా ఉంటుంది అనుకుంటే.. నేడు పూర్తి వ్యతిరేకంగా టి.ఎస్. బి.పాస్ పనితీరు నడుస్తూ ఉంది. పట్టణ ప్రణాళిక అధికారులు, రెవెన్యూ అధికారులు ముడుపులు ఇస్తే గాని ఫైలు ముందుకు కదపడం లేదు.నేడు పట్టణ ప్రణాళిక విభాగంలో రెవెన్యూ విభాగంలో ప్రభుత్వ అధికారులు లక్ష రూపాయలు లేకుంటే ఇంటికి వెళ్ళను అనే ప్రతిజ్ఞ చేసి పోటీపడి సంపాదించేవారు ఎక్కువ మందే ఉన్నారు.

ఇక 75 గజాలకు ఒక రూపాయితో పర్మిషన్ అనడంతో 300 గజాలు ఉన్న నిర్మాణ నిర్మాణదారుడు చిన్నచిన్న భాగాలుగా విభజించుకొని ప్రభుత్వానికి మార్టిగేజ్ ఎగవేస్తూ, మున్సిపాలిటీకి కట్టవలసిన పన్ను ఎగరేస్తూ ప్రమాదకరమైన నిర్మాణాలు చేపడుతున్నారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి :

పూర్తి ఆధారాలతో టి ఎస్ బి పాస్ ద్వారా అక్రమంగా ఆమోదం పొందిన పర్మిషన్ల వివరాలు మచ్చుకకు కొన్ని :

జిహెచ్ఎంసి ఈస్ట్ జోన్ ఎల్బీనగర్ సర్కిల్ -5..

  1. ఫైల్ నెంబర్ : 337112/ జీహెచ్ఎంసి / 18662 / 2023, పర్మిట్ నెంబర్ : 337112 / 10140/ జీహెచ్ఎంసి / 2023..
    ఫైల్ నెంబర్ : 338121 / జీహెచ్ఎంసి /18901 / 2023, పర్మిట్ నెంబర్ : 338121 / 10271 / జీహెచ్ఎంసి /2023..
  2. ఫైల్ నెంబర్ : 56923/ జీహెచ్ఎంసి / 5763 / 2021, పర్మిట్ నెంబర్ : 2804 / జీహెచ్ఎంసి / 2021
    ఫైల్ నెంబర్ : 57103 / జీహెచ్ఎంసి / 5791 / 2021, పర్మిట్ నెంబర్ : 2802/ జీహెచ్ఎంసి / 2021
  3. ఫైల్ నెంబర్ : 50533 / జీహెచ్ఎంసి / 4575 / 2021, పర్మిట్ నెంబర్ : 2159 / జీహెచ్ఎంసి /2021
    ఫైల్ నెంబర్ : 50503 / జీహెచ్ఎంసి / 4571 / 2021, పర్మిట్ నెంబర్ : 2159/ జీహెచ్ఎంసి / 2021
  4. ఫైల్ నెంబర్ : 58274 / జీహెచ్ఎంసి / 6053 / 2021, పర్మిట్ నెంబర్ : 3672 / జీహెచ్ఎంసి / 2021
    ఫైల్ నెంబర్ : 58375 / జీహెచ్ఎంసి / 6078 / 2021, పర్మిట్ నెంబర్ : 3672 / జీహెచ్ఎంసి / 2021
  5. ఫైల్ నెంబర్ : 143451 / జీహెచ్ఎంసి / 4561 / 2022, పర్మిట్ నెంబర్ : 143451 /2651 / జీహెచ్ఎంసి / 2022
    ఫైల్ నెంబర్ : 143521 / జీహెచ్ఎంసి / 4574 / 2022, పర్మిట్ నెంబర్ : 143521 / 2650 / జీహెచ్ఎంసి / 2022
  6. ఫైల్ నెంబర్ : 168478 / జీహెచ్ఎంసి / 9565 / 2022, పర్మిట్ నెంబర్ : 168478 / 5568 / జీహెచ్ఎంసి / 2022
    ఫైల్ నెంబర్ :168474 / జీహెచ్ఎంసి / 9563 / 2022, పర్మిట్ నెంబర్ :168474 / 5571 / జీహెచ్ఎంసి / 2022

జీహెచ్ఎంసి ఎల్బీనగర్ జోన్ సర్కిల్ – 3.

  1. ఫైల్ నెంబర్ : 147268 / జీహెచ్ఎంసి / 5273 / 2022, పర్మిట్ నెంబర్ :147268 / 3053 / జీహెచ్ఎంసి / 2022
    ఫైల్ నెంబర్ : 147283 / జీహెచ్ఎంసి / 5276 / 2022, పర్మిట్ నెంబర్ : 147283 అప్లికేషన్ నెంబర్ : /3054 / జీహెచ్ఎంసి / 2022
  2. అప్లికేషన్ నెంబర్ : 407574 / జీహెచ్ఎంసి / 10130 / 2024, పర్మిట్ నెంబర్ : 407574 / 5212 / జీహెచ్ఎంసి / 2024
    అప్లికేషన్ నెంబర్ : 407578 / జీహెచ్ఎంసి /10133 / 2024, పర్మిట్ నెంబర్ : 407578 / 5211 / జీహెచ్ఎంసి / 2024
  3. ఫైల్ నెంబర్ : 400825 / జీహెచ్ఎంసి / 8664 / 2024..
    ఫైల్ నెంబర్ : 400838 / జీహెచ్ఎంసి / 8666 / 2024..
  4. అప్లికేషన్ నెంబర్ : 390093 / జీహెచ్ఎంసి / 6564 / 2024, పర్మిట్ నెంబర్ : 390093 / 3547 / జీహెచ్ఎంసి / 2024
    అప్లికేషన్ నెంబర్ : 390086 / జీహెచ్ఎంసి / 6563 / 2024, పర్మిట్ నెంబర్ : 390086 / 3546 / జీహెచ్ఎంసి / 2024

5.అప్లికేషన్ నెంబర్ : 382035 / జీహెచ్ఎంసి / 4759 / 2024, పర్మిట్ నెంబర్ : 382035 / 2683 / జీహెచ్ఎంసి / 2024
అప్లికేషన్ నెంబర్ : 382047 / జీహెచ్ఎంసి / 4760 / 2024, పర్మిట్ నెంబర్ : 382047 / 2684 / జీహెచ్ఎంసి / 2024

ఒక్క జీహెచ్ఎంసి ఈస్ట్ జోన్ లోనే కొన్ని సర్కిల్ లలో ఇన్ని అక్రమాలు జరిగాయి.. ఇంకా జరుగుతునే ఉన్నాయి.. ఈ లెక్కన చూసుకుంటే ఇక జీహెచ్ఎంసి అన్ని జోన్లలో, అన్ని సర్కిళ్లలో ఎన్ని అక్రమాలు చోటుచేసుకుంటున్నాయో..? ఊహకు కూడా అందడం లేదు. ఈ అక్రమ తంతు ఒక్క జీహెచ్ఎంసి లోనే కాకుండా, హెచ్ఎండిఏ,మున్సిపాలిటీ, గ్రామపంచాయతీలలో కూడా జరుగుతోంది. ప్రభుత్వం చొరవ తీసుకొని సిట్టింగ్ జడ్జితో, నిపుణులైన పరిశోధకులచే కమిటీని వేసి శోధిస్తే..వేలకోట్ల కుంభకోణం బట్టబయలు అవుతుంది.

కాబట్టి ఇకనైన కొత్త ప్రభుత్వం ఇలాంటి అక్రమాలు జరుగుతున్న జీహెచ్ఎంసీపై దృష్టిసారించి అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

నాలాలు, పార్కు స్థలాల్లో, ఓపెన్ స్పేస్ జోన్లలో అక్రమంగా పర్మిషన్లు..చెరువుల్లో,కుంటల్లో నిర్మాణ అనుమతులు.. ఎన్నో మోసాలు.. ఎన్నెన్నో అక్రమాలు..తదుపరి కథనంలో మీ ముందుకు…’ఆదాబ్ హైదరాబాద్ ‘.. ‘మా అక్షరం అవినీతిపై అస్త్రం’..

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This